News


52 వారాల గరిష్టానికి 15 షేర్లు

Monday 3rd February 2020
Markets_main1580711310.png-31465


సోమవారం ఎన్‌ఎస్‌ఈలో సుమారు 15 షేర్లు 52 వారాల గరిష్టానికి చేరుకున్నాయి. 52 వారాల గరిష్టానికి చేరిన షేర్లలో ఏజీసీ నెట్‌వర్క్స్‌, క్రాంప్టన్‌ గ్రీవ్స్‌ కన్జూమర్‌ ఎలక్ట్రికల్స్‌, నెస్ట్లే ఇండియా, రుచీ సోయా ఇండస్ట్రీస్‌, సిర్కా పెయింట్స్‌ ఇండియా, యూనిటెక్‌, విశేష్‌ ఇన్ఫోటెక్‌లు ఉన్నాయి.

52 వారాల కనిష్టానికి 83 షేర్లు
 ఎన్‌ఎస్‌ఈలో 83 షేర్లు 52 వారాల కనిష్టానికి చేరాయి. వీటిలో అలహాబాద్‌ బ్యాంక్‌, భారత్‌ హెవీ ఎలక్ట్రీకల్స్‌ లిమిటెడ్‌, సీఎస్‌బీ బ్యాంక్‌, డీహెచ్‌ఎఫ్‌ఎల్‌, ఈఐహెచ్‌, హిందుస్థాన్‌ జింక్‌, ఇండియన్‌ బ్యాంక్‌, ఐటీసీ లిమిటెడ్‌, కరూర్‌ వైశ్యా బ్యాంక్‌, లక్ష్మీ మెషిన్‌ వర్క్స్‌, ఆయిల్‌ ఇండియా, ఓఎన్‌జీసీ, టేక్‌ సొల్యూషన్‌​, యూనియన్‌ బ్యాంక్‌  ఆఫ్‌ ఇండియాలు ఉన్నాయి.  ఉదయం 10.30 గంటల సమయంలో నిఫ్టీ50 ఇండెక్స్‌లో 39 షేర్లు గ్రీన్‌లో ట్రేడ్‌ అవుతుండగా, 11 షేర్లు రెడ్‌లో ట్రేడ్‌ అవుతున్నాయి. హల్‌, ఏసియన్‌ పెయింట్స్‌, ఇండస్‌లాండ్‌ బ్యాంక్‌, నెస్ట్లే ఇండియా, బ్రిటానియా ఇండస్ట్రీస్‌ టాప్‌ గెయినర్స్‌ లిస్ట్‌లో ఉన్నాయి. భారతీ ఇన్‌ఫ్రాటెల్‌, ఐటీసీ, యస్‌బ్యాంక్‌, హిందాల్కో ఇండస్ట్రీస్‌, లార్సెన్‌ అండ్‌ టుబ్రో(ఎల్‌ అండ్‌ టీ)లు టాప్‌ లూసర్స్‌ లిస్ట్‌ లో ఉన్నాయి.



You may be interested

నిఫ్టీ పొజిషన్‌ హెడ్జింగ్‌కు పుట్‌ బటర్‌ఫ్లై వ్యూహం!

Monday 3rd February 2020

ఫిబ్రవరి సీరిస్‌ను సూచీలు నెగిటివ్‌ అడుగులతో ఆరంభించాయి. నిఫ్టీ కీలకమైన 12000 పాయింట్లకు బాగా దిగువకు వచ్చింది. మరోవైపు బడ్జెట్‌ అనంతరం వీఐఎక్స్‌ ఒక్కమారుగా ఎగిసింది. ఈ నేపథ్యంలో నిఫ్టీలో ఉన్న పొజిషన్లు కాపాడుకునేందుకు మోడిపైడ్‌ పుట్‌ బటర్‌ఫ్లై వ్యూహం అవలంబించాలడం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. ఇందులో సూచీలు ప్రస్తుతమున్న స్థానానికి దగ్గరగా  ఒక పుట్‌ను కొనడం, అంతకన్నా బాగా దిగువ పుట్స్‌ రెండిటిని విక్రయించడం చేస్తారు. అనంతరం అమ్మిన

1.50శాతం లాభపడ్డ ఎఫ్‌ఎంజీసీ ఇండెక్స్‌: ఐటీసీ డౌన్‌, హెచ్‌యూఎల్‌ అప్‌

Monday 3rd February 2020

ఎఫ్‌ఎమ్‌సీజీ రంగానికి చెందిన ఐటీసీ, హెచ్‌యూఎల్‌ షేర్లు సోమవారం ఉదయం ట్రేడింగ్‌ సెషన్‌లో ఒకటి నష్టాల్లోనూ, మరోటి లాభాల్లో ట్రేడ్‌ అవుతున్నాయి. హిందుస్తాన్‌ యూనిలీవర్‌(హెచ్‌యూఎల్‌) షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభించగా, ఐటీసీ షేర్లు అమ్మకాల ఒత్తిడికిలోనవుతున్నాయి. పొగాకు ఉత్పత్తులు, సిగరెట్లపై ఎన్‌సీసీడీ పన్ను పెంపుతో ఐటీసీ షేర్లు చివరి రెండు ట్రేడింగ్‌ సెషన్లో ఏకంగా 9.50శాతం నష్టాన్ని చవిచూశాయి. ఏడాదిన్నర కాలంలో రెండు ట్రేడింగ్‌ సెషన్‌లో అత్యధిక నష్టాన్ని చవిచూశాయి.

Most from this category