News


స్థిరమైన రాబడులను ఆశిస్తు‍న్నారా..?

Saturday 25th January 2020
Markets_main1579891543.png-31180

మార్కెట్లో ఎప్పుడు, ఏ స్టాక్‌లో ఇన్వెస్ట్‌ చేస్తే రాబడులు తీసుకోవచ్చన్న సూక్ష్మం సాధారణంగా ఎక్కువ మంది రిటైల్‌ ఇన్వెస్టర్లకు తెలియదు. ఎందుకంటే రిటైల్‌ ఇన్వెస్టర్ల దృష్టి ఎక్కువ శాతం స్వల్పకాలంలో అధిక రాబడులను ఇచ్చే స్టాక్స్‌ ఏవి? అనే దానిపైనే ఉంటుంది. స్థిరమైన రాబడుల పట్ల వారు అంత ఆసక్తి చూపించరు. ఈ విధమైన ధోరణి ఎక్కువ సందర్భాల్లో వారు నష్టపోయేలా చేస్తోంది. వార్షికంగా సగటున డబుల్‌ డిజిట్‌ కాంపౌండెడ్‌ రాబడులను ఇస్తున్న 12 నిఫ్టీ ‍స్టాక్స్‌ను మోతీలాల్‌ ఓస్వాల్‌ ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌ సంస్థ ఓ నివేదిక రూపంలో తెలియజేసింది. అవి బజాజ్‌ ఫైనాన్స్‌, ఐచర్‌ మోటార్స్‌, బజాజ్‌ ఫిన్‌సర్వ్‌, ఏషియన్‌ పెయింట్స్‌, హెచ్‌యూఎల్‌, టీసీఎస్‌, యూపీఎల్‌, బ్రిటానియా ఇండస్ట్రీస్‌, టైటాన్‌ కంపెనీ, ఇండస్‌ఇండ్‌ బ్యాంకు, కోటక్‌ బ్యాంకు, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు.

 

‘‘స్థిరమైన రాబడులు కోరుకునే వారు, ఈ జాబితాలోని స్టాక్స్‌ను ప్రస్తుతమున్న అధిక ధరల్లోనూ కొనుగోలు చేసుకోవచ్చు. వీటిలో చాలా కంపెనీలు నాణ్యత, అధిక వృద్ధిని నమోదు చేస్తున్నవే. అందుకే అధిక ప్రీమియంతో ఉన్నాయి’’ అని నిపుణులు పేర్కొంటున్నారు. ‘‘ఇక్కడ పేర్కొన్న స్టాక్స్‌ అన్నీ కూడా అధిక ఆదాయ వృద్ధి కలిగిన కంపెనీలు. అంతేకాదు, సంపదను సృష్టిస్తున్నవి. గత రెండేళ్లలో వీటిల్లో చాలా స్టాక్స్‌ వ్యాల్యూషన్లు ఇటీవలి కాలంలో ఎన్నడూ లేనంత అధిక స్థాయికి చేరాయి. ఒకవేళ 2020లోనూ ఆర్థిక వ్యవస్థ పుంజుకోకపోతే, అధిక వ్యాల్యూషన్లలో ఉన్నప్పటికీ ఈ స్టాక్స్‌ మంచి పనితీరు చూపిస్తాయి. వీటిల్లో అధిక వ్యాల్యూషన్లలో లేనివి 2020కి సురక్షిత స్టాక్స్‌’’ అని కోటక్‌ సెక్యూరిటీస్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ రస్మిక్‌ఓజా తెలిపారు.

 

పోర్ట్‌ఫోలియోలో వైవిధ్యానికి తప్పకుండా చోటు కల్పించాలని, అప్పుడే భిన్న రకాల రిస్క్‌ల నుంచి రక్షణ ఉంటుందని నిపుణుల సూచన. ‘‘2020లో వినియోగం, ఇన్‌ఫ్రా స్టాక్స్‌ మంచి పనితీరు చూపిస్తాయని అంచనా వేస్తున్నాం. ఐటీ స్టాక్స్‌ కూడా మంచి రాబడులు ఇస్తాయి. టీ20 పోర్ట్‌ఫోలియో అన్నది ఎఫ్‌ఎంసీజీ, ఐటీ, సిమెంట్‌ స్టాక్స్‌ మిశ్రమంగా ఉండాలి. ఇన్వెస్టర్లు కనీసం 60 శాతం పెట్టుబడులను లార్జ్‌క్యాప్‌నకు, మిగిలిన 40 శాశాతాన్ని మిడ్‌, స్మాల్‌క్యాప్‌నకు కేటాయించుకోవాలి’’ అని క్యాపిటల్‌ వయా గ్లోబల్‌ రీసెర్చ్‌ సంస్థ పరిశోధన విభాగం హెడ్‌ గౌరవ్‌గార్గ్‌ సూచించారు.

 

‘‘పోర్ట్‌ఫోలియోలో 65-70 శాతం సురక్షిత స్టాక్స్‌ ఉండాలి. మిగిలిన 20-25 శాతం స్టాక్స్‌ అధిక బీటాతో కూడిన మిడ్‌, స్మాల్‌ క్యాప్‌ కంపెనీలు ఉండాలి. అదనంగా 5-10 శాతాన్ని బంగారంలో ఇన్వెస్ట్‌ చేసుకోవాలి. ఇది ద్రవ్యోల్బణం మించి రాబడులను ఇస్తుంది’’ అని శామ్కో సెక్యూరిటీస్‌ అనలిస్ట్‌ నిరాలిషా సూచించారు. ఎంచుకునే కంపెనీ దీర్ఘకాలం పాటు కొనసాగుతుందా? వ్యాపారంలో స్థిరత్వం ఎలా ఉంటుంది, సమర్థవంతమైన ప్రణాళికలు, మూలధన విస్తరణ ప్రణాళికలను కూడా చూసిన తర్వాత కంపెనీలను ఎంచుకోవాలని ఆమె సూచించారు.You may be interested

బీమాకు మరింత ధీమానివ్వాలి

Saturday 25th January 2020

టర్మ్, హెల్త్‌ పాలసీలపై ప్రత్యేక పన్ను  మినహాయింపునివ్వాలి ప్రాపర్టీ పాలసీలకు ప్రయోజనాలు కల్పించాలి జీఎస్‌టీని 12 శాతానికి తగ్గించాలి ఇన్సూరెన్స్‌ సంస్థల వినతులు... దేశ జనాభా సుమారు 133 కోట్ల స్థాయిలో ఉన్నా దేశీయంగా బీమా పాలసీలు ఇంకా అంతగా ప్రాచుర్యం పొందడం లేదు. స్థూల దేశీయోత్పత్తిలో బీమా రంగం వాటా 5 శాతం లోపే ఉంటోంది. ఈ నేపథ్యంలో బీమా విస్తృతిని మరింతగా పెంచే దిశగా బడ్జెట్‌లో పన్నుపరమైన ప్రోత్సాహకాలు మరిన్ని ఇవ్వాలని ఇన్సూరెన్స్‌ సంస్థలు

బడ్జెట్‌కు సేఫ్‌ బెట్స్‌

Saturday 25th January 2020

కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ 2020-21 ఆర్థిక సంవత్సరానికి బడ్జెట్‌ను ఫిబ్రవరి 1న పార్లమెంట్‌కు సమర్పించనున్నారు. దీనిపై చాలా వర్గాల్లో ఎన్నో అంచనాలు, ఆకాంక్షలు ఉన్నాయి. దేశ జీడీపీ వృద్ధి రేటు 4.5 శాతానికి తగ్గిపోయిన సమయంలో వస్తున్నందున ఈ బడ్జెట్‌కు ఎక్కువ ప్రాధాన్యమే ఉంది. ఈ సమయంలో ఇన్వెస్ట్‌ చేయాలనుకునే వారికి బీమా కంపెనీలు సురక్షితమైనవిగా ఇండిట్రేడ్‌ క్యాపిటల్‌కు చెందిన సుదీప్‌ బందోపాధ్యాయ సూచించారు. వివిధ రంగాలపై

Most from this category