News


వచ్చే ఏడాది ఓ మోస్తరు రాబడులే

Thursday 13th December 2018
Markets_main1544695872.png-22900

వచ్చే ఏడాది తొలి అర్ధ భాగంలో ఎన్నికలు ఉండటం వల్ల మార్కెట్లు రేంజ్‌బౌండ్‌లో ఉంటాయని, రెండో అర్ధ భాగంలో మోస్తరు రాబడులను అందిస్తాయని ఏబీఎస్‌ఎల్‌ ఎంఎఫ్‌ కో-సీఐవో మహేశ్‌ పాటిల్‌ తెలిపారు. ఆయన ఒక ఆంగ్ల చానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ విషయాన్ని వెల్లడించారు. వచ్చే ఏడాదిలో స్థూల ఆర్థికాంశాలు మెరుగుదలను చూడొచ్చన్నారు. గత రెండు నెలల కాలం నుంచే పరిస్థితుల్లో మార్పులు వచ్చాయని తెలిపారు. గత రెండు త్రైమాసికాలను గమనిస్తే ఎర్నింగ్స్‌ పుంజుకున్నాయనే విషయం తెలుస్తుందని పేర్కొన్నారు. వచ్చే ఏడాదిలోనూ ఇదే ట్రెండ్‌ కొనసాగవచ్చని తెలిపారు. బ్యాంకింగ్‌ రంగంలో బలమైన వృద్ధి నమోదయ్యిందని పేర్కొన్నారు. వచ్చే ఏడాది కన్సూమర్‌, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌, కన్‌స్ట్రక‌్ష్‌న్‌ రంగాల్లో రికవరీ ఉంటుందని తెలిపారు. వచ్చే ఏడాది పాజిటివ్‌గానే ఉంటుందని, అయితే రాబడులు మోస్తరుగా ఉంటాయని పేర్కొన్నారు. దీర్ఘకాల సగటుతో పోలిస్తే మార్కెట్‌ పీఈ వ్యాల్యుయేషన్స్‌ 10 శాతం అధికంగా ఉండటం, ఎర్నింగ్స్‌ వృద్ధి అంచనాలకు దిగువున ఉండటం వంటి అంశాలు ఇందుకు కారణమని తెలిపారు. 
అధికారంలోకి ఎవ్వరొచ్చినా కూడా సంస్కరణలు కొనసాగుతాయని, అందువల్ల ఎన్నికల ప్రభావం మార్కెట్‌పై ఎక్కువ కాలం పెద్దగా ఉండబోదని మహేశ్‌ పాటిల్‌ అంచనా వేశారు. నిఫ్టీలో బ్యాంకింగ్‌ అండ్‌ ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌ రంగం 35 శాతం వెయిటేజీని కలిగి ఉందని గుర్తు చేశారు. రానున్న కాలంలో ఈ రంగం బలమైన వృద్ధిని నమోదు చేయవచ్చనే అంచనాలున్నాయని తెలిపారు. టాప్‌ 4 కార్పొరేట్‌ బ్యాంకులు వృద్ధికి దోహదపడతాయని పేర్కొన్నారు. వచ్చే ఆర్థిక సంవత్సరంలో నిప్టీ ఎర్నింగ్స్‌ వృద్ధి 20 శాతంగా ఉండొచ్చని అంచనా వేశారు. బ్యాంకింగ్‌ అండ్‌ ఫైనాన్షియల్‌ రంగాన్ని మినహాయిస్తే అప్పుడు వృద్ధి 14 శాతం వద్ద ఉండొచ్చని తెలిపారు. 
ఒత్తిడి నెలకొన్న ఆస్తులను, లిక్విడ్‌ ఆస్తులను వేరు చేయడానికి మ్యూచువల్‌ ఫండ్స్‌కు సెబీ అనుమతిన్విడం సానుకూల అంశమని మహేశ్‌ పాటిల్‌ పేర్కొన్నారు. బ్యాంకింగ్‌ రంగంపై ఒత్తిడి కొనసాగుతోందని, అయితే ఎన్‌పీఏల పెరుగుదల చివరి దశకు చేరుకుందని, రానున్న కాలంలో ఎన్‌పీఏ కేటాయింపులు తగ్గుతాయని తెలిపారు. ఎన్‌బీఎఫ్‌సీ మార్కెట్‌ను బ్యాంకులు ఆక్రమిస్తున్నాయని పేర్కొన్నారు. ఎన్నికలతో సంబంధం లేకుండా బ్యాంకింగ్‌ అండ్‌ ఫైనాన్షియల్‌, కన్సూమర్‌ డిస్క్రీషనరీ, క్యాపిటల్‌ గూడ్స్‌ రంగాలకు ప్రాధాన్యమివ్వొచ్చని సూచించారు. ఎఫ్‌ఎంసీజీ రంగంలో పీఈ మల్టిపుల్స్‌ అధికంగా ఉన్నాయని తెలిపారు. You may be interested

మూడోరోజూ లాభాల ముగింపే...

Thursday 13th December 2018

రిజర్వ్‌ బ్యాంక్‌ కీలక వడ్డీరేట్లపై తగ్గింపు ఆశలతో మార్కెట్‌ మూడోరోజూ లాభాలతో ముగిసింది. సెన్సెక్స్‌ 150.57 పాయింట్ల లాభంతో 35929.64 వద్ద, నిఫ్టీ సూచీ 54 పాయింట్ల లాభంతో 10791.50 వద్ద ముగిసింది. రిజర్వ్‌ బ్యాంక్‌ కొత్త గవర్నర్‌ శక్తికాంత్‌ వడ్డీరేట్లను తగ్గించవచ్చనే అంచనాలతో అన్ని రంగాల షేర్లలో షేర్లలో కొనుగోళ్లు వెల్లువెత్తాయి. అయితే మెటల్‌, ఫార్మా షేర్లలో అశించిన స్థాయిలో కొనుగోళ్లు జరగలేదు. ఫలితంగా ఫార్మా ఇండెక్స్‌ స్వల్పలాభంతో

కొత్త ఏడాదిపై మోర్గాన్‌స్టాన్లీ పాజిటివ్‌

Thursday 13th December 2018

సార్వత్రిక ఎన్నికల్లో స్పష్టమైన తీర్పు వస్తే వచ్చే ఏడాది చివరి నాటికి సెన్సెక్స్‌ ప్రస్తుత స్థాయిల నుంచి మరో 20 శాతం వరకు ర్యాలీ జరపవచ్చని అంతర్జాతీయ బ్రోకింగ్‌ సంస్థ మోర్గాన్‌స్టాన్లీ అంచనా వేసింది. ఎన్నికల ఫలితాల్లో స్పష్టమైన తీర్పు రాకుండా అతుకుల బొంత ప్రభుత్వం ఏర్పడితే సూచీల్లో భారీ పతనం తప్పకపోవచ్చని అభిప్రాయపడింది. ఈ పరిస్థితుల్లో నిఫ్టీ 33వేల పాయింట్లకు పడిపోవచ్చని పేర్కొంది. బుల్‌కేస్‌కు 30 శాతం, బేర్‌

Most from this category