News


మరో 15 శాతం పతనం మిగిలేఉంది!

Thursday 11th October 2018
Markets_main1539254222.png-21052

నిపుణుల అంచనా
దేశీయ మార్కెట్లో కరెక‌్షన్‌ క్లోజయిందని భావిస్తున్నారా? మెల్లగా కొనుగోళ్లు జరుపుతున్నారా? జాగ్రత్త... సూచీల్లో ఇంకో 15 శాతం పతనం మిగిలిఉందని మార్కెట్‌ పండితులు హెచ్చరిస్తున్నారు. సూచీలు తమ సరైన వాల్యూలకు ఇంకా 10- 15 శాతం అధికంగా ట్రేడవుతున్నాయని ప్రముఖ అనలిస్టు సౌరవ్‌ ముఖర్జీ చెప్పారు. 2008లో అంతర్జాతీయ సంక్షోభాన్ని ముందుగా ఊహించిన అనలిస్టుగా ఈయనకు మంచి పేరుంది. ప్రస్తుతం సూచీలు ఆగస్టు స్థాయిలతో పోలిస్తే దాదాపు 14 శాతం క్షీణించాయి. ఈ ఏడాది ఇన్వెస్టర్లకు అందించిన లాభాలన్నింటినీ తాజా పతనం తుడిచిపెట్టింది. గురువారం సెన్సెక్స్‌ మరో భారీ క్షీణత నమోదు చేసింది. అంతర్జాతీయ మార్కెట్లన్నీ లోతైన కరెక‌్షన్‌లోకి కూరుకుపోయి ఉన్నాయి. ఈ నేపథ్యంలో మన సూచీల్లో కనీసం 10 శాతం లేదంటే 15 శాతం వరకు కరెక‌్షన్‌ ఖాయమని ముఖర్జీ చెబుతున్నారు. మార్కెట్లు అధిక వాల్యూషన్ల వద్ద ఉన్నాయని తాను ఎప్పటినుంచో చెబుతున్నానని గుర్తు చేశారు. మరోవైపు ప్రముఖ బ్రోకరేజ్‌ సంస్థలు సైతం ఇదే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నాయి. 
దేశీయ సూచీల వాల్యూషన్లు ఇంకా అధికంగానే ఉన్నాయని స్టాండర్డ్‌ చార్టర్‌ ఒక నివేదికలో పేర్కొంది. క్రెడిట్‌ సూసీ సైతం ఇదే మాట చెబుతూ రాబోయే రోజుల్లో స్టాక్‌ మార్కెట్లో మరింత డౌన్‌ట్రెండ్‌ ఉంటుందని హెచ్చరించింది. దేశీయ కార్పొరేట్ల ఎర్నింగ్స్‌ డౌన్‌గ్రేడ్‌ ముప్పు ఎదుర్కొంటున్నందున సూచీలు నేల చూపులే చూస్తాయని తెలిపింది. ముఖ్యంగా ఫైనాన్షియల్స్‌, కన్జూమర్‌, ఆటో రంగాల కంపెనీల ఫలితాలు పేలవంగా ఉంటాయని అంచనా వేసింది. ఫైనాన్షియల్‌ స్టాకుల డీరేటింగ్‌ తప్పదని ముఖర్జీ అభిప్రాయపడ్డారు. ప్రస్తుతానికి ఐటీ రంగమే కాస్త మెరుగ్గా ఉందన్నారు. ఫార్మా వాల్యూషన్లు ఎక్కువగా ఉన్నా కొనుగోలు చేయవచ్చని సూచించారు. మూలధనం కాపాడుకోవడమే ఈ ఏడాది  ఇన్వెస్టర్లకు ముఖ్య లక్ష్యంగా మారుతుందని సెంట్రమ్‌ బ్రోకింగ్‌ చెబుతోంది. లాభాల సంగతి తర్వాత, ముందు అసలుకు మోసం రాకుండా చూసుకోవాలని హెచ్చరిస్తోంది. ప్రస్తుతం నిఫ్టీ పీఈ సుమారు 20 స్థాయిల వద్ద ఉంది. You may be interested

దలాల్‌ స్ట్రీట్‌లో వాల్‌స్ట్రీల్‌ మంటలు

Thursday 11th October 2018

759 పాయింట్లు నష్టపోయిన సెన్సెక్స్‌ 10,250ల దిగువకు నిఫ్టీ వాల్‌స్ట్రీట్‌లో బుధవారం రాత్రి రాజుకున్న అమ్మకాల మంటలు సెగలు గురువారం మన మార్కెట్‌ను తాకాయి. ఫలితంగా ఐటీ, ఫైనాన్షియల్‌, బ్యాంకింగ్‌ రంగ షేర్లలో నెలకొన్న అమ్మకాలతో సూచీలు ఈ ఏడాదిలో ఆర్జించిన లాభాలన్నీ కోల్పోయాయి. ఇంట్రాడేలో సెన్సెక్స్‌ 1038 పాయింట్లను కోల్పోయింది. నిఫ్టీ 392 పాయింట్లు నష్టపోయింది. మిడ్‌సెషన్‌లో సూచీలు కొంత రికవరీ బాటలో సాగినప్పటికి.., ఆ ర్యాలీ ఎంతోసేపు నిలువలేదు యూరప్‌

వెలుగులో పెట్రో మార్కెటింగ్‌ షేర్లు

Thursday 11th October 2018

ప్రపంచమార్కెట్లో నెలకొన్న అమ్మకాల ట్రెండ్‌ భాగంగా మన మార్కెట్‌ భారీగా నష్టపోయినప్పటికీ ఆయిల్‌ మార్కెటింగ్‌ కంపెనీ షేర్లు లాభపడ్డాయి. అంతర్జాతీయ మార్కెట్‌లో నేడు ముడిచమురు ధరలు రెండువారాల కనిష్టానికి చేరుకోవడంతో ఆయిల్‌ మార్కెటింగ్‌ కంపెనీ షేర్లు వెలుగులోకి వచ్చాయి.  కిరోసిన్‌, ఎల్‌పీజీల సబ్సిడీ భారాన్ని చమురు కంపెనీలపై మోపబోమం‍టూ ప్రభుత్వం  తెలిపింది. ఈ నేపథ్యంలో ఎంఓసీ షేర్లలో కొనుగోళ్లు పెరిగాయి. నేడు ఎన్‌ఎస్‌ఈలోని టాప్‌-5 గెయినర్లలో 5 షేర్లు అయిల్‌ మార్కెటింగ్‌

Most from this category