News


బుల్లిష్‌గా మారిన 126 షేర్లు

Wednesday 3rd July 2019
Markets_main1562136126.png-26758

ట్రెండ్‌ రివర్సల్‌ గుర్తించేందుకు ఎంఏసీడీ ఇండికేటర్‌ను వాడతారు.  26, 12 రోజుల ఎక్స్‌పొటెన్షియల్‌ మూవింగ్‌ యావరేజెస్‌ మధ్య భేదం ఆధారంగా ఎంఏసీడీ పనిచేస్తుంది. సిగ్నల్‌లైన్‌ ఆధారంగా బై, సెల్‌ అవకాశాలను గణిస్తారు. సిగ్నల్‌లైన్‌కు పైన ఎంఏసీడీ లైన్‌ కదలాడితే బుల్లిష్‌గా, ఈ లైన్‌కు దిగువకు వస్తే బేరిష్‌గా చెప్పవచ్చు. ఎంఏసీడీ రెండు లైన్లు ఒకదానినొకటి క్రాస్‌ చేసే విధానాన్ని బట్టి బేరిష్‌ క్రాసింగ్‌, బుల్లిష్‌ క్రాసింగ్‌గా చెబుతారు.  
బుల్లిష్‌ సిగ్నల్స్‌
సోమవారం ముగింపు ప్రకారం 126 షేర్ల చార్టుల్లో ఎంఏసీడీ(మూవింగ్‌ ఏవరేజ్‌ కన్వర్జన్స్‌ డైవర్జన్స్‌) ఇండికేటర్‌ బుల్లిష్‌సంకేతాలు ఇస్తోందని టెక్నికల్‌ అనలిస్టులు చెబుతున్నారు. ఈ షేర్లలో ఎంఏసీడీ బుల్లిష్‌క్రాసోవర్‌ ఏర్పరిచింది. ఇలా పాజిటివ్‌గా  మారిన కంపెనీల్లో హెచ్‌డీఎఫ్‌సీ, బజాజ్‌ ఆటో, బజాజ్‌ ఫైనాన్స్‌, డాబర్‌ ఇండియా, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌, ఎక్సైడ్‌, జేఎస్‌డబ్ల్యు ఎనర్జీ, యూకో బ్యాంక్‌, పీవీఆర్‌, హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్‌, సింటెక్స్‌, సీమెన్స్‌, దీపక్‌ నైట్రేట్‌, రెలిగేర్‌, ఉషా మార్టిన్‌, జేపీ అసోసియేట్స్‌ తదితరాలున్నాయి.ఈ కౌంటర్లలో కొద్ది రోజుల నుంచి ట్రేడింగ్‌ పరిమాణం పెరుగుతూ, షేర్లు పెరగడం ట్రెండ్‌ పటిష్టతను సూచిస్తోందని టెక్నికల్‌ విశ్లేషకులు చెపుతున్నారు. 
ఈ షేర్లలో బేరిష్‌ క్రాసోవర్‌
మరోవైపు 17 షేర్లలో  ఎంఏసీడీ బేరిష్‌ క్రాసోవర్‌ ఏర్పడింది. ఓఐసీ, అంబుజా సిమెంట్స్‌, ముత్తూట్‌ ఫైనాన్స్‌, ఎన్‌సీసీ, మహానగర్‌ గ్యాస్‌, డీసీబీ, శ్రీరామ్‌ట్రాన్స్‌పోర్ట్‌ ఫైనాన్స్‌ తదితరాలు ఈ జాబితాలో ఉన్నాయి. మదుపరులు ఇన్వెస్ట్‌ చేయాలంటే కేవలం ఎంఏసీడీ ఇండికేటర్‌ను మాత్రమే విశ్వసించకుండా,  ఇతర ఇండికేటర్లు పరిశీలించి అధ్యయనం చేయాలని నిపుణులు సూచిస్తున్నారు.
ఎంఏసీడీతోపాటు ఆర్‌ఎస్‌ఐ, బోలింగర్‌ బ్యాండ్‌ లాంటి ఇతర ఇండికేటర్లను పరిశీలించి ట్రెండ్‌ను నిర్ధారణ చేసుకోవాలి. You may be interested

వాట్సాప్‌తో బీఎస్‌ఎన్‌ఎల్‌ పోటీ..

Wednesday 3rd July 2019

 వైఫైతో కాల్స్‌ చేసుకునే సదుపాయం ప్రస్తుతం ప్రయోగదశలో వీవోవైఫై  ముందుగా ద్వితీయ శ్రేణి నగరాల్లో ప్రవేశపెట్టే యోచన ముంబై:     ప్రైవేట్‌ టెల్కోల రాకతో వెనుకబడిన ప్రభుత్వ రంగ టెలికం దిగ్గజం భారత్‌ సంచార్‌ నిగమ్‌ లిమిటెడ్‌ (బీఎస్‌ఎన్‌ఎల్‌) జోరు పెంచుతోంది. తాజాగా వాట్సాప్‌ వంటి ఓవర్‌–ది–టాప్‌ (ఓటీటీ) సంస్థలతో పోటీపడేందుకు సిద్ధమవుతోంది. వైఫై ఇంటర్నెట్‌ ద్వారా కాల్స్‌ చేయడం, రిసీవ్‌ చేసుకునే సదుపాయాన్ని ప్రవేశపెట్టే యత్నాల్లో ఉంది. ఇందుకు సంబంధించిన అడ్వాన్స్‌డ్‌ వాయిస్‌

ఎయిర్‌టెల్‌ పేమెంట్స్‌లో రూ.325 కోట్లు పెట్టుబడులు

Wednesday 3rd July 2019

భారతీ ఎయిర్‌టెల్‌ రూ.260 కోట్లు  భారతీ ఎంటర్‌ప్రైజెస్‌..రూ.65 కోట్లు న్యూఢిల్లీ: ఎయిర్‌టెల్‌ పేమెంట్స్‌ బ్యాంక్‌లో భారతీ ఎయిర్‌టెల్‌, భారతీ ఎంటర్‌ప్రైజెస్‌లు రూ.325 కోట్లు పెట్టుబడులు పెట్టాయి. ప్రిఫరెన్స్‌ షేర్ల రూపంలో భారతీ ఎయిర్‌టెల్‌ రూ.260 కోట్లు, భారతీ ఎంటర్‌ప్రైజెస్‌ రూ.65 కోట్లు చొప్పున ఇన్వెస్ట్‌ చేశాయని మార్కెట్‌ ఇంటెలిజెన్స్‌ సంస్థ, టోఫ్లర్‌ తెలిపింది. కాగా ఈ రంగంలో ఉన్న అపార అవకాశాలను అందిపుచ్చుకోవడానికి, కార్యకలాపాల పునర్వ్యస్థీకరణకు పెట్టుబడులు కొనసాగిస్తామని ఎయిర్‌టెల్‌ పేమెంట్స్‌ బ్యాంక్‌

Most from this category