బేరిష్ మార్కెట్లో ఏడాది గరిష్ఠాన్ని తాకిన 15 స్టాకులు
By Sakshi

ఎన్ఎస్ఈలో మంగళవారం 15 స్టాకులు మార్కెట్ బేరిష్ కదలికలను తట్టుకొనివాటి 52 వారాల గరిష్ఠాన్ని తాకాయి. అబాట్ ఇండియా, బాటా ఇండియా, హెచ్డీఎఫ్సీ అసెట్ మేనేజ్మెంట్ కంపెనీ(ఏఎంసీ), హిందుస్తాన్ ఫుడ్స్, ఐసీఐసీఐ లోంబార్డ్ జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీ, ఇంటర్‌గ్లోబ్ ఏవియేషన్, ఇన్ఫోసిస్, లిబాస్ డిజైన్స్, మెట్రోపోలిస్ హెల్త్‌కేర్, పెట్రోనెట్ ఎల్ఎన్జీ, టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్(టీసీఎస్) షేర్లు వాటి ఏడాది గరిష్ఠాన్ని తాకిన షేర్లలో ఉన్నాయి. మధ్యాహ్నా 3.03 సమయానికి నిఫ్టీ ఇండెక్స్ 204 పాయింట్లను కోల్పోయి 10,818.95 పాయింట్ల వద్ద ట్రేడవుతుండగా, సెన్సెక్స్ 708 పాయింట్లు నష్టపోయి 36,624.12 పాయింట్ల వద్ద ట్రేడవుతోంది. మొత్తంమీద, నిఫ్టీ 50 ఇండెక్స్‌లో 5 షేర్లు పాజిటివ్‌గా ట్రేడవుతుండగా, 45 షేర్లు నష్టాల్లో ట్రేడవుతున్నాయి. టెక్ మహింద్రా, బ్రిటానియా, ఇండియా బుల్స్ హౌసింగ్ ఫైనాన్స్, భారత్ పెట్రోలియం కార్పోరేషన్(బీపీసీఎల్), హెచ్‌సీఎల్ టెక్ షేర్లు లాభాల్లో ట్రేడవుతుండగా, ఇండియా ఆయిల్ కార్ప్, టాటా స్టీల్, ఐసీఐసీఐ బ్యాంక్, అల్ట్రాటెక్ సిమెంట్, టైటాన్, వేదాంతా షేర్లు నష్టపోయిన షేర్లలో ముందున్నాయి.
You may be interested
ఏడాది కనిష్ఠాన్ని తాకిన 115 స్టాకులు
Tuesday 3rd September 2019ఎన్ఎస్ఈ మంగళవారం సెషన్లో సుమారుగా 115 స్టాకులు వాటి 52 వారాల కనిష్టానికి పడిపోయాయి. కెనరా బ్యాంక్, డీబీ కార్ప్, గోద్రేజ్ ఇండస్ట్రీస్, షెమరూ ఎంటర్టైన్మెంట్, స్టెర్లింగ్ అండ్ విల్సన్ సోలార్, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, భారత్ ఫోర్జ్ షేర్లు వాటి 52 వారాల కనిష్టాన్ని తాకిన స్టాక్‌లలో ఉన్నాయి. వీటితోపాటు అడోర్ వెల్డింగ్, అరవింద్ ఫ్యాషన్స్, భారతీయ ఇంటర్నేషనల్, బటర్‌ఫ్లై గాంధీమతి అప్లైన్స్, సీఈఎస్సీ వెంచర్స్, డైనమేటిక్
మెటల్ షేర్లకు మాంద్యం భయాలు
Tuesday 3rd September 2019అంతర్జాతీయ ఆర్థిక మందగమన భయాలతో మెటల్ షేర్లు మంగళవారం భారీ పతనాన్ని చవిచూసాయి. ఎన్ఎస్ఈలో మెటల్ షేర్లకు ప్రాతినిథ్యం వహించే నిఫ్టీ మెటల్ ఇండెక్స్ నేటి ట్రేడింగ్‌లో 2.50శాతం మేర కరిగిపోయింది. నిఫ్టీ మెటల్ ఇండెక్స్ 2,269.70 వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించింది. అగ్రరాజ్యాలైన అమెరికా-చైనాల మధ్య జరుగుతున్న వాణిజ్య యుద్ధంతో అంతర్జాతీయంగా ఆర్థిక మందగమన భయాలు నెలకొన్నాయి. ఫలితంగా ప్రపంచ మార్కెట్లో మెటల్ షేర్లకు డిమాండ్ భారీగా క్షీణించింది. అక్కడి