News


నాలుగు నెలల్లోనే మల్టీబ్యాగర్‌ రిటర్నులు

Saturday 15th June 2019
Markets_main1560540380.png-26305

నాలుగు నెలలు అంటే చాలా తక్కువ కాలవ్యవధి. మరి ఇంత తక్కువ కాల వ్యవధిలో మల్టీ‍బ్యాగర్‌ (ఒక రెట్టు అంతకంటే ఎక్కువ) రిటర్నులు ఇవ్వడం అంటే అంత చిన్న విషయమేమీ కాదు. కానీ, 19 స్టాక్‌లు ఈ ఏడాది ఎన్నికల సీజన్‌లో మల్టీబ్యాగర్‌ రిటర్నులు ఇచ్చి వాటాదారుల పంట పండించాయి. ఎందుకంటే ఇదే కాలంలో బ్రోడర్‌ మార్కెట్‌ బలహీనంగా ఉండడమే కాదు, పెరిగిన స్టా‍క్స్‌తో పోలిస్తే నష్టపోయిన స్టాక్సే ఎక్కువ. 

 

ఈ ఏడాది ఫిబ్రవరిలో పాకిస్థాన్‌లోని ఉగ్రస్థావరాలపై భారత వాయుసేన దాడులు చేయగా, అప్పటి నుంచి చూస్తే 19 స్టాక్‌లు 100 శాతం నుంచి 300 శాతం వరకు రాబడులను ఇచ్చాయి. పైగా ఇవన్నీ స్మాల్‌క్యాప్‌ కంపెనీలే. మరో 150 స్టాక్స్‌ ఇదే కాలంలో 30 శాతానికి పైగా పెరగడం గమనార్హం. కానీ, ఇదే కాలంలో బీఎస్‌ఈలో తరచుగా ట్రేడయ్యే 2,300 స్టాక్స్‌కు గాను 1,250 స్టాక్స్‌ ఇన్వెస్టర్లకు నష్టాలనే మిగిల్చాయి. మల్టీబ్యాగర్‌ రాబడులను ఇచ్చిన స్టాక్స్‌ను గమనిస్తే.. మీనాక్షి ఎంటర్‌ప్రైజెస్‌ 300 శాతం పెరిగింది. బీసీసీ ఫ్యూబా ఇండియా 225 శాతం, 7ఎన్‌ రిటైల్‌ 221 శాతం, ఆశారి ఏజెన్సీస్‌ 212 శాతం, ఆర్టెక్‌ పవర్‌ అండ్‌ ట్రేడింగ్‌ 180 శాతం, రెఫెక్స్‌ ఇండస్ట్రీస్‌ 165 శాతం, ఓసీఎల్‌ ఐరన్‌ అండ్‌ స్టీల్‌ 158 శాతం చొప్పున రాబడులను ఇచ్చాయి. బీఐఎల్‌ ఎనర్జీ సిస్టమ్స్‌, ఉషామార్టిన్‌ ఎడ్యుకేషన్‌ అండ్‌ సొల్యూషన్స్‌, గీతాంజలి క్రెడిట్‌ అండ్‌క్యాపిటల్‌ కూడా ఈ జాబితాలో ఉన్నాయి. 

 

అదానీ గ్రూపులో భాగమైన పట్టణ గ్యాస్‌ సరఫరా సంస్థ అదానీ గ్యాస్‌ ఇదే కాలంలో 68 శాతం రాబడులను ఇవ్వడం గమనార్హం. గుజరాత్‌ గ్యాస్‌ సైతం 56 శాతం పెరిగింది. స్పైస్‌జెట్‌, ఇండియాబుల్స్‌ రియల్‌ ఎస్టేట్‌, పీఎన్‌సీ ఇన్‌ఫ్రాటెక్‌, జస్ట్‌ డయల్‌, సద్బావ్‌ ఇంజనీరింగ్‌, ఇంటెలెక్ట్‌ డిజైన్‌ అరెనా, ఓరియంట్‌ సిమెంట్‌ 50-60 శాతం మధ్యలో లాభపడ్డాయి. ఐఐఎఫ్‌ఎల్‌ ఫైనాన్స్‌, రిలయన్స్‌ క్యాపిటల్‌, రిలయన్స్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌, జెట్‌ ఎయిర్‌వేస్‌, రిలయన్స్‌ కమ్యూనికేషన్స్‌, ఎవరెడీ ఇండస్ట్రీస్‌, ఇగార్షి మోటార్స్‌ ఇండియా, మెక్లాయిడ్‌ రసెల్‌ ఇండియాతోపాటు మరో 40 స్టాక్స్‌ మార్కెట్‌ విలువలో సగం మేర ఇదే కాలంలో కోల్పోయాయి. మరో 165 స్టాక్స్‌ 33 శాతం మార్కెట్‌ విలువను నష్టపోయాయి. ఎన్‌బీఎఫ్‌సీ రంగంలో సంక్షోభానికి తోడు ఆర్థిక రంగం నిదానించడం, కంపెనీల ఫలితాలు ఆశాజనకంగా లేకపోవడం వంటి అంశాలు కొన్ని రంగాల స్టాక్స్‌ నష్టపోవడానికి కారణంగా ఉన్నాయి. ‘‘గత కొన్ని త్రైమాసికాలుగా ఆర్థిక రంగంలోని ఉపభాగాల్లో ఒత్తిళ్లు నెలకొన్నాయి. అన్ని రంగాలకు చెందిన కంపెనీల వృద్ధి తగ్గుముఖం పట్టింది. ఇది స్పష్టంగా ఆర్థిక రంగ కుంగుదలే’’ అని మార్సెల్లస్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ మేనేజర్స్‌కు చెందిన ప్రమోద్‌ గుబ్బి పేర్కొన్నారు.
 You may be interested

లీజుకు షి‘కారు’!!

Saturday 15th June 2019

డౌన్‌ పేమెంట్‌ లేకుండానే చేతికి కారు హ్యుందాయ్‌ క్రెటాకు నెలకు రూ.17,640 చాలు అదే స్కోడా సూపర్బ్‌ అయితే రూ.19,856 ఫియట్‌, జీప్‌ మోడళ్లను అందిస్తున్న ఎఫ్‌సీఏ ఇండియా లీజు మోడల్‌ అమలు చేస్తున్న కార్ల కంపెనీలు అమ్మకాలు పెంచుకునేందుకు కొత్త వ్యూహం నిర్వహణ బాదరబందీలు కూడా మనకుండవు పరిస్థితిని గమనిస్తున్నామన్న మారుతీ, టాటా హైదరాబాద్‌, బిజినెస్‌ బ్యూరో:  డౌన్‌ పేమెంటేమీ లేకుండా నచ్చిన కారు చేతికొస్తే..!! అదీ నిర్వహణ, బీమా వంటి ఖర్చులు లేకుండా జస్ట్‌ నెలవారీ అద్దెతో!!. చాలామందికి ఇది

ఎన్‌బీఎఫ్‌సీ స్టాకులను ఏం చేద్దాం!

Friday 14th June 2019

గతేడాదిలో ఆరంభమైన ఎన్‌బీఎఫ్‌సీ సంక్షోభం బాగా ముదిరి పలు సమస్యలకు కేంద్రబిందువుగా మారింది. లిక్విడిటీ కొరత, డిఫాల్టులు, రేటింగ్‌ డౌన్‌గ్రేడ్స్‌, మోసాలు.. ఇలా పలు కారణాలతో పలు ఎన్‌బీఎఫ్‌సీల విలువ భారీగా క్షీణించిపోయింది. ఉదాహరణకు ఏడాదిలో డీహెచ్‌ఎఫ్‌ఎల్‌ షేరు విలువ 80 శాతం, ఐబీ హౌసింగ్‌ ఫైనాన్స్‌ షేరు 40 శాతం మేర పతనమయ్యాయి. దీంతో వీటి మార్కెట్‌ క్యాప్‌ విపరీతంగా పడిపోయింది. ఈ నేపథ్యంలో పలు ఎంఎఫ్‌లు ఎన్‌బీఎఫ్‌సీ

Most from this category