News


మ్యూచువల్‌ ఫండ్స్‌ వాటాలు పెంచుకున్న షేర్లివే ..!

Tuesday 15th October 2019
Markets_main1571128228.png-28895

ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికంలో భారతీయ ఈక్విటీలపై విదేశీ పెట్టుబడిదారులు బేరిష్‌ ధోరణిని ప్రదర్శించారు. ఆర్థిక వ్యవస్థలో కొనసాగుతున్న మందగమనం ఉన్నప్పటికీ, దేశీయ సంస్థాగత పెట్టుబడిదారులు (డిఐఐలు) షేర్ల కొనుగోళ్లకు చొరవ చూపారు. ఈ క్యూ2లో డీఐఐలు రూ.53,820 కోట్ల విలువైన షేర్లను కొనుగోలు చేయగా, ఇదే సమయంలో ఎఫ్‌ఐఐలు రూ.22,460 కోట్లను ఈక్విటీ షేర్లను విక్రయించినట్లు గణాంకాలు చెబుతున్నాయి. జూలై-సెప్టెంబర్ కాలంలో సిప్‌ల ద్వారా పెట్టుబడి ప్రవాహం నెలకు రూ.8,200 కోట్లకు పైగా ఉందని యాంఫీ గణాంకాలు తెలియజేస్తున్నాయి. 

రెండో త్రైమాసికంలో మ్యూచువల్‌ ఫండ్‌ హౌస్‌లు బీమా, హౌసింగ్ ఫైనాన్స్, షిప్ బిల్డింగ్, ఐటీ, ప్రైవేట్ బ్యాంకులు, పవర్, మీడియా మరియు రిటైల్ రంగ షేర్ల కొనుగోళ్లకు ఎక్కువ మక్కువ చూపగా, కెమికల్స్‌, ఎంటర్‌టైన్‌మెంట్‌, ఫార్మా, ప్రభుత్వరంగ బ్యాంక్‌ రంగ కంపెనీల్లో వాటాను తగ్గించుకునట్లు ఏస్‌ ఈక్విటీ గణాంకాలు చెబుతున్నాయి. 

ఐసీఐసీఐ లాంబార్డ్‌ జనరల్‌ ఇన్సూరెన్స్‌:- ఫండ్‌ హౌస్‌లు ఎక్కువగా ఆసక్తి కనబరిచిన షేర్లలో ఐసిఐసిఐ లాంబార్డ్ జనరల్ ఇన్సూరెన్స్ ఒకటి. ఈ క్యూ2లో ఫండ్‌ హౌసింగ్‌లో ఏకంగా 4శాతం వాటాను పెంచుకున్నాయి. క్యూ1లో ఫండ్‌ ఫండ్‌ హౌస్‌లో వాటా  4.23శాతంగా ఉండగా, క్యూ2 నాటికి అది 8.37 శాతానికి చేరుకుంది. కొత్త మోటారు వాహనాల చట్టం సిద్ధాంతపరంగా పరిశ్రమకు రూ .9,800 కోట్ల థర్డ్ పార్టీ (టిపి) ప్రీమియంలను జోడించగలదు. ఈ మొత్తంలో ఒక్క ఐసీఐసీఐ లాంబార్డ్‌ వాటా రూ.2,600 కోట్లుగా ఉండొచ్చని హెచ్‌ఎస్‌బీసీ రీసెర్చ్‌ సంస్థ అంచానా వేసింది. అలాగే ఈ చట్టం తక్కువ నష్ట నిష్పత్తికి దారితీసే అవకాశం ఉంది. ఇది ఐసీఐసీఐ లాంబార్డ్‌ కంపెనీకి కలిసొచ్చే అంశమని రీసెర్చ్‌ సంస్థ తెలిపింది. 

ఎస్‌బీఐ లైఫ్‌ ఇన్సూరెన్స్‌:- ఈ క్యూ2లో మ్యూచువల్‌ ఫండ్ల మొత్తం వాటా 4.91శాతం నుంచి 5.80శాతానికి పెరిగింది. ఇక ఈ షేర్లు వార్షిక ప్రాతిపదిన 40శాతం ర్యాలీ చేశాయి. యాక్సిస్‌ సెక్యూరిటీస్‌ సంస్థ ఈ కంపెనీ షేర్లపై బుల్లిష్‌గా ఉంది. షేర్ల టార్గెట్‌ ధరను రూ.936కు పెంచింది.

వీటితో ఎల్‌ఐసీ హౌసింగ్‌ ఫైనాన్స్‌, గార్డెన్‌ రీసెర్చ్‌ షిప్‌ బిల్డర్స్‌, ఈ క్లెర్క్స్, కాఫీ డే ఎంటర్‌ప్రైజెస్, యాక్సిస్ బ్యాంక్, వి-మార్ట్ రిటైల్, టివి టుడే నెట్‌వర్క్, టీవీఎస్ మోటార్ కంపెనీల్లో మ్యూచువల్‌ ఫండ్లు ఈ క్యూ2లో కనీసం 2శాతానికి పైగా వాటాలను పెంచుకున్నాయి. 

కోల్‌ ఇండియా, బిర్లాసాఫ్ట్‌, సొనాటా సాఫ్టే‍్వర్‌, యూనిటెక్‌ ల్యాబోరేటరీస్‌, మోల్డ్‌-టెక్‌ ప్యాకింగ్‌, హెచ్‌డీఎఫ్‌సీ, కెపాసిటీ ఇన్ఫ్రాప్రాజెక్ట్స్‌, ఐఓసీ, ఎస్‌జేవీఎన్‌ కంపెనీల్లో మ్యూచువల్‌ ఫండ్ల తమ వాటాను పెంచుకున్నాయి. 

మరోవైపు ఉజ్జీవన్‌ ఫైనాన్సియల్‌ సర్వీసెస్‌ కంపెనీలో మ్యూచువల్‌ ఫండ్లు తమ మొత్తం వాటాను 8.40శాతం నుంచి 3.90శాతానికి పరిమితం చేసుకున్నాయి. అలాగే మైండ్‌ ట్రీ, వండర్‌లా హాలిడేస్‌, అడ్‌ల్యాబ్స్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌, ఇంటలెక్ట్‌  డిజైన్ అరేనా లాంటి కంపెనీల్లో 2శాతానికి పైగా వాటాను తగ్గించుకున్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. 

క్లారెంట్‌ కెమికల్స్‌, అమరరాజా బ్యాటరీస్‌, కెనరా బ్యాంక్‌, న్యూలాండ్‌ ల్యాబ్స్‌, టాటా పవర్‌, కర్ణాటక్‌ బ్యాంక్‌, పీఎన్‌బీ హౌసింగ్‌ ఫైనాన్స్‌, ప్రీమియర్‌ ఎక్స్‌ప్లోజివ్‌ లాటి కంపెనీల్లో ఫండింగ్‌ హౌస్‌లు 1శాతానికి సమానమైన షేర్లను విక్రయించాయి. 



You may be interested

హెచ్‌యూఎల్‌పై అనలిస్టులు బుల్లిష్‌!

Tuesday 15th October 2019

సెప్టెంబర్‌ త్రైమాసికానికి  ప్రముఖ ఎఫ్‌ఎంసీజీ దిగ్గజం హిందుస్థాన్‌ యూనిలీవర్‌ ప్రకటించిన ఫలితాలపై పలువురు అనలిస్టులు పాజిటివ్‌గా స్పందించారు. పలు బ్రోకరేజ్‌లు సంస్థ షేరు టార్గెట్‌ను, రేటింగ్‌ను అప్‌గ్రేడ్‌ చేశాయి. కంపెనీ వాల్యూం వృద్ధి 5-7 శాతం రేంజ్‌లో కొనసాగుతుందని అంచనా వేస్తున్నట్లు షేర్‌ఖాన్‌ తెలిపింది. హెచ్‌యూఎల్‌ టార్గెట్‌ను రూ. 2250కి పెంచింది. షేరుపై బుల్లి్‌ష్‌గా ఉన్నట్లు మరో బ్రోకింగ్‌ సంస్థ ఆనంద్‌రాఠీ తెలిపింది. సీఎల్‌ఎస్‌ఏ సంస్థ హెచ్‌యూఎల్‌ షేరు టార్గెట్‌ను

స్వల్పంగా పెరిగిన పసిడి

Tuesday 15th October 2019

అమెరికా - చైనా వాణిజ్య చర్చల చుట్టూ నెలకొన్న ఆశావాదం క్షీణించడంతో మంగళవారం పసిడి ధరలు స్వల్పంగా పెరిగాయి. అయితే యూరోపియన్ యూనియన్ నుండి బ్రిటన్ ఎలా బయటకు వెళుతుందో(బ్రెగ్జిట్‌) నిర్ణయించే కీలకమైన ఫలితం కోసం  ఇన్వెస్టర్లు ఎదురుచూస్తున్నారు. నేటి ఉదయం ఆసియా ట్రేడింగ్‌లో ఔన్స్‌ పసిడి ధర 2డాలర్లు పెరిగి 1,499 డాలర్ల వద్ద ట్రేడ్ అవుతోంది. ఇటీవల అమెరికా - చైనాల మధ్య కుదిరిన పాక్షిక ఒప్పందం అమలుపై

Most from this category