News


భారతీయ రైల్వే పట్టాలపై ప్రైవేటు రైళ్ల పరుగులు

Monday 30th December 2019
Markets_main1577644742.png-30502

భారతీయ రైల్వే పట్టాలపై ప్రైవేటు రైళ్లు అతి త్వరలోనే విస్తృతంగా కనిపించనున్నాయి. ఇప్పటికే భారతీయ రైల్వే అనుబంధ సంస్థ ఐఆర్‌సీటీసీ ఢిల్లీ-లక్నో మార్గంలో తేజస్‌ ఎక్స్‌ప్రెస్‌ పేరుతో ప్రైవేటు రైలు సర్వీసు నడుపుతోంది. మరో తేజస్‌ ఎక్స్‌ప్రెస్‌ సర్వీసును అహ్మదాబాద్‌-ముంబై మధ్య జనవరి 16 నుంచి ఐఆర్‌సీటీసీ ప్రారంభించనుంది. ఈ రెండు సర్వీసులను ప్రయోగాత్మకంగా ఐఆర్‌సీటీసికి అప్పగించగా, ఢిల్లీ-లక్నో మధ్య సర్వీస్‌ విజయవంతం అయింది. దీంతో 150 ‍ప్రైవేటు రైలు సర్వీసుల ప్రణాళిక త్వరలోనే పట్టాలెక్కనుందని సమాచారం. రైల్వే శాఖ పబ్లిక్‌-ప్రైవేటు భాగస్వామ్యం ప్రతిపాదనకు కేంద్ర ఆర్థిక శాఖ సూత్రప్రాయ ఆమోదం కూడా తెలిపింది. 

 

సికింద్రాబాద్‌-విశాఖపట్నం, చెన్నై-సికింద్రాబాద్‌, విశాఖపట్నం-తిరుపతి మార్గాలు కూడా వీటిల్లో ఉన్నాయి. అలాగే, ముంబై-కోల్‌కతా, ముంబై-చైన్నై, ముంబై-గువహటి, న్యూఢిల్లీ-ముంబై, తిరువనంతపురం-గువహటి, న్యూఢిల్లీ-కోల్‌కతా, న్యూఢిల్లీ-బెంగళూరు, న్యూఢిల్లీ-చెన్నై, కోల్‌కతా-చెన్నై, చెన్నై-జోధ్‌పూర్‌ మార్గాలు కూడా ఇందులో ఉన్నాయి. ప్రైవేటు ఆపరేటర్ల నిర్వహణలో 150 రైళ్లు నడిపేందుకు అనువైన 100 మార్గాలను రైల్వే శాఖ గుర్తించింది. వీటిల్లో 35 మార్గాలు ఢిల్లీని అనుసంధానించేవే ఉన్నాయి. ‘‘150 రైళ్లను నడిపేందుకు గాను ప్రైవేటు సంస్థల నుంచి బిడ్లను ఆహ్వానించేందుకు పబ్లిక్‌, ప్రైవేటు భాగస్వామ్య మదింపు కమిటీ ఇప్పటికే ఆమోదం తెలిపింది. త్వరలోనే 10-15 రోజుల్లో బిడ్లను ఆహ్వానించే అవకాశం ఉంది. భారతీయ రైల్వేలకు ఇదొక మైలురాయి అవుతుంది’’ అని రైల్వేబోర్డ్‌ చైర్మన్‌ వినోద్‌ కుమార్‌ యాదవ్‌ తెలిపారు. 

 

నీతి ఆయోగ్‌ సీఈవో అమితాబ్‌ కాంత్‌ అధ్యక్షతన గల అత్యున్నత స్థాయి కమిటీ రైలు సర్వీసుల ‍ప్రైవేటీకరణ ప్రతిపాదన కోసం ఇప్పటికే పలు మార్లు భేటీ అయి చర్చించింది. ప్రైవేటు రైళ్ల ప్రతిపాదనను వేగంగా అమలు చేయాల్సిన అవసరాన్ని గుర్తించిందని అధికార వర్గాలు తెలిపాయి. ‘‘గరిష్టంగా 160 కిలోమీటర్ల వేగంతో రైళ్లను నడిపించేందుకు మూడు లేదా నలుగురు ప్రైవేటు ఆపరేటర్లతో భాగస్వామ్యం ఏర్పాటు చేసుకోవాలని నిర్ణయించడం జరిగింది. సర్వీసుల నిర్వహణలో టెక్నాలజీ వినియోగం, ధరల నిర్ణయాన్ని వారికే వదిలివేయనున్నాం’’ అని ఓ సీనియర్‌ రైల్వే అధికారి తెలిపారు. ఈ నెల 31న ఢిల్లీలో సమావేశం అనంతరం బిడ్డింగ్‌కు సంబంధించి వివరాలు వెల్లడయ్యే అవకాశం ఉంది.



You may be interested

ఆర్థికాంశాలే దిక్సూచి..!

Monday 30th December 2019

ఈ వారంలోనే మార్కిట్ తయారీ పీఎంఐ,  ఆటో రంగ విక్రయాల డేటా వెల్లడి నేడే ఆర్‌బీఐ ఆపరేషన్‌ ట్విస్ట్‌ 2.0 తక్కువ వాల్యూమ్స్‌తో కన్సాలిడేషన్‌కు అవకాశం ముంబై: స్థూల ఆర్థిక గణాంకాలు, ఆటో రంగ పరిశ్రమ అమ్మకాలు వంటి అంశాలు ఈ వారంలో దేశీ స్టాక్‌ మార్కెట్‌కు దిశా నిర్దేశం చేయనున్నాయని దలాల్‌ స్ట్రీట్‌ వర్గాలు భావిస్తున్నాయి. నవంబర్‌ నెలకు సంబంధించి.. ఎనిమిది కీలక రంగాల ఉత్పత్తి, మార్కిట్ తయారీ పీఎంఐ వంటి అంశాలు మార్కెట్‌

బ్యాంకు రుణాలు మాకొద్దు..!?

Monday 30th December 2019

దేశంలో 50 కార్పొరేట్‌ కంపెనీలు ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి ఆరు నెలల కాలంలో (2019 ఏప్రిల్‌-సెప్టెంబర్‌) మొత్తం మీద రూ.59,600 కోట్ల మేర రుణభారాన్ని తగ్గించుకున్నాయి. తమ బ్యాలన్స్‌షీట్లలో రుణ భారాన్ని తగ్గించుకోవాలన్న కార్యాచరణలో భాగమే ఇది. ఇది బ్యాంకుల రుణాల వృద్ధిపై ప్రభావం చూపిస్తుందని, దేశీయ బ్యాంకుల నుంచి కార్పొరేట్ల రుణ సమీకరణ తగ్గినట్టు విశ్లేషకులు చెబుతున్నారు. ఇవే కంపెనీలు క్రితం ఆర్థిక సంవత్సరం 2018-19లోనూ రూ.43,000

Most from this category