News


ఈ వారం నిఫ్టీకి 12,200 కీలకం?!

Monday 10th February 2020
Markets_main1581325204.png-31659

హెచ్చుతగ్గులకు చాన్స్‌
12.400కు చేరుకునే అవకాశాలు తక్కువే
- ఉమేష్‌ మెహతా, రీసెర్చ్‌ హెడ్‌,  శామ్‌కో సెక్యూరిటీస్‌

కేంద్ర బడ్జెట్‌ విడుదల, రిజర్వ్‌ బ్యాంక్‌ పాలసీ సమీక్ష, దిగ్గజ కంపెనీల క్యూ3 ఫలితాలు వంటి ప్రధాన అంశాలను దాటుకుని వచ్చేశామంటున్నారు శామ్‌కో సెక్యూరిటీస్‌ రీసెర్చ్‌ హెడ్‌.. ఉమేష్‌ మెహతా. దీంతో ఈ వారం దేశీ స్టాక్‌ మార్కెట్లు కొంతమేర హెచ్చుతగ్గులను చవిచూసే వీలున్నట్లు చెబుతున్నారు. ఒక ఇంటర్వ్యూలో మార్కెట్లపై ఉమేష్‌ వ్యక్తం చేసిన అభిప్రాయాలను చూద్దాం.. 

12,400కు చేరకపోవచ్చు
బడ్జెట్‌ తదుపరి గత వారం మార్కెట్లు దూకుడు చూపినప్పటికీ ఈ వారం స్పీడ్‌ ఉండకపోవచ్చు. ఫిబ్రవరి సిరీస్‌లో ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 12,400 పాయింట్ల వరకూ ర్యాలీ చేసే అవకాశాలు బహు తక్కువగా ఉన్నాయి. అటు బ్లూచిప్స్‌.. ఇటు మిడ్‌ క్యాప్స్‌లోనూ సంస్థాగత ఇన్వెస్టర్ల నుంచి డెలివరీ ఆధారిత కొనుగోళ్లు కనిపించడంలేదు. అధిక స్థాయిలవద్ద కొనుగోళ్లకు అత్యధిక శాతం మంది ఆసక్తి చూపడం లేదు. దీనికితోడు ఇటీవల లార్జ్‌ క్యాప్స్‌, మిడ్‌ క్యాప్స్‌ మధ్య అంతరం తగ్గిపోయింది. ఈ ర్యాలీ తదుపరి సహజంగానే మార్కెట్లో హెచ్చుతగ్గులు నమోదయ్యేందుకు అవకాశముంది. తద్వారా మార్కెట్లో దిద్దుబాటు(కరెక‌్షన్‌) జరగనుంది. నిఫ్టీకి ఈ వారం 12,200 వద్ద అవరోధాలు(రెసిస్టెన్స్‌) ఎదురుకావచ్చు.

విదేశీ సంకేతాలే
కేంద్ర ఆర్థిక శాఖ వార్షిక బడ్జెట్‌ను విడుదల చేయడం, రిజర్వ్‌ బ్యాంక్‌ పాలసీ నిర్ణయాలు, దిగ్గజ కంపెనీల క్యూ3 ఫలితాలు వంటి ప్రధాన అంశాలను దాటుకుని మార్కెట్లు వచ్చేశాయి. దీంతో ఇకపై విదేశీ సంకేతాలు సెంటిమెంటును ప్రభావితం చేయవచ్చు. చైనాలో పుట్టి ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్‌ వార్తల ఆధారంగా మార్కెట్లు సంరచించే వీలుంది. ఆర్థిక వృద్ధికి బడ్జెట్‌లో కేంద్ర ప్రభుత్వం తీసుకున్న చర్యలు మార్కెట్లలో ప్రతిఫలించేందుకు సమయం పడుతుంది. తద్వారా ఒడిదొడుకులు సైతం తగ్గుముఖం పడతాయి. కొన్ని రంగాలు, కంపెనీల కౌంటర్లలో లాభాల స్వీకరణ కనిపించవచ్చు.

రిటర్నులు..
గత వారం సాంకేతికంగా ఐదు స్టాక్స్‌ బ్రేకవుట్‌ సాధించాయి. దీంతో ఇకపై ఈ కౌంటర్లు మరింత జోరు చూపవచ్చు. ఈ జాబితాలో ఆల్కెమ్‌ లేబ్స్‌, అబాట్‌ ఇండియా, డాబర్‌ ఇండియా, ఇన్ఫో ఎడ్జ్‌ ఇండియా, సలోరా యాక్టివ్‌ ఫార్మాను ప్రస్తావించవచ్చు. సమీపకాలంలో ఈ షేర్లు ర్యాలీ బాటలో సాగే వీలుంది. గత నెల రోజుల్లో లార్జ్‌ క్యాప్స్‌, మిడ్‌ క్యాప్స్‌ మధ్య అంతరం‍ తగ్గుతూ వచ్చింది. దీంతో ఇకపై లార్జ్‌ క్యాప్స్‌ను ఎంచుకోవడమే మేలు చేకూర్చవచ్చు.You may be interested

విదేశీ ఆన్‌లైన్‌ ఉత్పత్తులు మరింత ప్రియం..?

Monday 10th February 2020

  ముంబై: విదేశీ ఆన్‌లైన్‌ సైట్లలో ఉత్పత్తులు మరింత ప్రియం కానున్నాయి. భారత దేశంలో ఆన్‌లైన్‌లో కొనుగోలు, విక్రయాలు నిర్వహిస్తున్న విదేశీ సైట్లపై  ప్రభుత్వం ముందస్తు పన్నుతో పాటు కస్టమ్స్‌ మోడ్‌ల్‌ను ప్రవేశపెట్టనుంది. దీనివల్ల చైనాతో పాటు ఇతర విదేశీ ఈ -కామర్స్‌ సైట్ల ద్వారా ఉత్పత్తులను విక్రయించే కంపెనీలు ఆయా వస్తువుల షిప్పింగ్‌ కంటే ముందే పన్ను, కస్టమ్స్‌ డ్యూటీ చెల్లిస్తేనే ఆయా ఉత్పత్తులు కొనుగోలు దారులకు చేరతాయి. ఈ

అమ్మకాల ఒత్తిడిలో మెటల్‌ షేర్లు

Monday 10th February 2020

3.50శాతం నష్టపోయిన మెటల్‌ షేర్లు 6శాతం పతమనమైన టాటా స్టీల్‌ అంతర్జాతీయ మార్కెట్లో మెటల్‌ షేర్లకు డిమాండ్ తగ్గడంతో సోమవారం దేశీయ మార్కెట్లో మెటల్‌ షేర్లు భారీగా నష్టాలను చవిచూస్తున్నాయి. ఎన్‌ఎస్‌ఈలో మెటల్‌ షేర్లకు ప్రాతినిథ్యం వహించే నిఫ్టీ మెటల్‌ ఇండెక్స్‌ మిడ్‌ సెషన్‌ సమయానికి 3.50శాతం క్షీణించింది. ప్రపంచంలోనే అతిపెద్ద మెటల్‌ ఉత్పత్తిదారు చైనాలో కరోనా వైరస్‌ వ్యాధి వ్యాప్తి భయాలతో రెండో త్రైమాసికంలో వార్షిక ప్రాతిపదికన నాన్‌ఫెర్రస్‌ మెటల్‌ ఉత్పత్తి

Most from this category