News


షార్ట్‌టర్మ్‌కు డజన్‌ సిఫార్సులు

Monday 15th July 2019
Markets_main1563187034.png-27078

వచ్చే రెండు మూడు వారాలకు మంచి రాబడినిచ్చే 12 షేర్లను ప్రముఖ బ్రోకింగ్‌ సంస్థలు రికమండ్‌ చేస్తున్నాయి.
రిలయన్స్‌ సెక్యూరిటీస్‌ రికమండేషన్లు
1. కాడిలా హెల్త్‌కేర్‌: కొనొచ్చు. టార్గెట్‌ రూ. 255. స్టాప్‌లాస్‌ రూ. 215. కరెక‌్షన్‌ సైకిల్‌ పూర్తి చేసుకుంది. ఓవర్‌సోల్డ్‌ ఏరియాలో కదలాడుతూ అప్‌మూవ్‌కు రెడీగా ఉంది.
2. ఇండియా సిమెంట్స్‌: కొనొచ్చు. టార్గెట్‌ రూ. 108. స్టాప్‌లాస్‌ రూ. 89. వీక్లీ చార్టుల్లో డబుల్‌ బాటమ్‌ ఏర్పరిచింది. ప్రస్తుతం స్వల్పకాలిక డీఎంఏలకు పైన కదలాడుతోంది. ఇండికేటర్లు టర్నెరౌండ్‌ సంకేతాలు ఇస్తున్నాయి.
ఎపిక్‌ రిసెర్చ్‌ రికమండేషన్లు
1. యునైటెడ్‌ బ్రూవరీస్‌: కొనొచ్చు. టార్గెట్‌ రూ. 1520. స్టాప్‌లాస్‌ రూ. 1335. దీర్ఘకాలిక అప్‌ట్రెండ్‌లో భాగంగా వచ్చిన స్వల్పకాలిక కరెక‌్షన్‌ పూర్తి చేసింది. కీలక డీఎంఏల వద్ద బలమైన మద్దతు తీసుకుంది. 
2. మనుప్పురం ఫైనాన్స్‌: కొనొచ్చు. టార్గెట్‌ రూ. 150. స్టాప్‌లాస్‌ రూ. 120. చార్టుల్లో హయ్యర్‌ టాప్స్‌, బాటమ్స్‌ ఏర్పరుస్తోంది. ఇటీవలే బుల్లిష్‌ బ్రేకవుట్‌ సాధించింది. 
ఏంజల్‌ బ్రోకింగ్‌ రికమండేషన్లు
1. అపోలో హాస్పిటల్స్‌: కొనొచ్చు. టార్గెట్‌ రూ. 1490. స్టాప్‌లాస్‌ రూ. 1290. తాజా ర్యాలీ అనంతరం ఈ నెల్లో కన్సాలిడేషన్‌ చెందింది. ఇటీవలే అప్‌ట్రెండ్‌ కొనసాగింపును ఖరారు చేసే బ్రేకవుట్‌ చూపింది.
2. ఇంటలెక్ట్‌ డిజైన్‌ ఎరినా: కొనొచ్చు. టార్గెట్‌ రూ. 315. స్టాప్‌లాస్‌ రూ. 262. నెలరోజులుగా ఆల్‌టైమ్‌ హైకి అటుఇటుగా కన్సాలిడేట్‌ అవుతోంది. తాజాగా గత గరిష్ఠాన్ని దాటి అప్‌మూవ్‌ సంకేతాలు ఇచ్చింది.
ఛాయిస్‌ బ్రోకింగ్‌ రికమండేషన్లు
1. సెంచరీ టెక్స్‌టైల్స్‌: కొనొచ్చు. టార్గెట్‌ రూ. 980. స్టాప్‌లాస్‌ రూ. 890. చార్టుల్లో బుల్లిష్‌ హరామీ ప్యాట్రన్‌ ఏర్పరిచి బుల్లిష్‌ రివర్సల్‌ చూపుతోంది. ఆర్‌ఎస్‌ఐలో పాజిటివ్‌ క్రాసోవర్‌ ఏర్పడింది.
2. బయోకాన్‌: కొనొచ్చు. టార్గెట్‌ రూ. 272. స్టాప్‌లాస్‌ రూ. 244. ఫాలింగ్‌ వెడ్జ్‌ ఫార్మేషన్‌ నుంచి బుల్లిష్‌రివర్సల్‌ చూపే బ్రేకవుట్‌ సాధించింది. చార్టుల్లో మరబోజు క్యాండిల్‌స్టిక్‌ ఏర్పరచడం మరింత అప్‌మూవ్‌కు సంకేతం.
యస్‌ సెక్యూరిటీస్‌ రికమండేషన్లు
1. హెచ్‌సీఎల్‌టెక్‌: కొనొచ్చు. టార్గెట్‌ రూ. 1120. స్టాప్‌లాస్‌ రూ. 995. చార్టుల్లో ఏబీ=సీడీ కరెక‌్షన్‌ ప్యాట్రన్‌ పూర్తి చేసింది. ఇండికేటర్లు బుల్లిష్‌గా ఉన్నాయి.
2. భారత్‌ ఫోర్జ్‌: కొనొచ్చు. టార్గెట్‌ రూ. 510. స్టాప్‌లాస్‌ రూ. 437. రూ. 475కు పైన స్థిరంగా కదలాడితే బుల్లిష్‌ బ్రేకవుట్‌ సాధించినట్లవుతుంది. 
ప్రభుదాస్‌ లీలాధర్‌ రికమండేషన్లు
1. హీరోమోటోకార్‌‍్ప: కొనొచ్చు. టార్గెట్‌ రూ. 2800. స్టాప్‌లాస్‌ రూ. 2400. ఇటీవలి పతనంలో 2360 వద్ద బాటమ్‌ అవుటయింది. చార్టుల్లో ఆకర్షణీయంగా కనిపిస్తోంది.
2. సన్‌ఫార్మా: కొనొచ్చు. టార్గెట్‌ రూ. 445. స్టాప్‌లాస్‌ రూ. 380. డబుల్‌బాటమ్‌ స్థాయిల నుంచి బలమైన రికవరీ చూపింది. గత గరిష్టాన్ని దాటే యత్నాల్లో ఉంది. ఆర్‌ఎస్‌ఐ తదితర ఇండికేటర్లు అప్‌మూవ్‌కు సుముఖంగా ఉన్నాయి. 



You may be interested

మార్కెట్‌ను ఆదుకున్న ఇన్ఫీ

Monday 15th July 2019

7.50శాతం లాభపడిన ఇన్ఫోసిస్‌ షేర్లు 168 పాయింట్లు పెరిగిన సెన్సెక్స్‌ ఆరంభ లాభాల్ని కోల్పోయి కష్టాల పాలైన సూచీలను ఇన్ఫోసిస్‌ షేర్ల భారీ ర్యాలీ ఆదుకుంది. ఫలితంగా దేశీయ బెంచ్‌మార్క్‌ సూచీలైన సెన్సెక్స్ 168 పాయింట్లు పెరిగి 38,904.27 వద్ద, నిఫ్టీ 38.15 పాయింట్ల లాభంతో 11,590.65 ముగిసింది. క్యూ1 ఫలితాల జోష్‌తో నేడు ఐటీ రంగ దిగ్గజం ఇన్ఫోసిస్‌ షేర్లు 5శాతం లాభంతో ట్రేడింగ్‌ ప్రారంభించింది. ఇండెక్స్‌ల్లో అధిక వెయిటేజీ కలిగిన ఈ షేరు

ఐటీ సూచీ ముందుకు

Monday 15th July 2019

ఇన్ఫోసిస్‌ జూన్‌ త్రైమాసిక ఫలితాలను విడుదల చేశాక దీని షేరు విలువ గత రెండు సెషన్‌లో నుంచి పాజిటివ్‌గా ముగుస్తోంది. సోమవారం ట్రే డింగ్‌లో ఏకంగా 7.24 శాతం లాభపడి 779.40 వద్ద క్లోజయ్యింది. ఇన్ఫోసిస్‌ ప్రభావంతో నిఫ్టీ ఐటీ ఇండెక్స్‌ 2.85 శాతం లాభపడి 15,662.05 పాయింట్ల వద్ద ముగిసింది. నిఫ్టీ ఐటీ ఇండెక్స్‌లో   ఇన్ఫోసిస్‌ 7.24 శాతం, ఒఫెస్స్‌ 2.66శాతం,  టెక్‌ మహింద్రా 2.07 శాతం,

Most from this category