News


బడ్జెట్‌ నేపథ్యంలో 15 బెస్ట్‌ స్టాక్స్‌!

Tuesday 21st January 2020
Markets_main1579601681.png-31075

వచ్చే నెల 1న కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టనున్న బడ్జెట్‌లో ఆర్థిక వృద్ధికి ఊతమివ్వగల చర్యలకు ప్రాధాన్యమివ్వనున్నట్లు పలువురు ఆర్థికవేత్తలు అంచనా వేస్తున్నారు. ద్రవ్యలోటు లక్ష్యాన్ని 3.3 శాతానికిలోపు కట్టడి చేయడం సమస్యాత్మకంగా కనిపిస్తున్నప్పటికీ ప్రభుత్వం 2024కల్లా 5 ట్రిలియన్‌ డాలర్ల జీడీపీను అందుకునేందుకు వీలుగా ప్రణాళికలు ప్రకటించనున్నట్లు భావిస్తున్నారు. ఇటీవల అటు ప్రభుత్వం.. ఇటు రిజర్వ్‌ బ్యాంక్‌ ఆర్థిక పురోగతికి వీలుగా పలు చర్యలను తీసుకున్న విషయం విదితమే. ఆర్థిక శాఖ కార్పొరేట్‌ ట్యాక్స్‌లో కోత పెట్టడంతోపాటు.. ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ అభివృద్ధికి రూ. 105 లక్షల కోట్ల రోడ్‌మ్యాప్‌ను ప్రకటించింది. ఇదే సమయంలో ఆర్‌బీఐ వడ్డీ రేట్లకు కీలకమైన రెపోను దశాబ్ద కాలపు కనిష్టానికి చేర్చింది. రుణ వడ్డీ రేట్లను రెపో రేటుకు అనుసంధానించింది కూడా. ఈ పరిస్థితుల నడుమ పెట్టుబడులు, వినియోగాలకు ప్రాధాన్యతనిస్తూ ప్రభుత్వం బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నట్లు విశ్లేషకులు భావిస్తున్నారు. కాగా.. బడ్జెట్‌ నేపథ్యంలో పలువురు విశ్లేషకులు ఆర్థిక రికవరీ ఆధారంగా కొన్ని కంపెనీలను పెట్టుబడులకు సూచిస్తున్నారు. వివరాలు చూద్దాం..

కేఎన్‌ఆర్‌ కన్‌స్ట్రక్షన్స్‌
మౌలిక సదుపాయాల అభివృద్ధికి రూ. ట్రిలియన్‌ పెట్టుబడులను ప్రకటించడంతో కేఎన్‌ఆర్‌ కన్‌స్ట్రక్షన్స్‌కు డిమాండ్‌ పెరిగింది. గత కొద్ది రోజుల్లో 29 శాతం ర్యాలీ చేసింది. రూ. 295కు చేరుకుంది.
జేకే సిమెంట్‌
ఇన్‌ఫ్రా రంగం‍పై ప్రభుత్వ పెట్టుబడులు ఎలా ఉన్నప్పటికీ సిమెంట్‌ రంగంలో వినియోగం జోరందుకోనుంది. ఇప్పటికే సిమెంట్‌ ధరలపై ఈ ప్రభావం కనిపిస్తోంది. ఈ ఏడాది జేకే సిమెంట్‌ షేరు 14 శాతం బలపడిందిజ
ఐసీఐసీఐ సెక్యూరిటీస్‌
వ్యక్తిగత ఆదాయపన్నులను తగ్గించనున్నట్లు పలువురు సీనియర్లు అంచనా వేస్తున్నారు. అదనపు ఆదాయం వినియోగం, పొదుపువైపు మళ్లే అవకాశముంది. ఇది ఐసీఐసీఐ సెక్యూరిటీస్‌కు లబ్ది చేకూర్చనుంది.
డీఎల్‌ఎఫ్‌
ప్రభుత్వం పలు చర్యలు తీసుకున్నప్పటికీ గత కొన్నేళ్లుగా రియల్‌ ఎస్టేట్‌ రంగం పుంజుకోలేదు. అయితే ఈ ఏడాది పరిస్థితులు మారనున్నట్లు భావిస్తున్నారు. అద్దె ఆదాయంపై పన్ను మినహాయింపు అంచనాలున్నాయి.
టిటాగఢ్‌ వేగన్స్‌
ప్రతీ బడ్జెట్‌కు ముందు రైల్వే వేగన్ల తయారీ కంపెనీ టిటాగఢ్‌ వేగన్స్‌ కౌంటర్‌ వెలుగులోకి వచ్చే సంగతి తెలిసిందే. రైల్వే శాఖ పెట్టుబడులపై అంచనాలతో ఈ కౌంటర్‌ జోరందుకునే వీలుంది. ఇటీవల ఈ షేరు రెండంకెల వృద్ధితో రూ. 60కు చేరింది.
- మహేక్‌ టోమర్‌, సీఈవో, అడ్వయిజరీమండీ.కామ్‌

రైట్స్‌ లిమిటెడ్‌
గత కొంత కాలంగా రైట్స్‌ లిమిటెడ్‌ నిలకడైన వృద్ధిని కనబరుస్తోంది. సెప్టెంబర్‌ క్వార్టర్‌లో మరింత జోరు చూపింది. ఇందుకు ఎగుమతులు, టర్న్‌కీ ప్రాజెక్టులు, కన్సల్టెన్సీ ఆర్డర్లు సహకరించాయి. ఈ ఏడాది ఆర్డర్‌ బుక్‌ విలువ రూ. 8,000 కోట్లను తాకనున్నట్లు కంపెనీ యాజమాన్యం భావిస్తోంది. రుణ భారంలేకపోవడం, మెరుగైన లిక్విడిటీ కారణంగా నిర్వహణ మార్జిన్లు బలపడనున్నాయి.
కేఈఐ ఇండస్ట్రీస్‌
విద్యుత్‌, ఇన్‌ఫ్రా, రైల్వే, ఆయిల్‌ అండ్‌ గ్యాస్‌, స్టీల్‌ తదితర పలు రంగాలకు కేఈఐ ఇండస్ట్రీస్‌ ప్రొడ‍క్టులు, సర్వీసులు అందిస్తోంది. విద్యుత్‌, మౌలికం, రియల్టీ రంగాలు పుంజుకుంటే కంపెనీ లబ్ది పొందే అవకాశముంది. మార్జిన్లు పెంచుకునేందుకు వీలుగా డీలర్ల నెట్‌వర్క్‌, పంపిణీలపై ప్రత్యేక దృష్టి పెట్టింది. రెండేళ్లలో ఆదాయం 17 శాతం చొప్పున పుంజుకోగలదని కంపెనీ అంచనా వేస్తోంది. పూర్తి ఏడాదికి 10.5 శాతం ఇబిటా మార్జిన్లు సాధించే వీలుంది.
గుజరాత్‌ గ్యాస్‌
మార్జిన్లను నిలుపుకుంటూనే గుజరాత్‌ గ్యాస్‌ పటిష్ట వృద్ధిని సాధిస్తోంది. ప్రస్తుతం సర్వీసులు అందిస్తున్న ప్రాంతాలలో పీఎన్‌జీ కనెక్షన్లు, సీఎన్‌జీ స్టేషన్లను పెంచుకోవడంపై దృష్టి పెట్టింది. కొత్తగా ప్రవేశించిన ప్రాంతాలలోనూ కార్యకలాపాల విస్తరణను చేపట్టింది. ఈ ఏడాది 63 సీఎన్‌జీ స్టేషన్లను అదనంగా ఏర్పాటు చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. 13 శాతం ఇబిటా మార్జిన్లు సాధించాలని చూస్తున్నట్లు యాజమాన్యం తెలియజేసింది.
జేబీ కెమికల్స్‌ అండ్‌ ఫార్మా
దేశీ ఫార్ములేషన్ల మార్కెట్లకు జేబీ కెమికల్స్‌ అండ్‌ ఫార్మా అత్యంత ప్రాధాన్యమిస్తోంది. తద్వారా అధిక వృద్ధికి అవకాశముంది. ఇందుకు వీలుగా ప్రస్తుతం విక్రయిస్తున్న ఔషధాలకు జతగా మరిన్ని కొత్త ప్రొడక్టులను ప్రవేశపెట్టనుంది. నిలకడగా పటిష్ట క్యాష్‌ఫ్లోలు సాధిస్తోంది. ఆరోగ్య పరిరక్షణకు ప్రభుత్వ, ప్రయివేట్‌ రంగాలు ఇస్తున్న ప్రాధాన్యత ద్వారా లబ్ది పొందనుంది.
ఐసీఐసీఐ ప్రుడెన్షియల్‌ లైఫ్‌
కొత్త బిజినెస్‌ను పొందడంలో ఐసీఐసీఐ ప్రుడెన్షియల్‌ లైఫ్‌ ఇన్సూరెన్స్‌ ముందుంది. ఇందుకు వేగవంతంగా సాధిస్తున్న రిటైల్‌ న్యూ ప్రీమియం సహకరిస్తోంది. తద్వారా పటిష్ట రిటర్న్‌ రేషియోలను సాధిస్తోంది. పెరుగుతున్న ఉద్యోగ జనాభా, మెరుగవుతున్న తలసరి ఆదాయం వంటి అంశాలు జీవిత బీమా ఉత్పత్తులకు డిమాండ్‌ను పెంచుతున్నాయి. ప్రీమియం, రక్షణ, ప్రొడక్టివిటీ, పెర్సిస్టెన్సీల ద్వారా కొత్త బిజినెస్‌ వేల్యూలో వృద్ధిని సాధిస్తోంది.
- డీకే అగర్వాల్‌, సీఎండీ, ఎస్‌ఎంసీ ఇన్వెస్ట్‌మెంట్‌ అండ్‌ అడ్వయిజర్స్‌

ఎల్‌అండ్‌టీ లిమిటెడ్‌
పటిష్ట ఆర్డర్‌బుక్‌, ఆర్జన అవకాశాలు, నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టులు ఎల్‌అండ్‌టీ లిమిటెడ్‌కున్న బలాలు. కీలకంకాని ఆస్తులను విక్రయించడం ద్వారా నిధుల సమీకరణ చేపట్టడం కంపెనీకి లబ్దిని చేకూరుస్తోంది. ఇది వర్కింగ్‌ కేపిటల్‌ అవసరాలకు వినియోగపడుతోంది. రిటర్న్‌ రేషియోలు సైతం బలపడనున్నాయి.
బ్రిటానియా ఇండస్ట్రీస్‌
ప్రస్తుతం ఎఫ్‌ఎంసీజీ విభాగం మందగమనంలో ఉన్నప్పటికీ మధ్య కాలానికి పుంజుకోనుంది. ఆర్థిక రికవరీని యాజమాన్యం అంచనా వేస్తోంది. దీంతో మార్కెట్‌ వాటాను పెంచుకోవడంపై యాజమాన్యం దృష్టిసారించింది. పట్టణ, పల్లె ప్రాంతాలలో పంపిణీని విస్తరిస్తోంది. సామర్థ్య విస్తరణ, కొత్త ప్రొడక్టుల విడదల ద్వారా వృద్ధిని పెంచుకోనుంది.
కోరమాండల్‌ ఇంటర్నేషనల్‌
మురుగప్ప గ్రూప్‌ కంపెనీ కోరమాండల్‌ ఇంటర్నేషనల్‌ ఫాస్ఫేటిక్‌ ఫెర్టిలైజర్‌ తయారీలో రెండో అతి పెద్ద కంపెనీ. 20 శాతం మార్కెట్‌ వాటాను కలిగి ఉంది. విస్తరించిన నైరుతి రుతుపవనాలు, పెరిగిన రబీ పంటలు కంపెనీకి మేలు చేకూర్చే అవకాశముంది.
ఎంఅండ్‌ఎం లిమిటెడ్‌
ట్రాక్టర్‌ పరిశ్రమలో మార్కెట్‌ లీడర్‌ అయిన ఎంఅండ్‌ఎం లిమిటెడ్‌ గ్రామ ప్రాంతాల వినియోగం ద్వారా లబ్ది పొందే కంపెనీలలో ముందుంటుంది. ట్రాక్టర్ల మార్కెట్లో 40 శాతం వాటాను కలిగి ఉంది. సాధారణ రుతుపవనాలు, తగ్గిన వడ్డీ రేట్లు, మెరుగుపడుతున్న లిక్విడిటీ పరిస్థితులు కంపెనీ వృద్ధికి దోహదం చేయనున్నాయి. 
రామ్‌కో సిమెంట్స్‌
దక్షిణాదిన గల అగ్ర సిమెంట్‌ కంపెనీలలో ఒకటైన రామ్‌కో సిమెంట్స్‌ కొత్త తరహా ప్రొడక్టులపై దృష్టి పెట్టి ముందుకుసాగుతోంది. ఉత్తమ ప్రొడక్ట్‌ మిక్స్‌, ఉత్పాదకతను మెరుగుపరచుకోవడం వంటి అంశాలతో పటిష్టతను చాటుకుంటోంది. ఇన్‌ఫ్రా, హౌసింగ్‌ రంగాలపై ప్రభుత్వ దృష్టి కంపెనీకి అవకాశాలను పెంచనుంది.
- అజిత్‌ మిశ్రా, రీసెర్చ్‌ వీపీ, రెలిగేర్‌ బ్రోకింగ్‌You may be interested

టెలికాం షేర్లకు సుప్రీం కోర్టు జోష్‌..!

Tuesday 21st January 2020

టెలికాం సంస్థల తుది గడువు చెల్లింపు సవరణ పిటిషన్‌ను వచ్చే వారంలో విచారణ చేయడానికి సుప్రీం కోర్టు అంగీకారం తెలపడంతో మంగళవారం టెలికం షేర్లు జోరు చూపించాయి. గత ఏడాది అక్టోబర్‌ 24న టెలికాం కంపెనీలు తమ లైసెన్స్‌ ఫీజు, స్పెక్ట్రం యూజర్‌ ఛార్జీలు(ఎస్‌యూసీ) 90 రోజుల్లోపు చెల్లించాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. ఈ తీర్పుపై వొడాఫోన్‌ ఐడియా, భారతి ఎయిర్‌టెల్‌లు వేసిన రివ్యూ పిటీషన్‌ను సుప్రీంకోర్టు కొట్టివేసింది. ఈ జనవరి 23తో ఏజీఆర్‌

నిరాశావాదంలో కార్పొరేట్‌ దిగ్గజాలు!...పీడబ్ల్యూసీ సర్వే

Tuesday 21st January 2020

-రికార్డు స్థాయిలో ఉన్నారన్న పీడబ్ల్యూసీ సర్వే  దావోస్‌: మేధావులైనా, అపర కుబేరులైనా సరే సమస్యల వలయంలో చిక్కుకున్నప్పుడు మానసిక ఆందోళన ఎదుర్కోక తప్పదు. ఇదే విషయం తాజాగా ఓ సర్వేలో వెల్లడైంది. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న కంపెనీల సీఈవోలలో  నిరాశావాదం రికార్డు స్థాయిలో ఉందని తాజాగా ఓ సర్వేలో తేలింది.  గ్లోబల్‌ కన్సల్టెన్సీ పీడబ్ల్యూసీ ప్రపంచ వ్యాప్తంగా 83 ప్రాంతాల్లో 1600 మంది సీఈవోలపై సర్వే నిర్వహించింది. పీడబ్ల్యూసీ తన నివేదికను

Most from this category