STOCKS

News


ఈ స్టాక్స్‌లో ప్రమోటర్లు, ఇనిస్టిట్యూషన్ల వాటా పైపైకి 

Friday 1st November 2019
Markets_main1572632533.png-29292

ఓ కంపెనీలో ప్రమోటర్లు వాటాలు పెంచుకున్నారంటే దాని వెనుక ఏదో ఒక కారణం ఉండి ఉంటుంది. ఎందుకంటే వీరు కంపెనీకి సంబంధించిన వ్యక్తులు. కానీ, ఏక కాలంలో ప్రమోటర్లతోపాటు, ఇనిస్టిట్యూషన్లు, విదేశీ ఇన్వెస్టర్లు ఒక కంపెనీలో వాటాలను పెంచుకున్నారంటే, సమీప కాలంలో ఆ కంపెనీకి సానుకూల పరిస్థితులు ఉంటాయని అర్థం చేసుకోవచ్చు. సెప్టెంబర్‌ త్రైమాసికంలో ఇలా ప్రమోటర్లు, విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్లు, మ్యూచువల్‌ ఫండ్స్‌ అన్నీ కూడా 12 కంపెనీల్లో వాటాలను పెంచుకున్నట్టు గణాంకాలను పరిశీలిస్తే తెలుస్తోంది. మార్కెట్లో మూడింట రెండొంతుల స్టాక్స్‌ చౌక వ్యాల్యూషన్లకు పడిపోయిన కాలంలో ఇలా వాటాల పెంపును సానుకూలంగానే భావించొచ్చు. 

 

సెప్టెంబర్‌ త్రైమాసికంలో ఈక్విటీ మార్కెట్లు భారీ ఎత్తు పల్లాలను చూసిన విషయం గుర్తుండే ఉంటుంది. ఎందుకంటే బడ్జెట్‌ ఆశాజనకంగా లేకపోవడం, విదేశీ ఇన్వెస్టర్లపై సర్‌చార్జీ పెంపు ప్రకటనతో మార్కెట్లు తీవ్ర అమ్మకాలను ఎదుర్కొన్నాయి. దీనికి తోడు మొదటి త్రైమాసికంలో జీడీపీ వృద్ధి రేటు 5 శాతానికి పడిపోయింది. వీటికి అంతర్జాతీయంగా ఆర్థిక మాంద్యం, అమెరికా-చైనా ట్రేడ్‌వార్‌ అంశాలు కూడా తోడవడంతో నిఫ్టీ ఒక దశలో 11,700 దిగువకు కూడా వెళ్లిపోయింది. కానీ, కార్పొరేట్‌ పన్ను తగ్గింపు, విదేశీ ఇన్వెస్టర్లపై సర్‌చార్జీ పెంపు ఉపసంహరణ సహా ప్రభుత్వం ప్రకటించిన పలు చర్యలు తిరిగి మార్కెట్లను పైకి తీసుకెళ్లాయి. నికరంగా సెప్టెంబర్‌ త్రైమాసికంలో ప్రధాన సూచీలు 2.57 శాతం మేర నష్టపోతే, మిడ్‌క్యాప్‌, స్మాల్‌క్యాప్‌ సూచీలు 5 శాతానికి పైగా పడిపోయాయి. విప్రో, లా ఒపాలా ఆర్‌జీ, అతుల్‌, అడ్వాన్జ్‌డ్‌ ఎంజైమ్‌ టెక్నాలజీస్‌, లెమన్‌ట్రీ హోటల్స్‌ ఇలా వాటాలు పెంచుకున్న వాటిల్లో ఉన్నాయి. విప్రో స్టాక్‌ పట్ల సెంట్రమ్‌ బ్రోకింగ్‌ సానుకూలంగా ఉంది. లెమన్‌ట్రీ హోటల్‌కు ఆనంద్‌రాఠి బై రేటింగ్‌ ఇచ్చింది. 

 

అలెంబిక్‌ కంపెనీలోనూ ప్రమోటర్లు, ఎఫ్‌ఐఐలు, మ్యూచువల్‌ ఫండ్స్‌ వాటా పెంచుకోవడం గమనార్హం. ఇలా వాటాలు పెంచుకున్న కంపెనీల్లో ట్యూబ్‌ ఇన్వెస్ట్‌మెంట్స్‌, ముత్తూట్‌ క్యాపిటల్‌, గెలాక్సీ సర్‌ఫాక్టంట్స్‌, ఆల్కెమ్‌ ల్యాబ్‌, జీఎంఆర్‌ ఇన్‌ఫ్రా కూడా ఉన్నాయి. ఇన్వెంచర్‌ గ్రోత్‌ అండ్‌ సెక్యూరిటీస్‌ అయితే అతుల్‌, ఆల్కెమ్‌ ల్యాబొరేటరీస్‌, గెలాక్సీ సర్‌ఫాక్టంట్స్‌ స్టాక్స్‌ను సంవత్‌2076 సిఫారసులుగా పేర్కొంది. ఈ జాబితాలోని ఏడు స్టాక్స్‌ ఈ ఏడాది అక్టోబర్‌ 29 వరకు నికరంగా సానుకూల రాబడులను ఇచ్చాయి. గెలాక్సీ సర్‌ఫాక్టంట్స్‌, జీఎంఆర్‌ ఇన్‌ఫ్రా, అతుల్‌, ట్యూబ్‌ ఇన్వెస్ట్‌మెంట్‌, అలెంబిక్‌, విప్రో, ఆల్కెమ్‌ ల్యాబ్‌ ఇప్పటి వరకు 27 శాతం వరకు రాబడులను ఇచ్చాయి. ముత్తూట్‌ క్యాపిటల్‌, లా ఒపాలా ఆర్‌జీ, లెమన్‌ట్రీ హోటల్స్‌, అపార్‌ ఇండస్ట్రీస్‌, అడ్వాన్స్‌డ్‌ ఎంజైమ్‌ మాత్రం ఈ ఏడాది నికరంగా నష్టాల్లోనే ఉన్నాయి. అయితే, ప్రమోటర్లు, ఇనిస్టిట్యూషన్ల కొనుగోళ్లను గుడ్డిగా అనుసరించకుండా, వాటి కొనుగోళ్ల వెనుక ఉన్న కారణాలను తెలుసుకుని నిర్ణయం తీసుకోవాలన్నది నిపుణుల సూచన.You may be interested

సూచీల గమనంపై విశ్లేషకుల అభిప్రాయాలు

Friday 1st November 2019

ప్రధాన సూచీలు నూతన గరిష్టాలను సమీపించాయి. సెన్సెక్స్‌ ఇప్పటికే నూతన గరిష్టాలను చేరుకుంది. నిఫ్టీదే తరువాయి. మరి ఈ క్రమంలో తదుపరి సూచీల గమనంపై విశ్లేషకులు, బ్రోకరేజీ సంస్థల అభిప్రాయాలు ఇలా ఉ‍న్నాయి.    నిఫ్టీ 11,850-11,840 శ్రేణిని దిగిపోతే లాభాల స్వీకరణ చోటు చేసుకుంటుంది. దాంతో నిఫ్టీ 11,770-11,720 వరకు వెళ్లొచ్చు. స్వల్ప కాల చార్ట్‌పై ఆర్‌ఎస్‌ఐ అధిక కొనుగోళ్ల జోన్‌కు చేరింది. ఇది స్వల్ప కరెక్షన్‌ను సూచిస్తోంది. - ఆదిత్య అగర్వాల్‌,

క్యూ2 ఫలితాలు: రెండురెట్లు పెరిగిన డా. రెడ్డీస్‌ లాభం

Friday 1st November 2019

డా. రెడ్డీస్‌ లేబోరేటరీష్‌, శుక్రవారం ప్రకటించిన సెప్టెంబర్‌ త్రైమాసిక ఫలితాలలో రూ. 1,092.5 కోట్ల ఏకీకృత నికర లాభాన్ని ప్రకటించింది. కాగా గతేడాది ఇదే త్రైమాసికంలో ఈ లాభం రూ. 503.80 కోట్లుగా ఉంది. సెప్టెంబర్‌ త్రైమాసికంలో కంపెనీ ఆదాయం రూ. 4,800.9 కోట్లుగా నమోదైంది. ఇది గతేడాది ఇదే త్రైమాసికంలో నమోదైన రూ. 3,797.8 కోట్ల కంటే 26.41 శాతం అధికం కావడం గమనార్హం. ఈ త్రైమాసికంలో కంపెనీ

Most from this category