News


ఈ షేర్లలో ఎంఏసీడీ బేరిష్‌ సంకేతాలు!

Tuesday 1st October 2019
Markets_main1569909436.png-28652

దేశీయ సూచీల్లో సోమవారం ముగింపు ప్రకారం 156 షేర్ల చార్టుల్లో ఎంఏసీడీ(మూవింగ్‌ ఏవరేజ్‌ కన్వర్జన్స్‌ డైవర్జన్స్‌) ఇండికేటర్‌ బేరిష్‌ సంకేతాలు ఇస్తోందని టెక్నికల్‌ అనలిస్టులు చెబుతున్నారు. ఈ షేర్లలో ఎంఏసీడీ బేరిష్‌ క్రాసోవర్‌ ఏర్పరిచింది. ఇలా నెగిటివ్‌గా  మారిన కంపెనీల్లో హెచ్‌డీఎఫ్‌సీ, టాటా మోటర్స్‌, హీరోమోటోకార్‌‍్ప, టాటాపవర్‌, ఐబీ హౌసింగ్‌, ఐబీ వెంచర్స్‌, థామస్‌ కుక్‌, కాడిలా హెల్త్‌కేర్‌, ఆర్‌క్యాప్‌, ఎల్‌అండ్‌టీ ఫైనాన్స్‌, అదానీ గ్యాస్‌ తదితరాలున్నాయి. ఈ కౌంటర్లలో ట్రెండ్‌ బలహీనంగా ఉందని టెక్నికల్‌ విశ్లేషకులు చెపుతున్నారు.
ఎంఏసీడీ అంటే..
మార్కెట్‌ నిపుణులు ఒక నిర్దేశిత కౌంటర్లో ట్రెండ్‌ రివర్సల్‌ గుర్తించేందుకు ఎంఏసీడీ ఇండికేటర్‌ను వాడతారు.  26, 12 రోజుల ఎక్స్‌పొటెన్షియల్‌ మూవింగ్‌ యావరేజెస్‌ మధ్య భేదం ఆధారంగా ఎంఏసీడీ పనిచేస్తుంది. 9రోజుల ఎక్సోపోనెన్సియల్‌ మూవింగ్‌ యావరేజిని సిగ్నల్‌ లైన్‌గా పిలుస్తారు. సిగ్నల్‌లైన్‌ ఆధారంగా బై, సెల్‌ అవకాశాలను గణిస్తారు. సిగ్నల్‌లైన్‌కు పైన ఎంఏసీడీ లైన్‌ కదలాడితే బుల్లిష్‌గా, ఈ లైన్‌కు దిగువకు వస్తే బేరిష్‌గా చెప్పవచ్చు. ఎంఏసీడీ రెండు లైన్లు ఒకదానినొకటి క్రాస్‌ చేసే విధానాన్ని బట్టి బేరిష్‌ క్రాసింగ్‌, బుల్లిష్‌ క్రాసింగ్‌గా చెబుతారు.  
ఈ షేర్లలో బుల్లిష్‌ క్రాసోవర్‌
మరోవైపు 13 షేర్లలో  ఎంఏసీడీ బుల్లిష్‌ క్రాసోవర్‌ ఏర్పడింది. పవర్‌గ్రిడ్‌, గుజరాత్‌ గ్యాస్‌, హిందుస్థాన్‌ జింక్‌, జేఎస్‌డబ్ల్యు ఎనర్జీ, ఎన్‌ఐఐటీ, రెడింగ్టన్‌తదితరాలు ఈ జాబితాలో వున్నాయి.  మదుపరులు ఇన్వెస్ట్‌ చేయాలంటే కేవలం ఎంఏసీడీ ఇండికేటర్‌ను మాత్రమే విశ్వసించకుండా,  ఇతర ఇండికేటర్లు పరిశీలించి అధ్యయనం చేయాలని నిపుణులు సూచిస్తున్నారు.
ఎంఏసీడీతోపాటు ఆర్‌ఎస్‌ఐ, బోలింగర్‌ బ్యాండ్‌ లాంటి ఇతర ఇండికేటర్లను పరిశీలించి ట్రెండ్‌ను నిర్ధారణ చేసుకోవాలి.  You may be interested

ఐఆర్‌సీటీసీ ఐపీఓ: రెండో రోజే 100శాతం సబ్‌స్క్రిప్షన్‌

Tuesday 1st October 2019

రైల్వేరంగంలో సేవలందించే ఐఆర్‌సీటీసీ ఐపీఓకు రెండో రోజూ అనూహ్య స్పందన లభించింది. తొలిరోజు 81శాతం సబ్ స్క్రైబ్ కావడంతో అదే ఉత్సాహంతో మంగళవారం ఉదయం కల్లా 100శాతం సబ్‌స్క్రిప్షన్‌ సాధించింది. నేటి ఉదయం గం.10:30 కల్లా 2.18 కోట్ల షేర్లకు బిడ్లు ధాఖలైన ఎన్‌ఎస్‌ఈ గణాంకాలు చెబుతున్నాయి. అక్టోబర్‌ 03 వరకు బిడ్లను స్వీకరిస్తారు. కేంద్ర ప్రభుత్వ రైల్వేలకు చెందిన ఆన్‌లైన్‌ టికెటింగ్‌, టూరిజం, కేటరింగ్‌ సంస్థ ఐఆర్‌సీటీసీ ఐపీఓ

24% తగ్గిన మారుతి అమ్మకాలు

Tuesday 1st October 2019

దేశీయ అతిపెద్ద కార్ల తయారి సంస్థయిన మారుతి సుజుకి ఇండియా సెప్టెంబర్‌ నెల అమ్మకాలు విశ్లేషకుల అంచనాల కంటే తగ్గాయి. ఈ కంపెనీ సెప్టెంబర్‌ నెలలో 1.22 లక్షల యూనిట్లను విక్రయించగా, గత ఏడాది ఇదే నెలలో 1.62 లక్షల యూనిట్ల విక్రయాలను నమోదుచేసింది. మొత్తంగా గత ఏడాది సెప్టెంబర్‌ నెలతో పోల్చుకుంటే ఈ సెప్టెంబర్‌లో మారుతి అమ్మకాలు 24.4 శాతం పడిపోవడం గమనార్హం. కానీ తక్కువ బేస్‌ కారణంగా

Most from this category