News


మార్కెట్‌ డౌన్‌- ఈ స్టాక్స్‌ హైజం‍ప్‌

Monday 6th January 2020
Markets_main1578295507.png-30704

రికార్డ్‌ గరిష్టానికి చేరువలో ఐఈఎక్స్‌
వాహన విక్రయాల ’ఫోర్స్‌’ మోటార్స్‌

మధ్యప్రాచ్యంలో నెలకొన్న ఉద్రిక్తతల నేపథ్యంలో దేశీ స్టాక్‌ మార్కెట్లు పతన బాటలో సాగుతున్నాయి. ఇన్వెస్టర్లు అమ్మకాలకు ఎగబడటంతో మధ్యాహ్నం 12.10 ప్రాంతంలో సెన్సెక్స్‌ 650 పాయింట్లు పతనమైంది. 41,815కు చేరింది. ఈ బాటలో నిఫ్టీ సైతం 200 పాయింట్లు దిగజారి 12,027 వద్ద ట్రేడవుతోంది. అయితే విభిన్న వార్తల కారణంగా పతన మార్కెట్లోనూ రెండు మిడ్‌ క్యాప్‌ కౌంటర్లు ఇన్వెస్టర్లను ఆకట్టుకుంటున్నాయి. వీటిలో ఆటో రంగ కంపెనీ ఫోర్స్‌ మోటార్‌తోపాటు.. విద్యుత్‌ ట్రేడింగ్‌ కంపెనీ ఇండియన్‌ ఎనర్జీ ఎక్స్ఛేంజ్‌(ఐఈఎక్స్‌) చోటు సాధించాయి. ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు ఎగబడటంతో ఈ రెండు కౌంటర్లూ నష్టాల మార్కెట్లోనూ భారీ లాభాలతో కళకళలాడుతున్నాయి. వివరాలు చూద్దాం..

ఫోర్స్‌ మోటార్స్‌ లిమిటెడ్‌
దేశీయంగా గత నెలలో పలు ఆటో రంగ కంపెనీల అమ్మకాలు క్షీణించినప్పటికీ ఫోర్స్‌ మోటార్‌ మెరుగైన పనితీరు ప్రదర్శించింది. 2019 డిసెంబర్‌లో 62 శాతం అధికంగా 2,747 వాహనాలను విక్రయించింది. 2018 డిసెంబర్‌లో 1697 యూనిట్లను మాత్రమే విక్రయించింది. కాగా.. దేశీ అమ్మకాలు 53 శాతం పెరిగి 2517 యూనిట్లను తాకినట్లు కంపెనీ తెలియజేసింది. 2019 నవంబర్‌తో పోలిస్తే.. డిసెంబర్‌లో ఉత్పత్తి సైతం 33 శాతం పుంజుకుని 2379 యూనిట్లకు చేరినట్లు వెల్లడించింది. ఈ నేపథ్యంలో ఫోర్స్‌ మోటార్స్‌ కౌంటర్‌కు డిమాండ్‌ నెలకొంది. ఈ షేరు ప్రస్తుతం ఎన్‌ఎస్‌ఈలో 8.5 శాతం దూసుకెళ్లింది. రూ. 1182 వద్ద ట్రేడవుతోంది. తొలుత 11 ఎగసి రూ. 1218 వద్ద ఇంట్రాడే గరిష్టాన్ని తాకింది. 

ఇండియన్‌ ఎనర్జీ ఎక్స్ఛేంజ్‌
గత మూడు నెలల క్షీణతకు చెక్‌ పెడుతూ డిసెంబర్‌ నెలలో విద్యుత్‌కు డిమాండ్‌ పెరగడంతో ఇండియన్‌ ఎనర్జీ ఎక్స్ఛేంజ్‌ కౌంటర్‌ వెలుగులోకి వచ్చింది. ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు ఎగబడటంతో  ఈ షేరు ప్రస్తుతం ఎన్‌ఎస్‌ఈలో 4 శాతం జంప్‌చేసింది. రూ. 166 వద్ద ట్రేడవుతోంది. తొలుత ఒక దశలో 9 శాతం ఎగసింది రూ. 174 వద్ద 52 వారాల గరిష్టాన్ని తాకింది. వెరసి 2018 నవంబర్‌ 9న సాధించిన ఆల్‌టైమ్‌ గరిష్టం రూ. 178కు చేరువైంది. గత మూడు రోజుల్లోనూ ఈ కౌంటర్‌ 24 శాతం ర్యాలీ చేయడం గమనార్హం! 2019 డిసెంబర్‌లో దేశవ్యాప్తంగా విద్యుత్‌కు 5 శాతం గిరాకీ పెరిగి 170 గిగావాట్లను తాకినట్లు ఐఈఎక్స్‌ పేర్కొంది. వెరసి డిసెంబర్‌లో దాదాపు 477 కోట్ల యూనిట్లు ట్రేడయినట్లు తెలియజేసింది. వార్షికంగా ఇది 51 శాతం అధికమని తెలియజేసింది. ప్రధానంగా దేశ ఉత్తర, దక్షిణాది రాష్ట్రాల నుంచి డిమాండ్‌ పెరిగినట్లు వెల్లడించింది.



You may be interested

70డాలర్లకు క్రూడాయిల్‌... ఈ రంగ షేర్లకు కష్టాలే..!

Monday 6th January 2020

అంతర్జాతీయంగా బ్యారెల్‌ క్రూడాయిల్‌ ధర 70డాలర్లకు చేరుకోవడంతో దేశీయంగా డాలర్‌ మారకంలో రూపాయి విలువ 72స్థాయికి దిగివచ్చింది. ఈ నేపథ్యంలో కొన్ని దేశీయ స్టాకుల ర్యాలీ బ్రేకులు పడవచ్చని మార్కెట్‌ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. పశ్చిమాసియా దేశాల్లో నెలకొన్ని భౌగోళిక ఉద్రిక్తతలు చల్లారకపోతే.., దేశీయ ఆయిల్‌ మార్కెటింగ్‌,  విమానయాన, రసాయన రంగాలకు చెంది షేర్లు అమ్మకాల ఒత్తిడికిలోనయ్యే అవకాశం ఉందని వారంటున్నారు.  ప్రపంచమార్కెట్లో క్రూడాయిల్‌ ధరలు 9నెలల గరిష్టానికి ఎగిసిన నేపథ్యంలో

క్యు3లో లాభాలు పెరగొచ్చు!

Monday 6th January 2020

కంపెనీల ఫలితాలపై అంచనాలు నిఫ్టీ 50 కంపెనీల లాభాలు మూడో త్రైమాసికంలో పెరగవచ్చని మార్కెట్‌ నిపుణులు అంచనా వేస్తున్నారు. గతేడాదితో పోలిస్తే బేస్‌ తగ్గడం, కార్పొరేట్‌ టాక్స్‌ తగ్గడం, కొన్ని బ్యాంకులు, విత్త కంపెనీలు మంచి ప్రదర్శన చూపడం, మొండిపద్దుల కేటాయింపులు తగ్గడం.. క్యు3లో పాజిటివ్‌ ప్రభావం చూపుతాయంటున్నారు. డౌన్‌గ్రేడింగ్‌ల సీజన్‌ ముగిసిందని భావిస్తున్నా, వెనువెంటనే అప్‌గ్రేడ్స్‌ ఆరంభం కావని అభిప్రాయపడ్డారు. ఈటీ సర్వేలో నిఫ్టీ 50 కంపెనీ నికర లాభం

Most from this category