News


బ్లూచిప్‌ కంపెనీలపై రిటైల్‌ ఇన్వెస్టర్ల విశ్వాసం

Wednesday 6th November 2019
Markets_main1573063146.png-29399

అధిక నికర విలువ కలిగిన ఇన్వెస్టర్లే (హెచ్‌ఎన్‌ఐలు) కాదు, రిటైల్‌ ఇన్వెస్టర్లు సైతం భద్రత కోసం బ్లూచిప్‌ స్టాక్స్‌ వెంట నడుస్తున్నట్టు గణాంకాలు తెలియజేస్తున్నాయి. నిఫ్టీ-50లోని కంపెనీల్లో వ్యక్తిగత ఇన్వెస్టర్ల సంఖ్య (ఇండివిడ్యువల్‌ ఇన్వెస్టర్స్‌) సెప్టెంబర్‌ త్రైమాసికంలో 2.33 కోట్లకు పెరగడం దీన్నే సూచిస్తోంది. అంతక్రితం జూన్‌ త్రైమాసికం నాటికి 2.23 కోట్లు, మార్చి త్రైమాసికం నాటికి 2.16 కోట్ల మంది వ్యక్తిగత ఇన్వెస్టర్లే నిఫ్టీ కంపెనీల్లో వాటాలు కలిగి ఉండడం గమానార్హం. ప్రతీ త్రైమాసికానికి ఇన్వెస్టర్ల సంఖ్య పెరుగుతూ వస్తోంది. 

 

మిడ్‌క్యాప్‌, స్మాల్‌క్యాప్‌ విభాగంలో స్టాక్స్‌ దారుణంగా విలువను కోల్పోయిన పరిస్థితి చూస్తున్నాం. అమ్మకాల ఒత్తిడికి చాలా స్టాక్స్‌ భారీగా నష్టపోయాయి. డీహెచ్‌ఎఫ్‌ఎల్‌, జెట్‌ ఎయిర్‌వేస్‌ ఇలా ఎన్నో పేరున్న కంపెనీలు కూడా కార్పొరేట్‌ గవర్నెన్స్‌, మోసాలతో కుప్పకూలిపోయాయి. ఈ క్రమంలో బ్లూచిప్‌లో మెరుగైన కంపెనీల వైపు ఇన్వెస్టర్లు మళ్లినట్టు తెలుస్తోంది. వాస్తవానికి నిఫ్టీలో హెవీ వెయిటేజీ ఉన్న స్టాక్స్‌ 50-80 పీఈ వ్యాల్యూషన్‌లో ఉన్నాయి. అయినా వీటిల్లో ఇన్వెస్టర్ల కొనుగోళ్లు వారిలో చిన్న కంపెనీల పట్ల అభద్రతా భావాన్ని సూచిస్తోంది.

 

స్మాల్‌క్యాప్‌ ఇండెక్స్‌ కంపెనీల్లో రిటైల్‌ ఇన్వెస్టర్ల సంఖ్య సెప్టెంబర్‌ త్రైమాసికంలో 4.23 కోట్లుగా ఉంది. బీఎస్‌ఈ మిడ్‌క్యాప్‌ సూచీలోని కంపెనీల్లో మాత్రం వ్యక్తిగత ఇన్వెస్టర్ల సంఖ్య స్వల్పంగా పెరిగి 1.37 కోట్లకు చేరుకుంది. అంతక్రితం త్రైమాసికం జూన్‌ నాటికి 1.36 కోట్లతో పోలిస్తే అతి స్వల్పంగానే పెరిగింది. ఎక్కువగా పెరిగింది మాత్రం బ్లూచిప్‌ కంపెనీల్లోనే. అయితే, బ్లూచిప్‌ కంపెనీలతో పోలిస్తే ద్వితీయ శ్రేణి కంపెనీలు వ్యాల్యూషన్లు సౌకర్యంగా ఉన్నాయని విశ్లేషకులు పేర్కొంటున్నారు. గత 22 నెలల కాలంలో ఇవి భారీ దిద్దుబాటుకు గురైన విషయాన్ని పేర్కొంటున్నారు. 2018 జనవరి 1 నుంచి 2019 అక్టోబర్‌ 31 వరకు చూసుకుంటే బీఎస్‌ఈ మిడ్‌క్యాప్‌ సూచీ 17 శాతం, స్మాల్‌క్యాప్‌ సూచీ 30 శాతం మేర నష్టపోయాయి. 

 

‘‘మిడ్‌క్యాప్‌, స్మాల్‌క్యాప్‌ స్టాక్స్‌ వ్యాల్యూషన్ల పరంగా మరింత సౌకర్యంగా ఉన్నాయి. దీంతో మధ్య కాలం నుంచి దీర్ఘకాలంలో వీటిల్లో ఎక్కువ లాభాలు గడించొచ్చు’’ అని కోటక్‌ ఏఎంసీ సీఐవో హర్ష ఉపాధ్యాయ పేర్కొన్నారు. మిడ్‌క్యాప్‌, స్మాల్‌క్యాప్‌ సూచీలకు పెట్టుబడుల కేటాయింపును కొంత మేర పెంచుకోవాలని ఇన్వెస్టర్లకు సూచిస్తున్నట్టు చెప్పారు. తమ మ్యూచువల్‌ ఫండ్‌ పథకాల్లోనూ అవకాశం ఉన్న మేర మిడ్‌క్యాప్‌, స్మాల్‌క్యాప్‌ కంపెనీల్లో పెట్టుబడులు పెడుతున్నట్టు తెలిపారు.



You may be interested

నేడు క్యూ2 ఫలితాలను ప్రకటించే ప్రధాన కంపెనీలు

Thursday 7th November 2019

సన్‌ ఫార్మా, బీపీసీఎల్‌, హెచ్‌పీసీఎల్‌, డీఎల్‌ఎఫ్‌, ఆంధ్రాబ్యాంక్‌, పవర్‌ గ్రిడ్‌,  యూకో బ్యాంక్‌, యూపీఎల్‌, ఓకార్డ్‌, ఇంద్రప్రస్థ గ్యాస్‌, ఆదిత్య బిర్లా క్యాపిటల్‌, అదానీ ట్రాన్సిమిషన్‌, అజ్మీరా రియల్టీ, ఇప్కా ల్యాబ్స్‌, మ్యాక్స్‌ ఇండియా, యునైటెడ్‌ బ్రూవరీస్‌ తదితర కంపెనీలతో పాటు సుమారు 140 కంపెనీలు నేడు తమ రెండో త్రైమాసిక ఫలితాలను విడుదల చేయనున్నాయి. 

సెన్సెక్స్‌ లాభం 222 పాయింట్ల

Wednesday 6th November 2019

రాణించిన ప్రైవేట్‌ రంగ బ్యాంకు షేర్లు ఇంట్రాడేలో 12000 స్థాయిని తాకిన నిఫ్టీ మార్కెట్‌ నష్టం ఒకరోజుకే పరిమితం అయ్యింది. ప్రైవేట్‌ రంగ బ్యాంక్‌, ఆర్థిక, రియల్టీరంగ షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభించడంతో గురువారం సూచీలు లాభాల ముగింపును సొంతం చేసుకున్నాయి. సెన్సెక్స్‌ 222 పాయింట్ల లాభంతో 40,469.78 వద్ద, నిఫ్టీ 43.80 పాయింట్లు పెరిగి 11,961 వద్ద స్థిరపడ్డాయి. అటో, ప్రభుత్వరంగ బ్యాంక్‌, మీడియా రంగ షేర్లు అమ్మకాల ఒత్తిడికి లోనయ్యాయి. ప్రైవేట్‌

Most from this category