News


ఈ షేర్లలో ర్యాలీ?!

Tuesday 4th February 2020
Markets_main1580798581.png-31495

ఎంఏసీడీ సంకేతాలు
మార్కెట్‌ నిపుణులు ఒక నిర్దేశిత కౌంటర్లో ట్రెండ్‌ రివర్సల్‌ గుర్తించేందుకు ఎంఏసీడీ ఇండికేటర్‌ను వాడతారు.  26, 12 రోజుల ఎక్స్‌పొటెన్షియల్‌ మూవింగ్‌ యావరేజెస్‌ మధ్య భేదం ఆధారంగా ఎంఏసీడీ పనిచేస్తుంది. 9రోజుల ఎక్సోపోనెన్సియల్‌ మూవింగ్‌ యావరేజిని సిగ్నల్‌ లైన్‌గా పిలుస్తారు. సిగ్నల్‌లైన్‌ ఆధారంగా బై, సెల్‌ అవకాశాలను గణిస్తారు. సిగ్నల్‌లైన్‌కు పైన ఎంఏసీడీ లైన్‌ కదలాడితే బుల్లిష్‌గా, ఈ లైన్‌కు దిగువకు వస్తే బేరిష్‌గా చెప్పవచ్చు. ఎంఏసీడీ రెండు లైన్లు ఒకదానినొకటి క్రాస్‌ చేసే విధానాన్ని బట్టి బేరిష్‌ క్రాసింగ్‌, బుల్లిష్‌ క్రాసింగ్‌గా చెబుతారు. మదుపరులు ఇన్వెస్ట్‌ చేయాలంటే కేవలం ఎంఏసీడీ ఇండికేటర్‌ను మాత్రమే విశ్వసించకుండా,  ఇతర ఇండికేటర్లు పరిశీలించి అధ్యయనం చేయాలని నిపుణులు సూచిస్తున్నారు.
వీటిలో బుల్లిష్‌ సంకేతాలు
దేశీయ సూచీల్లో సోమవారం ముగింపు ప్రకారం 11 షేర్ల చార్టుల్లో ఎంఏసీడీ(మూవింగ్‌ ఏవరేజ్‌ కన్వర్జన్స్‌ డైవర్జన్స్‌) ఇండికేటర్‌ బుల్లిష్‌ సంకేతాలు ఇస్తోందని టెక్నికల్‌ అనలిస్టులు చెబుతున్నారు. ఈ షేర్లలో ఎంఏసీడీ బుల్లిష్‌ క్రాసోవర్‌ ఏర్పరిచింది. ఇలా పాజిటివ్‌గా  మారిన కంపెనీల్లో బయోకాన్‌, ఏసియన్‌ పెయింట్స్‌, నెస్లెఇండియా, జిల్లెట్‌ ఇండియా, ఎవెరెడీ ఇండస్ట్రీస్‌, స్పందనా స్ఫూర్తీ, త్రివేణీ టర్బైన్‌, జైబాలాజీ ఇండస్ట్రీస్‌, టీసీఐ డెవెలపర్స్‌, కాప్రిగ్లోబల్‌ క్యాపిటల్‌ తదితరాలున్నాయి. ఈ కౌంటర్లలో ట్రెండ్‌ బలంగా ఉందని టెక్నికల్‌ విశ్లేషకులు చెపుతున్నారు. 
 ఈ షేర్లలో బేరిష్‌ క్రాసోవర్‌
మరోవైపు 49 షేర్లలో  ఎంఏసీడీ బుల్లిష్‌ క్రాసోవర్‌ ఏర్పడింది. ఎల్‌అండ్‌టీ, హీరోమోటోకార్‌‍్ప, ఆర్‌ఈసీ, పీసీ జువెలరీస్‌, మణుప్పురం, సెంచరీ టెక్స్‌టైల్స్‌, నిప్పన్‌లైఫ్‌ ఇండియా ఏఎంసీ, వీఐపీ ఇండస్ట్రీస్‌, ఎంఅండ్‌ఎం ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌ తదితరాలు ఈ జాబితాలో వున్నాయి. ఈ కౌంటర్లలో ట్రెండ్‌ బలహీనంగా మారిందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. 
 ఎంఏసీడీతోపాటు ఆర్‌ఎస్‌ఐ, బోలింగర్‌ బ్యాండ్‌ లాంటి ఇతర ఇండికేటర్లను పరిశీలించి ట్రెండ్‌ను నిర్ధారణ చేసుకోవాలి.  



You may be interested

నాలుగు ఐపీఓలకు సెబీ అనుమతి

Tuesday 4th February 2020

ప్రైవేటు రంగంలో నాలుగు కంపెనీలు పబ్లిక్‌ ఇష్యూలు జారీ చేసేందుకు సెబీ అనుమతించింది. వీటిలో ఆన్‌లైన్‌ ట్రావెల్‌ కంపెనీ అయిన ఈజీ మై ట్రిప్‌, రియాల్టి రంగానికి చెందిన పురానిక్‌ బిల్డర్స్‌, మాంటే కార్లో, కెమెకాన్‌ స్పెషాలిటీ కెమికల్స్‌ ఉన్నాయి. ఇటీవల పార్లమెంట్‌లో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌  ప్రవేశపెట్టిన ఈ ఏడాది బడ్జెట్‌లో ఎల్‌ఐసీలోకి పబ్లిక్‌ ఇష్యూ జారీ చేయనున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే.   

బ్యాంక్‌ నిఫ్టీ ఇండెక్స్‌ 2శాతం జంప్‌..!

Tuesday 4th February 2020

మార్కెట్లో కొనసాగుతున్న కొనుగోళ్ల పర్వంలో భాగంగా మంగళవారం ఉదయం ట్రేడింగ్‌ సెషన్‌లో బ్యాంకింగ్‌ రంగ షేర్లు జోరుగా ర్యాలీ చేస్తున్నాయి. ఫలితంగా ఎన్‌ఎస్‌ఈలో బ్యాంకింగ్‌ రంగ షేర్లకు ప్రాతినిథ్యం వహించే బ్యాంక్‌ నిఫ్టీ ఇండెక్స్‌ ఉదయం ట్రేడింగ్‌లో 2.25శాతం పెరిగింది. నేడు ఈ ఇండెక్స్‌ 30,235.30 వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించింది. మార్కెట్‌ మొదలైనప్పటి నుంచి అటు ప్రభుత్వ, ఇటు ప్రైవేట్‌ రంగ షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభించడంతో ఒకదశలో 2.25శాతం

Most from this category