News


వచ్చే దీపావళికి బ్రోకరేజీల టాప్‌ పిక్స్‌

Friday 18th October 2019
Markets_main1571421310.png-28988

గత దీపావళి నుంచి దేశీయ ఈక్విటీలు తీవ్ర అస్థిరతలు చవిచూశాయి. ఎఫ్‌పీఐలపై సర్‌చార్జీ, ఆర్థిక వృద్ధి మందగమనం, బలహీన ఫలితాలు, అమెరికా-చైనా మధ్య వాణిజ్య యుద్ధం, అంతర్జాతీయ మందగమనంపై ఆందోళనలు ఇలా ఎన్నో అంశాలు ఇందుకు కారణమయ్యాయి. అయితే, కార్పొరేట్‌ పన్ను తగ్గింపు తర్వాత ఈ నష్టాలను మార్కెట్లు గణనీయంగా పూడ్చుకున్నాయి. దీంతో గత దీపావళి నుంచి చూస్తే సూచీలు 9 శాతం పెరిగాయి. కార్పొరేట్‌ పన్ను కోత, ఆర్‌బీఐ వరుసగా వడ్డీ రేట్ల తగ్గింపు, అమెరికా-చైనా మధ్య వాణిజ్య ఒప్పందానికి అవకాశాలు, బ్రెగ్జిట్‌ విషయంలో డీల్‌ ఇటువంటి సానుకూలతలతో వచ్చే దీపావళికి మన మార్కెట్లు నూతన శిఖరాకు వెళతాయని బ్రోకరేజీలు అంచనా వేస్తున్నాయి. 

 

‘‘ప్రతికూలతలు దాదాపుగా ముగిసిపోయాయి. లేదా అతి త్వరలోనే ముగిసిపోతాయన్న నమ్మకంతో ఉన్నాను. వచ్చే దీపావళికి మార్కెట్లు కొత్త గరిష్టాలకు వెళతాయి’’అని ఏంజెల్‌ బ్రోకింగ్‌ చైర్మన్‌, ఎండీ దినేష్‌ డి ఠక్కర్‌ పేర్కొన్నారు. మ్యూచువల్‌ ఫండ్స్‌ పెట్టుబడులు ఈ ఏడాది నిదానించినా కానీ, అవి మార్కెట్‌ సెంటిమెంట్‌ మెరుగుపడడంతో పుంజుకుంటాయని భావిస్తున్నట్టు చెప్పారు. రాజకీయ స్థిరత్వం, వ్యాపార అనుకూల ప్రభుత్వం, నిధుల వ్యయాలు తగ్గుతుండడం, చైనా కంపెనీల పోటీ తత్వం సన్నగిల్లుతుండడం వల్ల ఏర్పడే నూతన అవకాశాలు, ఎఫ్‌డీఐ లేదా ఎఫ్‌పీఐ రూపంలో పెట్టుబడులు పెరగడం దేశ ఆర్థిక వృద్ధికి తోడ్పడతాయని యాక్సిస్‌ సెక్యూరిటీస్‌ పేర్కొంది. బ్యాంకింగ్‌, వినియోగ రంగం కంపెనీలు వచ్చే దీపావళికి మంచి లాభాలు కురిపించగలవని ఎక్కువ శాతం బ్రోకరేజీలు అంచనా వేస్తున్నాయి. వచ్చే దీపావళికి 12-41 శాతం వరకు రాబడుల అవకాశం ఉన్న స్టాక్స్‌ను బ్రోకరేజీ సంస్థలు... రెలిగేర్‌ బ్రోకింగ్‌, ఏంజెల్‌ బ్రోకింగ్‌, యాక్సిస్‌ సెక్యూరిటీస్‌ సూచించాయి. 

 

దీపావళి చిచ్చుబుడ్లు
కంపెనీ    టార్గెట్‌ ధర(రూ.లో)    రాబడి శాతం

హావెల్స్‌                         795     16
ఎంఅండ్‌ఎం                     695    17
మారికో                          451    16
నిప్పన్‌ మ్యూచువల్‌ ఫండ్‌  319    18
వోల్టాస్‌                           780    15
జీఎంఎం ఫౌల్డర్‌               1740    22
హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు         1390   14
ఐసీఐసీఐ బ్యాంకు              510   16
ఎల్‌అండ్‌టీ                     1850   30
మారుతి సుజుకీ               8552   20
ఆర్‌బీఎల్‌ బ్యాంకు              410    41
శ్రీరామ్‌ ట్రాన్స్‌పోర్ట్‌             1385   30
టీటీకే ప్రెస్టీజ్‌                    7708   31
అల్ట్రాటెక్‌ సిమెంట్‌             4982   17
కీ ఇండస్ట్రీస్‌                      612    13
కోటక్‌ బ్యాంకు                 1800    12
ఆర్తి ఇండస్ట్రీస్‌                   875    15
రైట్స్‌                              328    24
లుమాక్స్‌ ఇండస్ట్రీస్‌          1600    28
హెచ్‌సీఎల్‌ టెక్‌                1250    15

 

నోట్‌: బ్రోకరేజీ సంస్థలు, అనలిస్టుల సిఫారసులను గుడ్డిగా అనుసరించడం సరికాదు. స్వీయ అధ్యయనం తర్వాతే పెట్టుబడులపై నిర్ణయం తీసుకోవాలని సూచన. You may be interested

యస్‌ బ్యాంకు విషయంలో ఏం చేయాలి..?

Friday 18th October 2019

యస్‌ బ్యాంకు షేరు రెండు రోజుల్లో 25 శాతం ర్యాలీ చేసింది. భారతీ సునీల్‌ మిట్టల్‌, ముంజాల్‌లు బ్యాంకులో వాటా తీసుకునేందుకు ఆసక్తితో ఉన్నట్టు వచ్చిన వార్తలే కారణమా? లేక బ్యాంకు నిధుల సమీకరణ ప్రయత్నాలపై ఉన్న నమ్మకంతో జరిగిన కొనుగోళ్లే కారణమా..? కారణాలేమైనా కావచ్చు. బ్యాంకు సెప్టెంబర్‌ త్రైమాసికం ఫలితాలను ఇంకా ‍ప్రకటించాల్సి ఉంది. అలాగే, నిధుల సమీకరణ ప్రయత్నాలకు కూడా అవరోధాలు ఎదురవుతున్నాయి. ఇన్వెస్ట్‌ చేసే వారు

ఆరోరోజూ అదే జోరు ...!

Friday 18th October 2019

246 పాయింట్లు లాభపడ్డ సెన్సెక్స్‌ 11650పై ముగిసిన నిఫ్టీ  మార్కెట్‌ లాభాలు ఆరో రోజూ కొనసాగాయి. సెన్సెక్స్‌ 246.32 పాయింట్లు పెరిగి 39,298.38 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 75.50 పాయింట్లు లాభంతో 11,661.85 వద్ద ముగిసింది. దేశీయ ఈక్విటీ మార్కెట్లో ఎఫ్‌ఐఐల పెట్టుబడులు కొనసాగుతుండం, ఇప్పటివరకు క్యూ2 ఫలితాలను ప్రకటించిన కంపెనీలు అంచనాలకు మించి ఉండటం, ఫారెక్స్‌ మార్కెట్లో రూపాయి లాభాల ట్రేడింగ్‌ ఈక్విటీ కొనుగోళ్లకు కారణమయ్యాయి. అధిక వెయిటేజీ కలిగిన రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌,

Most from this category