News


కోవిడ్‌-19 కాటుకు గురైన మాంసం ఎగుమతులు!

Thursday 12th March 2020
Markets_main1584005122.png-32436

కోవిడ్‌-19(కరోనా) కారణంగా భారత మాంసం ఎగుమతులు భారీగా పడిపోయాయి. కరోనామహమ్మారీ దాటికి మాంసం ఎగుమతులు 12-15 శాతం పడిపోగా, షిప్‌మెంట్లపై పరిమితులు విధించడం, ఫార్మా ముడిపదార్థాలు కొరత, సోలార్‌, ఎలక్ట్రికల్‌ పరిశ్రమలు విడిభాగాల దిగుమతులు ఆగిపోవడంతో ఈ రంగాలన్నీ కుదేలయ్యాయని ఆర్థిక మంత్రి పియూష్‌ గోయల్‌ అన్నారు. ప్రపంచ వ్యాప్తంగా సరఫరా చైన్స్‌ నిలిచిపోవడంతో ఆ ప్రభావం ఇండియాపై ఏ స్థాయిలో ఉందో విశ్లేషించేందుకు వాణిజ్య, పరిశ్రమల మంత్రి  పియూష్‌ గోయల్‌, ఎక్స్‌పోర్ట్‌ ప్రమోషన్‌ కౌన్సిల్‌, ఇండస్ట్రీ చాంబర్స్‌ అసోసియేషన్స్‌తో గురువారం సమావేశమై దీనిపై చర్చించారు. ఈ సమావేశంలో ఆహార పరిశ్రమల్లో మాంసం ఉత్పత్తులు అధిక ప్రభావానికి గురైయ్యయని తేల్చారు. 12-15 శాతం మాంసం ఉత్పత్తులు ఎగుమతులు పడిపోయాయి. బాస్మతీ కాకుండా ఇతర రకాల బియ్యం కంటేయినర్లను ముందుకు కదలకుండా నిషేధించారని ఒక అధికారి వెల్లడించారు. అధిక మొత్తంలో చైనానుంచి దిగుమతి చేసుకునే ఫార్మా, సోలార్‌, ఎలక్ట్రానిక్‌ రంగాలు విడిభాగాలు లేకపోవడంతో ఇవి కూడా దెబ్బతిన్నాయి. కాగా చైనా నుంచి సరఫరా నిలిచిపోయిన 500 ఉత్పత్తులను ఇండియా ఎగుమతి చేసేందుకు లిస్టు సిద్ధం చేసినట్లు తెలిపారు. వాణిజ్య సంక్షోభం కారణంగా ఎగుమతులన్నీ ఆగిపోయాయని, ఇప్పటికే పంపిన సరుకులు అలానే ఉండిపోయాయని, కొత్త ఆర్డర్లు కూడా రావడంలదేని ఎగుమతి దారులు వాపోతున్నట్లు సమావేశం గుర్తించింది. మధ్యప్రాచ్యంలోని ఈజిప్ట్‌లో మాత్రమే కొద్దిగా డిమాండ్‌ ఉందన్నారు. ఇక వియత్నాంకు ఏవైనా ఎగుమతి చేయాలంటే చైనా నుంచే రవాణా చేయాల్సి ఉంటుంది కాబట్టి ఎగుమతులకు మరికొంత సమయం పట్టే అవకాశం ఉంది. కాగా 24 రకాల ఫార్మాసూటికల్స్‌ పదార్థాలు, ఫార్ములేషన్స్‌ వంటి ఎగుమతులపై ప్రభుత్వం పరిమితి విధించిందని. వాటిలో విటమిన్‌ బీ1, బీ6, బీ12లు వంటివి ఉన్నాయని సమావేశంలో ముఖ్యంగా ప్రస్తావించారు.You may be interested

డీమార్ట్‌, హావెల్స్‌, ఐఆర్‌సీటీసీ.. డౌన్‌ డౌన్‌

Thursday 12th March 2020

కరోనా భయాలు, ట్రావెల్‌ నిషేధాలు, యస్‌ బ్యాంక్‌ వైఫల్యం తదితర ప్రతికూల పరిస్థితులు దేశీ స్టాక్‌ మార్కెట్లకు షాక్‌నిస్తున్నాయి. దీంతో ఇటీవల కాలంవరకూ మార్కెట్ల ఫేవరెట్లుగా నిలుస్తూ వచ్చిన పలు కౌంటర్లు ఉన్నట్టుండి అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కొంటున్నాయి. బుధవారం అమెరికా మార్కెట్లు 5 శాతం పతనంకాగా.. యూరోపియన్‌ మార్కెట్లు సైతం 5 శాతం క్షీణతతో ప్రారంభమయ్యాయి. ఇక దేశీ మార్కెట్లు దాదాపు 10 శాతం పడిపోయాయి. దీంతో ఇటీవల సరికొత్త

బ్యాంక్‌ నిఫ్టీ 9.50శాతం క్రాష్‌..!

Thursday 12th March 2020

మార్కెట్‌ మహాపతనంలో భాగంగా ఎన్‌ఎస్‌ఈలో కీలకమైన బ్యాంక్‌ నిఫ్టీ ఇండెక్స్‌ గురువారం ట్రేడింగ్‌లో ఏకంగా 9.50శాతం నష్టాన్ని చవిచూసింది. నేడు మార్కెట్‌ భారీ గ్యాప్‌ డౌన్‌లో భాగంగా ఈ ఇండెక్స్‌ మునుపటి ముగింపు(26,487.80)తో పోలిస్తే 5శాతం(1311.9 పాయింట్లు) నష్టంతో 25,175.90 వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించింది. మార్కెట్‌ ప్రారంభం నుంచి ప్రైవేట్‌ రంగ షేర్లలో అమ్మకాల కొనసాగుతుండటంతో ఇండెక్స్‌ ఒక దశలో దాదాపు 9.50శాతం(2474 పాయింట్లు) నష్టాన్ని చవిచూసింది. మధ్యాహ్నం గం.లకు

Most from this category