News


అనలిస్టుల నుంచి టాప్‌ 12 సిఫార్సులు

Monday 13th January 2020
Markets_main1578911636.png-30895

వచ్చే కొన్ని వారాల్లో మంచి రాబడులు అందించే సత్తా ఉన్న 12 స్టాకులను వివిధ అనలిస్టులు అందిస్తున్నారు. 
శ్రీకాంత్‌ చౌహాన్‌, కోటక్‌ సెక్యూరిటీస్‌.
1. హెచ్‌యూఎల్‌: కొనొచ్చు. టార్గెట్‌ రూ. 2060. స్టాప్‌లాస్‌ రూ. 1900. గతర్యాలీ అనంతర రిట్రేస్‌మెంట్‌ను విజయవంతంగా పూర్తి చేసింది. కీలక రిట్రేస్‌మెంట్‌ జోన్‌ నుంచి షేరు బలంగా రివర్సయింది. దీన్నిబట్టి షేరులో కరెక‌్షన్‌ ముగిసిందని భావించవచ్చు. వీక్లీ చార్టుల్లో బుల్లిష్‌ ఎంగల్ఫింగ్‌ ప్యాట్రన్‌ ఏర్పరచడం ద్వారా మరింత అప్‌మూవ్‌ సంకేతాలు ఇస్తోంది. 
2. బీఈఎంఎల్‌: కొనొచ్చు. టార్గెట్‌ రూ. 1040. స్టాప్‌లాస్‌ రూ. 945. దిగువ మద్దతు జోన్‌ నుంచి బలమైన వాల్యూంలతో పైకి ఎగిసింద. చార్టుల్లో త్రిభుజాకార ప్యాట్రన్‌ నుంచి బ్రేకవుట్‌కు రెడీగా కనిపిస్తోంది. ఏడీఎక్స్‌ ఇండికేటర్‌ బుల్లిష్‌గా ఉంది. 
మజార్‌ మహ్మద్‌, చార్ట్‌వ్యూ ఇండియా.
1. వేదాంత: కొనొచ్చు. టార్గెట్‌ రూ. 174. స్టాప్‌లాస్‌ రూ. 150. కీలక డీఎంఏలకు పైన క్లోజవడం ద్వారా బ్రేకవుట్‌ సాధనకు దగ్గరగా ఉన్నట్లు కనిపిస్తోంది. ఇటీవలి కాలంలోని నిరోధస్థాయిలను విజయవంతంగా దాటగలిగింది. రూ. 127 పైన మరింత బుల్లిష్‌గా మారుతుంది. 
2. గెయిల్‌: కొనొచ్చు. టార్గెట్‌ రూ. 137. స్టాప్‌లాస్‌ రూ. 120. రెండు వారాలుగా స్వల్పకాలిక అప్‌ట్రెండ్‌ ఆరంభించిన సూచనలిస్తోంది. చార్టుల్లో హయ్యర్‌హై, బాటమ్స్‌ ఏర్పరుస్తోంది. కీలక షార్ట్‌టర్మ్‌ డీఎంఏలకు పైన క్లోజవడం మరింత బలాన్నిస్తోంది. 
3. శోభ: కొనొచ్చు. టార్గెట్‌ రూ. 451. స్టాప్‌లాస్‌ రూ. 399. కొన్ని రోజులుగా రూ. 400 వద్ద బలమైన బేస్‌ ఏర్పరుచుకుంటోంది. ఇక్కడ నుంచి కదిలి రూ. 420 పైన బలంగా క్లోజయితే మరింత అప్‌మూవ్‌ ఉంటుంది.
వికాస్‌ జైన్‌, రిలయన్స్‌ సెక్యూరిటీస్‌.
1. హెచ్‌పీసీఎల్‌: కొనొచ్చు. టార్గెట్‌ రూ. 285. స్టాప్‌లాస్‌ రూ. 238. రెండు త్రైమాసికాలుగా కొనసాగిస్తున్న కరెక‌్షన్‌ను ముగించింది. కొన్ని రోజులుగా బలమైన వాల్యూంలతో ట్రేడవుతోంది. త్వరలో మరింత అప్‌మూవ్‌ ఉండొచ్చని అంచనా.
2. మారికో: కొనొచ్చు. టార్గెట్‌ రూ. 365. స్టాప్‌లాస్‌ రూ. 322. గత పతనం తర్వాత రూ. 330 కింద డబుల్‌బాటమ్‌ ఏర్పరిచింది. ఆర్‌ఎస్‌ఐలో పాజిటివ్‌ క్రాసోవర్‌ ఏర్పడడం తదుపరి అప్‌ట్రెండ్‌కు సంకేతం.
సంతోశ్‌మీనా, ట్రేడింగ్‌ బుల్స్‌
1. అల్ట్రాటెక్‌: కొనొచ్చు. టార్గెట్‌ రూ. 4900. స్టాప్‌లాస్‌ రూ. 4270. బడ్జెట్‌ ముందు ఇన్‌ఫ్రా, సిమెంట్‌స్టాకులు బలం చూపుతున్నాయి. టెక్నికల్‌గా ఇటీవలే సౌష్టవాకార త్రిభుజాకృతి నుంచి బ్రేకవుట్‌ సాధించింది. కీలక డీఎంఏలకు పైన కదలాడుతూ బుల్లిష్‌గా ఉంది.
2. డాబర్‌: కొనొచ్చు. టార్గెట్‌ రూ. 500. స్టాప్‌లాస్‌ రూ. 457. బడ్జెట్‌ ముందు రూరల్‌ ఎకానమీ ఆధారిత స్టాకులు అప్‌మూవ్‌లో ఉంటాయి. డాబర్‌ సైతం ప్రస్తుతం ఇదే స్థితిలో ఉంది. టెక్నికల్స్‌ పరంగా ఇటీవలే బుల్లిష్‌ పెన్నాంట్‌ ప్యాట్రన్‌ నుంచి బ్రేకవుట్‌ సాధించింది.
సుభాశ్‌ గంగాధరన్‌, హెచ్‌డీఎఫ్‌సీ సెక్యూరిటీస్‌.
1. ఐఆర్‌బీ ఇన్‌ఫ్రా: కొనొచ్చు. టార్గెట్‌ రూ. 105. స్టాప్‌లాస్‌ రూ. 72.50. గత అక్టోబర్‌లో కనిష్ఠాలు చూసిన అనంతరం తిరిగి అప్‌మూవ్‌ బాట పట్టింది. రెండు వారాలుగా 70-80 రూపాయల మధ్య కదలాడి కన్సాలిడేషన్‌ చూపింది. శుక్రవారం ఈ రేంజ్‌ నుంచి భారీ వాల్యూంలతో బ్రేకవుట్‌ సాధించింది. 
రాజేశ్‌ భోంస్లే, ఏంజిల్‌ బ్రోకింగ్‌.
1. ఫినోలెక్స్‌: కొనొచ్చు. టార్గెట్‌ రూ. 640. స్టాప్‌లాస్‌ రూ. 536. నెల రోజుల కన్సాలిడేషన్‌ తర్వాత అప్‌సైడ్‌ బ్రేకవుట్‌ సాధించింది. రెండు రోజులుగా బుల్లిష్‌గ్యాప్‌ అప్‌మూవ్‌ చూపుతోంది. వాల్యూంలు బలంగా ఉన్నాయి. ఆర్‌ఎస్‌ఐ పాజిటివ్‌గా మారింది. 
జైధాకర్‌, ఆనంద్‌ రాఠీ.
1. టాటా పవర్‌: కొనొచ్చు. టార్గెట్‌ రూ. 63. స్టాప్‌లాస్‌ రూ. 56. ఇన్వర్స్‌ హెడ్‌ అండ్‌ షోల్డర్‌ ప్యాట్రన్‌ నుంచి బ్రేకవుట్‌ చూపింది. బ్రేకవుట్‌తో వేవ్‌ థియరీలోని మరో బుల్‌వేవ్‌లోకి ప్రవేశించినట్లయింది. 

పైవన్నీ నిపుణుల సిఫార్సులు. పెట్టుబడులకు ముందు సొంత అధ్యయనం తప్పనిసరి. 



You may be interested

యస్‌బ్యాంక్‌ షేర్లను కొన్న ఐసీఐసీఐ ప్రుడెన్షియల్‌

Monday 13th January 2020

దేశీయ రెండో అతిపెద్ద అసెట్‌మేనేజ్‌మెంట్‌ కంపెనీ ఐసీఐసీఐ ప్రుడెన్షియల్‌ యస్‌బ్యాంక్‌ బ్యాంకు షేర్లను కొనుగోలు చేసింది. యస్‌బ్యాంక్‌కు చెందిన 10.57లక్షల ఈక్విటీ షేర్లను డిసెంబర్‌ త్రైమాసికంలో కొనుగోలు చేసినట్లు గణాంకాలు చెబుతున్నాయి. డిసెంబర్‌ క్వార్టర్‌లో ఇంధన, ఫార్మా, స్టాఫింగ్‌, ప్రైవేట్‌, ప్రభుత్వ బ్యాంకు షేర్ల కొనుగోలుకు ఆసక్తి చూపింది. టెలికాం, అటో, ఐటీ రంగాలకు చెందిన షేర్లను విక్రయించింది. మొత్తంగా ఆయారంగాలకు చెందిన సుమారు 350 కంపెనీల్లో వాటాలు పెంచుకోగా, 145

సెన్సెక్స్‌, నిఫ్టీ రికార్డు ముగింపు

Monday 13th January 2020

ఇంట్రాడేలో 41,900 సమీపానికి సెన్సెక్స్‌ 12,338 వద్ద నిఫ్టీ ఇంట్రాడే గరిష్టం ఎన్‌ఎస్‌ఈలో అన్ని రంగాలూ ప్లస్‌లోనే ప్రపంచవ్యాప్తంగా ఆందోళనలు ఉపశమించడంతోపాటు.. అమెరికా, చైనా మధ్య వాణిజ్య ఒప్పందం కుదరనున్న అంచనాలు దేశీ స్టాక్‌ మార్కెట్లకు జోష్‌నిస్తున్నాయి. దీంతో ట్రేడింగ్‌ ప్రారంభం‍ నుంచీ ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు ఎగబడటంతో తొలి సెషన్‌లోనే అటు నిఫ్టీ, ఇటు సెన్సెక్స్‌ చరిత్రాత్మక గరిష్టాలను అందుకున్నాయి. తొలుత 41,900 సమీపానికి చేరడం ద్వారా సెన్సెక్స్‌, 12,338కు చేరడం ద్వారా నిఫ్టీ

Most from this category