News


బుల్స్‌కు 12100 పాయింట్లు కీలకం!

Saturday 4th January 2020
Markets_main1578120778.png-30672

సచ్చిదానంద్‌ అంచనా
దేశీయ మార్కెట్లు గురువారం ర్యాలీ అనంతరం శుక్రవారం వెనుకంజ వేశాయి. అంతర్జాతీయ బౌగోళిక రాజకీయాంశాలు వేడక్కడంతో ప్రపంచ మార్కెట్లతో పాటు ఇండియా మార్కెట్‌ కూడా నెగిటివ్‌గా ముగిసింది. నిఫ్టీ శుక్రవారం 12250 పాయింట్లకు దిగువన ముగిసింది. ఈ నేపథ్యంలో నిఫ్టీకి 12100 పాయింట్లు చాలా కీలకమని, బుల్స్‌ ఈ స్థాయిని కాపాడుకోలేకపోతే కరెక‌్షన్‌ తప్పదని ట్రేడ్‌బుల్స్‌ సెక్యూరిటీస్‌ అనలిస్టు సచ్చిదానంద ఉట్టేకర్‌ అంచనా వేశారు. ఈవారం మార్కెట్‌ పరిమిత శ్రేణిలో కదలాడిందని, 12300 పాయింట్ల వద్ద నిరోధం ఎదుర్కొందని చెప్పారు. గురువారం ర్యాలీతో వారాన్ని కొత్త గరిష్ఠాల వద్ద ముగించాలని సూచీలు భావించాయని, కానీ ఇరాన్‌ టెన్షన్లు ఈ ఆశను వమ్ము చేశాయని తెలిపారు. ఇకపై కొత్త గరిష్ఠాన్ని చేరేందుకు మరికొంత సమయం పట్టవచ్చన్నారు. అయితే ఇందుకు దిగులు పడాల్సిన అవసరం లేదని, కన్సాలిడేషన్స్‌ ఎప్పుడూ మంచివేనని వివరించారు. నిఫ్టీ స్వల్పకాలానికి 12400 పాయింట్లను చేరవచ్చని, 12100 పాయింట్ల వద్ద బలమైన బేస్‌ నిర్మించుకుంటోందని చెప్పారు. రాబోయే వారంలో 12300 పాయింట్లను దాటితే బలమైన బ్రేకవుట్‌ వస్తుందన్నారు. అలాంటప్పుడు నిఫ్టీ 12440- 12460 పాయింట్ల వరకు ర్యాలీ జరపవచ్చన్నారు. దిగువన 12100 పాయింట్లు చాలా కీలకమని, ఈ స్థాయిని కోల్పోతే కరెక‌్షన్‌ వస్తుందని హెచ్చరించారు. ఇకపై మార్కెట్‌ను కదిలించే పెద్ద అంశాలు.. క్యు3 ఫలితాలు, బడ్జెట్‌2020 అని చెప్పారు. వీటి నేపథ్యంలో మార్కెట్లు దాదాపుగా నెగిటివ్‌ వార్తలను జీర్ణించుకొని క్రమంగా 12400 పాయింట్లవైపు అడుగులు వేయవచ్చని అంచనా వేశారు. 



You may be interested

డివిడెండు చెల్లింపుల్ని పెంచుతున్న కంపెనీలివే!

Saturday 4th January 2020

సాధారణంగా ఇన్వెస్టర్లు స్టాక్‌ మార్కెట్లలో అత్యధిక రిటర్నులు ఆశిస్తూ పెట్టుబడులకు దిగుతుంటారు. ఇదే సమయంలో కంపెనీ లాభాల నుంచి ప్రకటించే డివిడెండ్లకూ మరికొంతమంది ఇన్వెస్టర్లు ప్రాధాన్యత ఇస్తుంటారు. క్యాష్‌ఫ్లోలు మెరుగ్గా ఉండే కంపెనీలు సాధారణంగా అధిక డివిడెండ్లను అందిస్తుంటాయంటున్నారు స్టాక్‌ విశ్లేషకులు. కాగా.. అటు డివిడెండ్లు, ఇటు షేర్ల ధరల పెరుగుదల ద్వారా రెండు వైపులా లాభాలు పొందే ప్రణాళికలకూ మరికొంతమంది ఇన్వెస్టర్లు ప్రాధాన్యత ఇస్తుంటారని తెలియజేస్తున్నారు. ఈ బాటలో

మధ్యప్రాచ్య ఘటనలు.. మనకెంత ప్రమాదకరం?

Saturday 4th January 2020

ముడిచమురు ధర పెరుగుదలతో పొంచిఉన్న విత్తలోటు ముప్పు ఇరాన్‌ జనరల్‌ను అమెరికా డ్రోన్‌ సాయంతో హత్య చేయడంతో మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతలు భగ్గుమన్నాయి. శుక్రవారం ముడిచమురు ధరలు ఒక్కమారుగా దూసుకుపోయాయి. ఎంకి పెళ్లి సుబ్బి చావుకొచ్చిందన్నట్లు అటుతిరిగి ఇటుతిరిగి మధ్యప్రాచ్యంలో పెరుగుతున్న ఉద్రిక్తతలు భారత్‌కు ప్రమాదకరంగా పరిణమిస్తున్నాయి. దాదాపు 80 శాతం మేర ముడిచమురు దిగుమతులపై ఆధారపడిన ఇండియాకు తాజా సంఘటనలు ఇబ్బందిగా మారుతున్నాయి. ఇరాన్‌ సంక్షోభం క్రమంగా ముడిచమురు ధరకు రెక్కలు

Most from this category