News


20 స్టాకుల్లో ఎంఏసీడీ పాజిటివ్‌!

Tuesday 12th March 2019
Markets_main1552370713.png-24543

దేశీయ సూచీల్లో బుల్స్‌ పట్టు పెరగడంతో పలు షేర్లలో ర్యాలీ సంకేతాలు కన్పిస్తున్నాయంటున్నారు నిపుణులు. సోమవారం ముగింపు ప్రకారం 20 షేర్ల చార్టుల్లో ఎంఏసీడీ(మూవింగ్‌ ఏవరేజ్‌ కన్వర్జన్స్‌ డైవర్జన్స్‌) ఇండికేటర్‌ బుల్లిష్‌సంకేతాలు ఇస్తోందని టెక్నికల్‌ అనలిస్టులు చెబుతున్నారు. ఈ షేర్లలో ఎంఏసీడీ బుల్లిష్‌క్రాసోవర్‌ ఏర్పరిచింది. ఇలా పాజిటివ్‌గా  మారిన కంపెనీల్లో ఎయిర్‌టెల్‌, టైటాన్‌, ఏసియన్‌ పెయింట్స్‌, కన్సాయ్‌ నెరోలాక్‌, బయోకాన్‌, జీఎస్‌కే ఫార్మా, డాబర్‌, అదానీ ట్రాన్స్‌మిషన్‌, ఆదిత్య బిర్లా ఫ్యాషన్‌, అవెన్యూ సూపర్‌మార్ట్స్‌, ప్రెస్టేజ్‌, డా.లాల్‌పాత్‌ ల్యాబ్స్‌, ఫ్యూచర్‌ లైఫ్‌స్టైల్‌, థైరోకేర్‌ తదితరాలున్నాయి. ఈ కౌంటర్లలో కొద్ది రోజుల నుంచి ట్రేడింగ్‌ పరిమాణం పెరుగుతూ, షేర్లు పెరగడం ట్రెండ్‌ పటిష్టతను సూచిస్తోందని టెక్నికల్‌ విశ్లేషకులు చెపుతున్నారు. 
ఎంఏసీడీ అంటే...
ట్రెండ్‌ రివర్సల్‌ గుర్తించేందుకు ఎంఏసీడీ ఇండికేటర్‌ను వాడతారు.  26, 12 రోజుల ఎక్స్‌పొటెన్షియల్‌ మూవింగ్‌ యావరేజెస్‌ మధ్య భేదం ఆధారంగా ఎంఏసీడీ పనిచేస్తుంది. సిగ్నల్‌లైన్‌ ఆధారంగా బై, సెల్‌ అవకాశాలను గణిస్తారు. సిగ్నల్‌లైన్‌కు పైన ఎంఏసీడీ లైన్‌ కదలాడితే బుల్లిష్‌గా, ఈ లైన్‌కు దిగువకు వస్తే బేరిష్‌గా చెప్పవచ్చు. ఎంఏసీడీ రెండు లైన్లు ఒకదానినొకటి క్రాస్‌ చేసే విధానాన్ని బట్టి బేరిష్‌ క్రాసింగ్‌, బుల్లిష్‌ క్రాసింగ్‌గా చెబుతారు.  
ఈ షేర్లలో బేరిష్‌ క్రాసోవర్‌
మరోవైపు 3 షేర్లలో  ఎంఏసీడీ బేరిష్‌ క్రాసోవర్‌ ఏర్పడింది. ధర్మపూర్‌ సుగర్‌, స్వాన్‌ ఎనర్జీ, అతుల్‌ షేర్లలో ఎంఏసీడీ నెగిటివ్‌ సంకేతాలు ఇస్తోంది. మదుపరులు ఇన్వెస్ట్‌ చేయాలంటే కేవలం ఎంఏసీడీ ఇండికేటర్‌ను మాత్రమే విశ్వసించకుండా,  ఇతర ఇండికేటర్లు పరిశీలించి అధ్యయనం చేయాలని నిపుణులు సూచిస్తున్నారు.

ఎంఏసీడీతోపాటు ఆర్‌ఎస్‌ఐ, బోలింగర్‌ బ్యాండ్‌ లాంటి ఇతర ఇండికేటర్లను పరిశీలించి ట్రెండ్‌ను నిర్ధారణ చేసుకోవాలి. 



You may be interested

పసిడి లాభాల ర్యాలీ

Tuesday 12th March 2019

డాలర్‌ ఇండెక్స్‌ పతనం పసిడి ధరకు కలిసొస్తుంది. ఆసియా మంగళవారం ఔన్స్‌ పసిడి ధర 6డాలర్ల పెరిగింది. బ్రెగ్జిట్‌ డీల్‌ కీలక సవరణకు యూరోపిన్‌ కమీషన్‌ సోమవారం అంగీకారం తెలపడంతో ఆరు ప్రధాన కరెన్సీ విలువల్లో డాలర్‌ ఇండెక్స్‌ బలహీనపడింది. అలాగే పసిడి ధర 1300డాలర్ల దిగువకు ట్రేడ్‌ అవుతుండటం కూడా ఇన్వెస్టర్లను పసిడి ఫ్యూచర్ల కొనుగోళ్లకు పురిగొల్పింది. ఈ నేపథ్యంలో నేడు ఔన్స్‌ పసడి ధర 6.25 డాలర్లు

రికార్డు గరిష్టానికి రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌

Tuesday 12th March 2019

ముంబై:- దేశీయ కార్పొరేట్‌ దిగ్గజం రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ లిమిటెడ్‌ షేరు మంగళవారం రికార్డు గరిష్టాన్ని నమోదు చేసింది. నేడు బీఎస్‌ఈలో రిలయన్స్‌ షేరు రూ.1317.10ల వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించింది. నేడు మార్కెట్లో ఇంధన రంగ షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభిస్తుండంతో ఇన్వెస్టర్లు ఈ షేరు కొనుగోళ్లకు మొగ్గుచూపారు. ఫలితంగా ఇంట్రాడేలో 2.50శాతం లాభపడి 1329.90 వద్ద గరిష్టాన్ని నమోదు చేసింది. ఉదయం గం.11:15ని.లకు రిలయన్స్‌ షేరు గతముగింపు ధర(రూ.1301)తో పోలిస్తే

Most from this category