News


రేట్ల కోతతో ఈ స్టాక్స్‌కు అనుకూలం...!

Wednesday 7th August 2019
Markets_main1565201632.png-27616

ఆర్‌బీఐ వరుసగా నాలుగో విడత బుధవారం కీలక రేట్లను తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది. ఏకంగా 35 బేసిస్‌ సాయింట్లను తగ్గించడం వల్ల నిధుల సమీకరణ వ్యయాలు తగ్గి ఆర్థిక రంగం పునరుత్తేజం చెందుతుందని శామ్కో సెక్యూరిటీస్‌ వ్యవస్థాపకుడు, సీఈవో జిమీత్‌ మోదీ అభిప్రాయపడ్డారు. రేట్ల తగ్గింపు రుణాలపై ఆధారపడిన కంపెనీలకు, అదే సమయంలో బ్యాంకులు, ఎన్‌బీఎఫ్‌సీలకు మేలు చేస్తుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. రియల్టీ రంగానికీ ప్రయోజనం చేకూరుస్తుందంటున్నారు. ఈ నేపథ్యంలో తాజా రేట్ల కోతతో అధిక ప్రయోజనం పొందే కంపెనీలను పలువురు నిపుణులు సూచించారు. 

 

అశోక్‌లేలాండ్‌, మారుతి సుజుకీ ఇండియా: ఆటో రంగం గత కొన్ని నెలలుగా బెంచ్‌మార్క్‌ సూచీలతో వెనుకబడి ఉంది. డిమాండ్‌ తగ్గడం, నియంత్రణపరమైన విధానాల్లో మార్పులు ఆటోమొబైల్‌ కంపెనీల ఆర్థిక పనితీరుపై ప్రభావం చూపించాయి. అయితే రేట్ల కోత కొంత ఉపశమనం కల్పిస్తుంది. ఆటోమొబైల్‌, ఆటోమొబైల్‌ ఓఈఎంల అమ్మకాలు పెరిగేందుకు మేలు చేస్తుంది. లిక్విడిటీ, మూలధన వ్యయాలను పెంచుతుంది.

ఎస్‌బీఐ, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు, ఐసీఐసీఐ బ్యాంకు: రేట్ల కోత నిధులపై వ్యయాలను తగ్గిస్తుంది. దీంతో రుణ వృద్ధి పెరిగేందుకు దారితీస్తుంది. నాణ్యమైన ఆస్తులు పెరిగేందుకు, ఎన్‌పీఏల తగ్గుదలకు సాయపడుతుంది. వృద్ధి తిరిగి పుంజుకునేందుకు, బ్యాంకుల ఆర్థిక స్థిరత్వానికి రేట్ల కోత సాయపడుతుంది. బ్యాంకులు రుణ గ్రహీతలకు ఇది బదలాయిస్తే సెంటిమెంట్‌ను మెరుగుపరుస్తుందని భావిస్తున్నాం.  

- అజిత్‌ మిశ్రా, రెలిగేర్‌ బ్రోకింగ్‌ వైస్‌ ప్రెసిడెంట్‌

 

అల్ట్రాటెక్‌ సిమెంట్‌, గోద్రేజ్‌ ప్రాపర్టీస్‌, పవర్‌గ్రిడ్‌, ఎల్‌అండ్‌టీ, హాట్సన్‌ ఆగ్రో: రేట్ల తగ్గింపు అన్నది ఈక్విటీకి ఒకటి, రెండు రెట్ల మేర ఎక్కువగా రుణ భారంతో ఉన్న కంపెనీలకు మేలు చేస్తుంది. రియల్‌ ఎస్టేట్‌, విద్యుత్‌, సిమెంట్‌, ఇన్‌ఫ్రా రంగాలు రేట్ల పరంగా సున్నితమైనవి. వీటికి తక్షణ ప్రయోజనం కలుగుతుంది. ఈ స్టాక్స్‌ పట్ల విశ్వాసాన్ని పెంచుతుంది. అయినప్పటికీ అంతర్జాతీయంగా భయాలు నెలకొని ఉన్నాయి. ఈ అంశాలు భారత్‌పైనా ప్రభావం చూపుతాయి. అటువంటి సందర్భంలో అంతర్జాతీయ పరిణామాలకు తగ్గట్టుగా స్టాక్స్‌ కూడా నష్టపోవచ్చు. 

- శామ్కో సెక్యూరిటీస్‌ రీసెర్చ్‌ హెడ్‌ ఉమేష్‌ మెహతా

 

డీఎల్‌ఎఫ్‌, హీరో మోటోకార్ప్‌, ఎస్కార్ట్స్‌, ఏషియన్‌ పెయింట్స్‌: ఆర్‌బీఐ నుంచి రేట్లకోత, ఇతర చర్యలు అంతిమంగా వినియోగదారులకు బదిలీ అయితే వడ్డీ రేట్ల పరంగా సున్నితమైన ఆటోమొబైల్స్‌, రియల్‌ ఎస్టేట్‌, కన్జ్యూమర్‌ డ్యురబుల్స్‌ రంగాలకు లాభం చేకూరుస్తుంది. పడిపోతున్న డిమాండ్‌ రికవరీ అవుతుంది. ప్రమోటర్ల గ్రూపు నిధులు సమకూరుస్తుండడం డీఎల్‌ఎఫ్‌కు సానుకూలం. రేట్ల తగ్గింపు వల్ల ఈ కంపెనీ విక్రయాల డిమాండ్‌, నగదు ప్రవాహాలు పెరుగుతాయి. హీరో మోటోకార్ప్‌కు గ్రామీణంగా డిమాండ్‌ పెరగడం, వడ్డీ రేట్లు తగ్గుముఖం, వర్షాలు బాగుండడం సానుకూలిస్తాయి. 

- రొమేష్‌ తివారీ, క్యాపిటల్‌ ఎయిమ్‌ రీసెర్చ్‌ హెడ్‌You may be interested

బలపడిన రూపీ..70.80 వద్ద ప్రారంభం

Thursday 8th August 2019

రూపీ డాలర్‌ మారకంలో గురువారం 9 పైసలు బలపడి 70.80 వద్ద ప్రారంభమైంది. ఆర్‌బీఐ బుధవారం వడ్డీ రేట్లను తగ్గించడంతో పాటు, ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి సంబంధించి జీడీపీ వృద్ధి అంచనాలను తగ్గించడంతో గత సెషన్‌లో రూపీ డాలర్‌ మారకంలో 8 పైసలు బలహీనపడి 70.89 వద్ద ముగిసింది. దీంతో వరుసగా ఐదు సెషన్‌లలో రూపీ డాలర్‌ మారకంలో విలువను కొల్పోయినట్టయింది. మొత్తంగా ఈ ఐదు సెషన్‌లను కలిపి రూపీ

రేట్ల కోతపై విశ్లేషకుల మాట...

Wednesday 7th August 2019

ఆర్‌బీఐ ఎంపీసీ తాజా నిర్ణయాలపై విశ్లేషకులు, నిపుణులు దాదాపు అందరూ సానుకూల అభిప్రాయాలనే వ్యక్తం చేశారు. కాకపోతే ఆర్‌బీఐ రేట్ల తగ్గింపును బ్యాంకులు రుణ గ్రహీతలకు బదలాయించినప్పుడే ఆశించిన ప్రయోజనం నెరవేరుతుందని స్పష్టం చేశారు.    50 బేసిస్‌ పాయింట్ల మేర తగ్గింపును మేం ఆశించాం. అయితే అసాధారణంగా 35 బేసిస్‌ పాయింట్ల తగ్గింపునకు ఆర్‌బీఐ నిర్ణయం తీసుకుంది. ఇది మార్కెట్లకు కొద్ది మేర సానుకూలం. అయితే ఆర్‌బీఐ జీడీపీ వృద్ధి అంచనాలను

Most from this category