News


ఈ స్మాల్‌క్యాప్స్‌ మార్కెట్‌ ఊగిసలాటకు అతీతమా!

Friday 17th May 2019
Markets_main1558032192.png-25783

ఏడాదికిపైగా మిడ్‌క్యాప్‌, స్మాల్‌క్యాప్‌ స్టాక్స్‌లో అమ్మకాల ఒత్తిడి చూస్తూనే ఉన్నాం. ఈ విభాగంలో గత ఏడాది కాలంలో స్టాక్స్‌లో పెట్టుబడులపై లాభాల్లేని పరిస్థితి. ఏవో కొన్ని స్టాక్స్‌ మినహా అన్నీ నష్టాలే మిగిల్చాయి. అయితే, ఓ 12 స్మాల్‌క్యాప్‌ స్టాక్స్‌ మాత్రం మార్కెట్‌ అస్థిరతలతో తమకేం సంబంధం లేనట్టుగా, ఈ ఏడాది ఆరంభం నుంచి ప్రతీ నెలా ఎంతో కొంత లాభాలనే ఇస్తూ వస్తున్నాయి. మరి ఈ కంపెనీల్లో నిజంగానే సత్తా ఉందా..? ఇన్వెస్టర్లు తాము పెట్టుబడి పెట్టే ముందు తప్పకుండా వేసుకోవాల్సిన ప్రశ్న ఇది. 

 

డీసీబీ బ్యాంకు, ఎస్‌ఆర్‌ఎఫ్‌, ఇండోరమా సింథటిక్స్‌, ఎస్సార్‌ (ఇండియా) లిమిటెడ్‌, షాయోంగ్‌ మల్టీబేస్‌, జంప్‌ నెట్‌వర్క్స్‌, ప్రభాత్‌ టెక్నాలజీస్‌, కవిట్‌ ఇండస్ట్రీస్‌, ఫ్రీడం ఫార్మాస్యూటికల్స్‌, ఆర్‌ఏసీఎల్‌ గేర్‌టెక్‌, రెఫెక్స్‌ ఇండస్ట్రీస్‌, లీడింగ్‌ లీజింగ్‌ ఫైనాన్స్‌ అండ్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ ఉన్నాయి. ఈ కంపెనీలన్నీ కూడా 2019 జనవరి నుంచి మే మాసంలో ఇప్పటి వరకూ నికరంగా నెలవారీగా లాభాల్లోనే ట్రేడవుతున్నాయి. ఎస్‌ఆర్‌ఎఫ్‌ ఇటీవలే తన ఇంజనీరింగ్‌ ప్లాస్టిక్స్‌ వ్యాపారాన్ని రూ.320 కోట్లకు డీఎస్‌ఎంకు విక్రయించాలని నిర్ణయించిన విషయం గమనార్హం. ఈ కంపెనీ వార్షిక టర్నోవర్‌ రూ.5,600 కోట్లు. దేశవ్యాప్తంగా 12 తయారీ ప్లాంట్లు ఉన్నాయి. అలాగే థాయిలాండ్‌లో 2, దక్షిణాఫ్రికాలోనూ ఒక ప్లాంట్‌ ఉంది. ఈ స్టాక్‌ 0.5 శాతం నుంచి 15 శాతం మధ్య గత నాలుగు నెలల్లో పెరిగింది. ఈ స్టాక్‌ 10-12 శాతం పెరిగే అవకావం ఉందంటూ షేర్‌ఖాన్‌ సానుకూల రేటింగ్‌ ఇచ్చింది. ఇక ప్రైవేటు రంగ డీసీబీ బ్యాంకు వచ్చే మూడు నాలుగేళ్లలో బ్యాలన్స్‌ షీటును రెట్టింపు చేసుకోవాలన్న లక్ష్యంతో ఉంది. చిన్న, మధ్య స్థాయి సంస్థలు, రిటైల్‌, అగ్రి, చిన్న సైజు రుణాల్లో ఏటా 20 శాతం వృద్ధి నమోదు చేసినా ఈ లక్ష్యాన్ని సాధిస్తామని డీసీబీ బ్యాంకు ఎండీ, సీఈవో మురళీ ఎం నటరాజన్‌ పేర్కొన్నారు. ఈ ఏడాది మార్చి నాటికి డీసీబీ బ్యాంకు బ్యాలన్స్‌ షీటు రూ.35,791 కోట్లుగా ఉంది. ఈ బ్యాంకు రుణ పోర్ట్‌ఫోలియో (ప్రాపర్టీపై లోన్లు) పట్ల తాము ఆందోళనగా ఉన్నట్టు ఎంకే గ్లోబల్‌ ఇటీవలే పేర్కొంది. ఈ స్టాక్‌కు సెల్‌ రేటింగ్‌తో,  12 నెలల టార్గెట్‌ రూ.170గా ఇచ్చింది. హెచ్‌డీఎఫ్‌సీ సెక్యూరిటీస్‌ మాత్రం రూ.228 టార్గెట్‌తో బై రేటింగ్‌ ఇచ్చింది. వేగంగా వృద్ధి సాధించగలదన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది.

 

ఇండోరమా సింథటిక్స్‌ మార్చి క్వార్టర్‌కు రూ.169 కోట్ల నష్టాన్నిచ్చింది. అంతకుముందు ఆర్థిక సంవత్సరం ఇదే కాలంలో ఉన్న రూ.30 కోట్ల నష్టంతో పోలిస్తే ఐదు రెట్లు పెరిగింది. అయినప్పటికీ ఈ స్టాక్‌ ఈ నెలలో ఇప్పటి వరకు ఒకటిన్నర శాతం లాభపడింది. షాయోగ్‌ మల్టీబేస్‌ కంపెనీ ప్లాస్టిక్‌, కెమికల్స్‌ రా మెటీరియల్‌, పాలీమర్స్‌, పెట్రోకెమికల్స్‌ వ్యాపారంలో ఉన్న సంస్థ. ఈ నెలలో ఈ షేరు 4 శాతం పెరిగింది. ఈ ఏడాది జనవరి నుంచి ఏప్రిల్‌ వరకు ప్రతీ నెలా 25 శాతం చొప్పున ఈ స్టాక్‌ ఇన్వెస్టర్లకు లాభాలను పంచింది. ఈ ఏడాది ఇంత వరకు బీఎస్‌ఈ మిడ్‌క్యాప్‌ సూచీ 8.5 శాతం, స్మా్ల్‌క్యాప్‌ సూచీ 6.67 శాతం మేర నష్టపోయాయి. ‘‘మిడ్‌, స్మాల్‌క్యాప్‌ విభాగంలో కరెక్షన్‌ అన్నది విలువ పరంగా ఎక్కువగా ఉంది. గతేడాది నిఫ్టీ మిడ్‌క్యాప్‌ సూచీ నిఫ్టీ లార్జ్‌క్యాప్‌ సూచీతో పోలిస్తే విలువ పరంగా 30 శాతం అధికంగా ఉంది. ఇప్పుడు ఆ ప్రీమియం అంతా ఆవిరైపోయింది. మిడ్‌, స్మాల్‌క్యాప్‌ విభాగాల్లో ఎంతో విలువ నెలకొంది. పరిస్థితులు స్థిరపడితే ఈ విభాగంలో మరింత విలువ చూస్తాం’’ అని మ్యాక్స్‌ లైఫ్‌ ఇన్సూరెన్స్‌ డైరెక్టర్‌, సీఐవో మిహిర్‌వోరా తెలిపారు.You may be interested

నిఫ్టీ సగం స్టాక్స్‌ ప్రీమియం వ్యాల్యూషన్లలోనే...

Friday 17th May 2019

నిఫ్టీ ఆల్‌టైమ్‌ గరిష్ట స్థాయిల నుంచి చూస్తే ఐదు శాతం దిగువనే ఉన్నాయి. నిఫ్టీ-50లో కొన్ని స్టాక్స్‌ మాత్రం ఆల్‌టైమ్‌ గరిష్ట స్థాయిలకు చేరిపోయాయి కూడా. ముఖ్యంగా 22 స్టాక్స్‌ విలువలు వాటి గత 10 ఏళ్ల సగటు పీఈతో పోలిస్తే అధికంగానే ట్రేడవుతున్నాయి. ఇక వోలటాలిటీ ఇండెక్స్‌ నాలుగేళ్ల గరిష్ట స్థాయికి చేరిపోయింది. మే 23న ఎన్నికల ఫలితాల నేపథ్యంలో ఇది మరింత పెరిగిపోతుందన్న అంచనా ఉంది. ఈ

అమ్మో.. ఆప్షన్స్‌!

Thursday 16th May 2019

భారీగా ఉన్న కాల్‌, పుట్‌ ధరలు అధిక ప్రీమియంతో ట్రేడవుతున్నఇండెక్స్‌ ఆప్షన్లు బాగా తగ్గిన ఆప్షన్‌ ఓపెన్‌ ఇంట్రెస్ట్‌ సాధారణంగా ఒక ఈవెంట్‌ జరిగే సమయంలో మార్కెట్లో వచ్చే తీవ్ర కదలికలు ఆప్షన్‌ ట్రేడర్లకు లాభాలనిస్తుంటాయి. అందుకే ఎఫ్‌అండ్‌ఓ ట్రేడ్‌ చేసేవారు పెద్ద ఈవెంట్‌ సమయంలో భారీ లాభాల కోసం ఆప్షన్స్‌ను ఎంచుకుంటారు. కానీ ఈ దఫా ఇలాంటి ట్రేడర్లకు పెద్దగా ప్రయోజనం ఉండేలా కనిపించడం లేదు. సాధారణంగా నెల మధ్యకు వచ్చే సరికి

Most from this category