News


మూడు వారాల్లో రాబడినిచ్చే 12 షేర్లు

Monday 16th September 2019
Markets_main1568628081.png-28404

  చమురు ధరలు భారీగా పెరగడంతో దేశియ ఈక్విటీ మార్కెట్‌లు సోమవారం ట్రేడింగ్‌లో నష్టాల్లో ట్రేడవుతున్నాయి. ఉదయం 10.00 సమయానికి సెన్సెక్స్‌ 250 పాయింట్ల మేర కోల్పోగా, నిఫ్టీ కీలక స్థాయియైన 11,000 కిందకి పడిపోయింది. ‘చమురు, రూపీ-డాలర్‌లలో ఏర్పడే మార్పులు దేశియ మార్కెట్లను తీవ్రంగా ప్రభావం చూపుతాయి. చమురు, డాలర్‌ మారకంలో రూపీ సెషన్‌ ప్రారంభంలో పెరగడంతో దేశియ మార్కెట్లు భారీగా నష్టపోతున్నాయి’ అని రిలయన్స్‌ సెక్యురిటీస్‌ తెలిపింది. ఒకవేళ నిఫ్టీ 10,950 స్థాయి కంటే దిగువకు పడిపోతే మార్కెట్లో తీవ్ర అమ్మకాల ఒత్తిడి నెలకొంటుందని వివరించింది. కానీ నిఫ్టీ రోజు వారి, వారపు చార్టుల ప్రకారం 11,200 స్థాయిని స్వల్ప కాలంలో చేరుకుంటామని సీనియర్ వైస్ ప్రెసిడెంట్, ఈక్విటీ టెక్నికల్ రీసెర్చ్, కోటక్ సెక్యూరిటీస్, శ్రీకాంత్ చౌహాన్ అన్నారు. 

వివిధ రకాల బ్రోరేజిల సిఫార్సులు ఆధారంగా వచ్చే 11-21 సెషన్‌లలో మంచి రిటర్న్‌లను ఇవ్వగలిగే 12 స్టాకులు: 
విశ్లేషకులు: రాజేష్ భోస్లే, టెక్నికల్ అనలిస్ట్, ఏంజెల్ బ్రోకింగ్
బజాజ్ ఫైనాన్స్:  కొనచ్చు; టార్గెట్ ధర: రూ .3,620; స్టాప్‌ లాస్‌: రూ .3,340
ఈ స్టాక్, వీక్లీ చార్టులో ‘హయ్యర్‌ టాప్-హయ్యర్ బాటమ్’ నిర్మాణంతో ముందుకు కదులుతోంది. రోజువారీ చార్టులో, ప్రస్తుతం ఈ స్టాక్  ‘డిసెండింగ్‌ ట్రయాంగిల్’ బ్రేక్‌అవుట్‌ను నిర్దారిస్తోంది. ఇది అప్‌ట్రెండ్ కొనసాగింపునకు సూచీక. అంతేకాకుండా ఈ స్టాకు ధర 20 రోజుల మూవింగ్‌ యావరేజ్‌(డీఎంఏ), 50 డీఎంఏ, 200 డీఎంఏ కంటే అధికంగా ట్రేడవుతోంది. ఫలితంగా ఈ స్టాకు బుల్లిష్‌ కౌంటర్‌లో ఉందని తెలుస్తోంది. దీనీతో పాటు మొమెంటం ఓసిలేటర్ ఆర్‌ఎస్‌ఐ(రిలేటివ్‌ స్ట్రెంథ్‌ ఇండెక్స్‌)లో పాజిటివ్‌ జోన్‌లో ఉండడం కూడా ‘బై’ కాల్‌కు మధ్దతుగా ఉంది.
ఫెడరల్‌ బ్యాంక్‌: కొనచ్చు; టార్గెట్‌ ధర: రూ. 96; స్టాప్‌ లాస్‌: రూ. 83
ఫెడరల్‌ బ్యాంక్‌ తన 200డబ్యూఎంఏ(వేష్‌ అండ్‌ మీన్స్‌ అడ్వాన్స్‌), గత సెషన్‌ కనిష్ఠ స్థాయయిన రూ. 80 వద్ద ఆధారాన్ని ఏర్పాటు చేసుకుంది. అంతేకాకుండా ఈ స్టాకు తన రోజువారి చార్టులో డబుల్‌ బాటమ్‌ను బ్రేక్‌ఔట్‌ చేసింది. ఆర్‌ఎస్‌ఐలో 50 మార్కును దాటి పాజిటివ్‌ జోన్‌లోకి వచ్చింది. వీటితోపాటు ఈ స్టాకు ధర  నిరోదక స్థాయయిన 20 డీఎంఏపైన ముగిసింది. 

సాంకేతిక విశ్లేషకులు, హెచ్‌డీఎఫ్‌సీ సెక్యురిటీస్‌, వినయ్‌ రాజని
మహింద్రా అండ్‌ మహింద్రా: కొనచ్చు; టార్గెట్‌ ధర: రూ. 590; స్టాప్‌ లాస్‌: రూ. 525
మహింద్రా అండ్‌ మహింద్రా షేరు అగష్టుతో ముగిసిన నెలవారి చార్టులో ‘బుల్లిష్‌ హేమర్‌’ నమూనాను ఏర్పరిచింది. ఇది, మధ్యస్థ కాలంలో ఈ స్టాకులో బుల్లిష్‌ రివర్సల్‌ ఉంటుందనే విషయాన్ని తెలుపుతోంది. అంతేకాకుండా ఈ స్టాకు తాజా కనిష్ఠమయిన రూ. 502 స్థాయి, 2015, 2016 లో ఏర్పాటు చేసిన కనిష్ఠ స్థాయి కూడా కావడం గమనార్హం. మహింద్రా అండ్‌ మహింద్రా తన ఆల్‌ టైం గరిష్ఠం నుంచి దిద్దుబాటుకు గురవ్వడంతో పాటు, ఓవర్‌సోల్డ్‌ జోన్‌ నుంచి బయటపడింది. ఈ స్టాకుకు సంబం‍ధించి ఇండికేటర్లు, ఆసిలేటర్లు రోజువారి చార్టులో బుల్లిష్‌గా మారడం గమనార్హం.
 ఫినోలెక్స్‌ ఇండస్ట్రీస్‌: కొనచ్చు; టార్గెట్‌ ధర: రూ. 570; స్టాప్‌ లాస్‌: రూ. 500
ఈ స్టాక్‌ గత పది వారాల ధర ఏకికరణ స్థాయిని బ్రేక్‌ఔట్‌ చేసింది. అంతేకాకుండా వారాల కనిష్ఠ స్థాయిలను కలిపిన డౌన్‌వార్డ్‌ ట్రెండ్‌ లైన్‌ను బ్రేక్‌ ఔట్‌ చేయడం గమనార్హం. గత మూడు సెషన్‌ల నుంచి ఈ స్టాకు వాల్యుమ్‌లు పెరిగాయి. అంతేకాకుండా మూవింగ్‌ యావరేజ్‌, ఆసిలేటర్‌ రోజువారి, వారపు చార్టులలో బుల్లిష్‌ను ఏర్పాటుచేసింది. 

టేక్నికల్‌ రీసెర్చ్‌ అండ్‌ ట్రేడింగ్‌ అడ్వజరీ, చీఫ్‌ స్ట్రాటజిస్ట్‌, మజ్హర్‌ మహమ్మద్‌
గోద్రేజ్‌ ప్రాపర్టీస్‌: కొనచ్చు; టార్గెట్‌ ధర: రూ. 1,069; స్టాప్‌ లాస్‌: రూ. 900
ఈ స్టాక్‌ గత రెండుమూడు వారాల నుంచి రూ. 870- రూ. 925 పరిధిలో కదలాడింది. తాజాగా  ఈ స్టాక్‌ కొత్త బ్రేక్‌ఔట్‌ను నమోదు చేసింది. ఫలితంగా తాజాగా ఏర్పడిన కనిష్ఠ స్థాయి రూ. 875 నుం‍చి అప్‌మూవ్‌ ఉండే అవకాశం ఉంది. అంతేకాకుండా ఈ అప్‌ మూవ్‌ కొనసాగితే ఈ స్టాక్‌ రూ. 1,069 స్థాయిని చేరుకోవచ్చు. కానీ పొజిషన్లను తీసుకోవాలనుకునే ఇన్వెస్టర్లు రెండు విధాలుగా ముందుకు వెళ్లడం మంచిది. మొదట ప్రస్తుత స్థాయిల వద్ద ఈ స్టాకును కొనుగోలు చేసుకోవాలి. తర్వాత పరిస్థితులను గమనించి రూ. 925 వద్ద ఈ స్టాకులను మరికొన్ని కలుపుకోవాలి. 
హెచ్‌సీఎల్‌ టెక్నాలజీస్‌: కొనచ్చు; టార్గెట్‌ ధర: రూ. 1,113;  స్టాప్‌ లాస్‌: రూ. 1,047 
ఈ కౌంటర్ దాని 200-రోజుల ఎక్స్‌పోనెన్షియల్ మూవింగ్‌ యావరేజ్‌ వద్ద, తాజా కనిష్ట స్థాయి రూ. 1,048 వద్ద పరీక్షను ఎదుర్కొంది. కానీ శుక్రవారం బుల్లిష్ క్యాండిల్‌లో సమీప కాలానికి గాను ట్రెండ్‌ రివర్సల్‌  పురోగతిలో ఉన్నట్లు తెలుస్తోంది.

ఆనంద్‌ రాఠి షేర్స్‌ అండ్‌ స్టాక్‌ బ్రోకర్స్‌, సీఎంటీ అసిస్టెంట్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ ఈక్విటీ రిసెర్చ్‌, జయ్‌ ఆనంద్‌ థక్కర్‌
టీవీఎస్‌ మోటర్స్‌: కొనచ్చు; టార్గెట్‌ ధర: రూ. 410; స్టాప్‌ లాస్‌: రూ. 380
ఈ స్టాక్‌ రోజువారి చార్టులో హయ్యర్‌ టాప్స్‌-హయ్యర్‌ బోటమ్స్‌ నమూనాను ఏర్పరిచింది. అంతేకాకుండా స్వల్పకాలానికి గాను కదిలే ఇండికేటర్‌ ఓవర్‌ సోల్డ్‌ నుంచి రివర్స్‌ అవ్వడం స్పష్టంగా ఉంది. ఈ స్టాకు తన గత కనిష్టం నుంచి 38.20 శాతం పుంజుకునే అవకాశం ఉంది. ఈ స్టాకును కొనుగోలు చేయాలనుకునే ఇన్వెస్ట్‌ర్లు రూ. 380 స్టాప్‌ లాస్‌తో రూ. 410-430 టార్గెట్‌ కోసం ప్రయత్నించడం మంచిది.
అరబిందో ఫార్మా: కొనచ్చు; టార్గెట్‌ ధర: రూ. 660-675; స్టాప్‌ లాస్‌: రూ. 610
ఈ స్టాకు రోజు వారి చార్టులో ఇన్వర్స్‌ హెడ్‌ అండ్‌ సోల్డర్‌ నమూనాను స్పష్టంగా బ్రేక్‌ఔట్‌ చేసింది. ఇది బుల్లిష్‌ రివర్సల్‌ నమూనా. ఈ స్టాకు రోజువారి, వారపు ముమెంటం​ఇండికేటర్‌ ఎంఏసీడీ(మూవింగ్‌ యావరేజ్‌ కన్వర్జన్సీ, డైవర్జెన్సీ) ‘బై’ సంకేతాలను ఇవ్వడం గమనార్హం. 

రిలయన్స్‌ సెక్యురిటీస్‌, సినియర్‌ రీసెర్చ్‌ ఎనలిస్ట్‌, వికాస్‌ జైన్‌: 
బాలక్రిష్ణా ఇండస్ట్రీస్‌: కొనచ్చు; టార్గెట్‌ ధర: రూ. 840; స్టాప్‌ లాస్‌: రూ. 710
ఈ స్టాక్‌ రూ. 700 స్థాయి వద్ద డబుల్‌ బాటమ్‌ చేసింది. అంతేకాకుండా ఈ స్టాక్‌ పాజిటివ్‌గా కదలడంతో పాటు మొత్తం ఈ సెక్టార్‌ అంతా పాజిటివ్‌గా ఉండడం గమనార్హం. ఆర్‌ఎస్‌ఐలో ఈ స్టాక్‌ బుల్లీష్‌ సంకేతాలను ఇస్తోంది. కానీ 200 రోజుల సగటు వద్ద ఈ స్టాక్‌ పరీక్షను ఎదుర్కొనే అవకాశం ఉంది. లాంగ్‌పొజిషన్‌లను తీసుకోవాలనుకునే వారు స్టాప్‌ లాస్‌ను రూ. 710 వద్ద పెట్టుకొని, రూ. 840 టార్గెట్‌ ధర కొసం ప్రయత్నించవచ్చు.
స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా: కొనచ్చు; టార్గెట్‌ ధర: రూ. 320; స్టాప్‌ లాస్‌: రూ. 261
స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా(ఎస్‌బీఐ) స్టాకు గరిష్ఠ స్థాయి రూ. 373 వద్ద అమ్మకాల ఒత్తిడికి గురయ్యింది. ప్రస్తుతం కనిష్ఠ స్థాయి రూ. 265 స్థాయి నుంచి గత కొన్ని వారాలలో అప్‌మూవ్‌ చేసింది. వారపు చార్టులో హయ్యర్‌ బాటమ్స్‌, 200 వారాల సగటు ఈ స్టాకుల బలమైన మద్ధతు స్థాయిగా పనిచేస్తున్నాయి. దీంతోపాటు ఎస్‌బీఐ షేరు తన 20 రోజుల సగటును దాటడంతో అప్‌ట్రెండ్‌ ఉందని తెలుస్తోంది.

ఏవీపీ డెరివేటివ్స్‌ అండ్‌ టెక్నికల్స్‌, ఎల్‌కేపీ సెక్యురిటీస్‌, గౌరవ్‌ బిస్సా:
టీసీఎస్‌: కొనచ్చు; టార్గెట్‌ ధర: రూ. 2,250; స్టాప్‌ లాస్‌: రూ. 2,075
ఈ స్టాక్‌ పాజిటివ్‌గా కదిలిన తర్వాత బాగా దిద్దుబాటుకు గురయ్యింది. అంతేకాకుండా టీసీఎస్‌ ట్రెండ్‌లైన్‌ సపోర్ట్‌ వద్ద మధ్దతు తీసుకొని​ తిరిగి బౌన్స్‌ అయ్యింది. ఈ స్టాక్‌ హర్మోనిక్‌ ఆల్ట్‌సార్క్‌ నమూనాను ఏర్పరిచింది. ఇది సహజంగా రివర్సల్‌ నమూనాను తెలియజేస్తుంది. ఈ స్టాకు వచ్చే రెండుమూడు సెషన్‌లలో పుంజుకునే అవకాశం ఉంది.
సీఈఎస్‌సీ(కలకత్తా ఎలక్ట్రిక్‌ పవర్‌ కార్పోరేషన్‌): కొనచ్చు; టార్గెట్‌ ధర: రూ. 900-925; స్టాప్‌లాస్‌: రూ. 775
ఈ స్టాక్‌ వారపు చార్టులో డబుల్‌ బాటమ్‌, రేంజ్‌ బ్రేక్‌ఔట్‌ను ఏర్పరిచింది. అంతేకాకుండా ఈ స్టాకు వాల్యుమ్‌ పెరుగుతుండడం గమనార్హం. జపనీస్‌ క్యాండిల్‌స్టిక్‌ చార్ట్‌ ఇచిమోకు ప్రకారం (ఇచిమోకు ఒక సాంకేతిక విశ్లేషణ పద్ధతి) ఈ స్టాకు లాగింగ్‌ స్పాన్‌(చికో స్పాన్‌) తగ్గడంతో పాటు, కన్వర్సన్‌ లైన్‌(టెన్‌కన్‌), బేస్‌ లైన్‌(కిజున్‌) అధిక వాలుతో ఉన్నాయి. దీని ప్రకారం ఈ స్టాకు తొందరలో పుంజుకునే అవకాశం ఉంది. అంతేకాకుండా ఈ విశ్లేషణ ప్రకారం ఈ స్టాకు క్లౌడ్స్‌కి పైన ట్రేడవుతోంది. స్టాకు ఎప్పుడు తగ్గిన కొనుగోలు చేయడం మంచిది.You may be interested

చమురు మంటతో భారత్‌కు అనర్థమే..!

Wednesday 18th September 2019

నోమురా హెచ్చరిక ‘మాంద్యం’ తరహా పరిస్థితికి దారితీస్తుందని విశ్లేషణ న్యూఢిల్లీ: అంతర్జాతీయంగా చమురు ధరల తీవ్రత భారత్‌ వంటి అభివృద్ధి చెందుతున్న దేశాల ఆర్థిక వ్యసస్థలపై తీవ్ర ప్రతికూల ప్రభావం చూపడం ఖాయమని జపాన్‌ ఫైనాన్షియల్‌ సేవల దిగ్గజ సంస్థ నోమురా విశ్లేషించింది. బలహీన వినియోగ డిమాండ్‌, అధిక చమురు ధరలు భారత్‌ వంటి ఆర్థిక వ్యవస్థలో మాంద్యం తరహా పరిస్థితి (స్టాగ్‌ఫ్లేషన్‌)కి దారితీస్తాయని పేర్కొంది. తన మొత్తంచమురు అవసరాల్లో 70 శాతానికిపైగా దిగుమతులపై

ఈక్విటాస్‌ హోల్డింగ్స్‌కు సెబీ షాక్‌...!

Monday 16th September 2019

స్మాల్‌ ఫైనాన్స్‌ బ్యాంక్‌ను స్టాక్ ఎక్స్ఛేంజీలలో లిస్టింగ్‌ చేసేందుకు కొత్తగా ప్రాస్పెక్టస్‌ను దాఖలు చేయమంటూ ఈక్విటాస్‌ హోల్డింగ్స్‌ను సెబీ ఆదేశించడంతో ఈ కంపెనీ షేర్లు సోమవారం 17.50శాతం నష్టపోయాయి. నేడు ఈ కంపెనీ షేర్లు రూ.109.50 వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించాయి. ఈక్విటాస్‌ హోల్డింగ్స్‌కు చెందిన స్మాల్‌ ఫైనాన్స్‌ బ్యాంక్‌ను స్టాక్ ఎక్స్ఛేంజీలలో లిస్టింగ్‌ చేసేందుకు అనుమతించమంటూ కంపెనీ ముసాయిదా ప్రాస్పెక్టస్‌ సమర్పించింది. నిబంధనలు విరుద్ధంగా ఉన్న కారణంగా సెబీ ఈక్విటాస్‌

Most from this category