News


20% పడిపోయిన బజాజ్‌ అమ్మకాలు

Tuesday 1st October 2019
Markets_main1569908945.png-28649

ద్విచక్ర, త్రి చక్ర వాహనాల తయారి సంస్థయిన బజాజ్‌ ఆటో సెప్టెంబర్‌ అమ్మకాలు గత ఏడాది ఇదే కాలంతో పోల్చుకుంటే 20 శాతం పడిపోయాయి. ఇది విశ్లేషకుల అంచనాల కంటే తక్కువ కావడం గమనార్హం. కాగా డిమాండ్‌ తగ్గడంతో గత కొంత కాలం నుంచి ఆటో కంపెనీల అమ్మకాలు తగ్గుతున్న విషయం తెలిసిందే.    సెప్టెంబర్‌ నెలలో వాహన విక్రయాలు 4.02 లక్షల యూనిట్లుగా నమోదయ్యాయని కంపెనీ బీఎస్‌ఈ ఫైలింగ్‌లో పేర్కొంది. కాగా గత ఏడాది ఇదే కాలంలో ఈ అమ్మకాలు 5.02 లక్షలుగా ఉండడం గమనార్హం. జపాన్‌ బ్రోకరేజి సంస్థ నోమురా ఈ అమ్మకాలు 4.22 లక్షల యూనిట్లుగా ఉంటాయని అంచనా వేసింది. 
   సెప్టెంబర్‌ నెలకు గాను దేశీయ మార్కెట్‌లో అమ్మకాలు ఏడాది ప్రాతిపదికన 31 శాతం పడిపోయి 2.15 లక్షల యూనిట్లుగా నమోదయ్యాయని, ఎగుమతులు 2 శాతం పడిపోయి 1.86 లక్షల యూనిట్లుగా నమోదయ్యాయని కంపెనీ తెలిపింది. గత ఏడాది సెప్టెంబర్‌ నెలతో పోల్చుకుంటే, ఈ సెప్టెంబర్‌లో ద్విచక్రవాహనాల అమ్మకాలు 22 శాతం పడిపోయి 3.36 లక్షల యూనిట్లుగా నమోదయ్యాయి. అదే త్రి చక్ర వాహనాల అమ్మకాలు 8 శాతం పడిపోయి 65,305 యూనిట్లుగా నమోదయ్యాయి. 
  నెలవారి ఆటో సంఖ్యలు మంగళవారం వెలువడడంతో బజాజ్‌ ఆటో షేరు విలువ మొదట నష్టపోయి తిరిగి పాజిటివ్‌గా ట్రేడవుతోంది. ఉదయం 11.05 సమయానికి ఈ షేరు 0.11 శాతం లాభపడి రూ. 2,945.00 వద్ద ట్రేడవుతోంది.



You may be interested

2 నెలల కనిష్టానికి పసిడి

Tuesday 1st October 2019

అమెరికా మార్కెట్లో నిన్నరాత్రి డాలర్‌ బలపడటం, ఈక్విటీ మార్కెట్ల ర్యాలీ, ఈల్డ్‌ పుంజుకోవడం లాంటి కారణాలతో ప్రపంచమార్కెట్లోని పసిడి ధర 2నెలల కనిష్టానికి పతమనమైంది. అక్కడి మార్కెట్‌ ముగిసే సరికి ఔన్స్‌ పసిడి ధర 33.50డాలర్లు నష్టపోయి 1,472.90 వద్ద స్థిరపడింది. నేటి ఉదయం ఆసియా ట్రేడింగ్‌లో ఔన్స్‌ పసిడి ధర అరశాతం స్వల్ప నష్టంతో 1,472.45 వద్ద ట్రేడ్‌ అవుతోంది. డాలర్‌ పుంజుకోవడం పసిడి ధరకు ప్రతికూలంగా మారింది.

60 డాలర్ల దిగువకు క్రూడ్‌

Tuesday 1st October 2019

   యూఎస్‌, రష్యా దేశాల చమురు ఉత్పత్తి సెప్టెంబర్‌ నెలలో పడిపోవడంతో మంగళవారం ట్రేడింగ్‌లో చమురు ధరలు పాజిటివ్‌గా ట్రేడవుతున్నాయి. అయినప్పటికి ట్రేడ్‌వార్‌ కారణంగా అంతర్జాతీయంగా చమురు డిమాండ్‌ ఆందోళనలు పెరిగాయి. ఫలితంగా గత సెషన్‌లో చమురు ధరలు భారీగా పడిపోయాయి. మంగళవారం ట్రేడింగ్‌లో ఉదయం 10.16 సమయానికి బ్రెంట్‌ క్రూడ్‌ 0.76 శాతం​లాభపడి బారెల్‌ 59.70 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. అదే విధంగా డబ్యూటీఐ క్రూడ్‌ 0.91 శాతం

Most from this category