News


11900 పాయింట్ల వద్ద కీలక మద్దతు!

Friday 6th December 2019
Markets_main1575606532.png-30088

నిఫ్టీకి కీలకమైన మద్దతు 11900 పాయింట్ల వద్ద ఉందని, పైన 12150-12200 పాయింట్ల వద్ద నిరోధం ఎదుర్కొంటోందని నిపుణులు అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం సూచీ చార్టుల్లో బేరిష్‌ హార్మోనిక్‌ ab=cd ప్యాట్రన్‌ కనిపిస్తోందన్నారు. ఈవారంలో నాలింగిట మూడు సెషన్లలో సూచీలు నెగిటివ్‌గానే ముగిశాయి. మార్కెట్‌ విస్తృతి కూడా డౌన్‌ట్రెండ్‌కే అనుకూలంగా ఉందని, ఇది ఆయా స్టాకుల్లో ప్రాఫిట్‌బుకింగ్‌ను సూచిస్తోందన్నారు. మరోవైపు బ్యాంకు నిఫ్టీ సైతం ఈవారం కొంత నష్టాలు చవిచూసింది. ఇకపై నిఫ్టీ కొంతకాలం 11900- 12150 పాయింట్ల రేంజ్‌లోనే కదలాడవచ్చు. ఒకవేళ నిఫ్టీ 11900 పాయింట్లను కోల్పోతే కరెక‌్షన్‌ రావచ్చని అంచనా. ఈ సమయంలో ట్రేడర్లు అప్రమత్తంగా వ్యవహరించడం మంచిది. వీలున్నంత వరకు షార్ట్‌టర్మ్‌ ప్రాఫిట్‌ బుకింగ్‌ చేసుకొని కొత్త కొనుగోళ్లకు వేచిచూడాలని నిపుణుల సలహా. ఒకవేళ నిఫ్టీ బలంగా 12150 పాయింట్లను దాటగలిగితే మరింత గరిష్ఠాలకు చేరుతుంది. లాంగ్‌టర్మ్‌ ధృక్పధం మాత్రం పాజిటివ్‌గానే ఉన్నట్లు ఎక్కువమంది నిపుణులు అభిప్రాయపడ్డారు. రేంజ్‌బౌండ్‌ మార్కెట్లో దిగువకు వచ్చినప్పుడల్లా కొనుగోళ్లకు అవకాశంగా పరిగణించవచ్చని సూచించారు. ఇండెక్స్‌పై కాకుండా ఎంపిక చేసిన స్టాకుల్లో పెట్టుబడులు ఈ సమయంలో బెటరని తెలిపారు. 



You may be interested

ఫ్లాట్‌గా ట్రేడ్‌ అవుతున్న పసిడి

Friday 6th December 2019

అమెరికా చైనాల మధ్య వాణిజ్య ఒప్పంద అనిశ్చితి కొనసాగుతున్న తరుణంలో పసిడి ధర శుక్రవారం ఫ్లాట్‌ కదులుతోంది. ఆసియా ట్రేడింగ్‌లో ఔన్స్‌ పసిడి ధర 2డాలర్ల స్వల‍్ప నష్టంతో 1481 డాలర్ల వద్ద ట్రేడ్‌ అవుతోంది. వాణిజ్య చర్చలు "సరైన దిశలో పయనిస్తున్నాయి" అని ట్రంప్ తాజా వ్యాఖ్యలు వాణిజ్య ఒప్పందం ఆశలను చిగురించాయి. దీందో రిస్క్‌ అసెట్స్‌లైన ఈక్విటీ మార్కెట్లలో పెట్టుబడులు పెట్టేందుకు మొగ్గు చూపుతున్నారు. అయితే డాలర్‌

లాభాల  ప్రారంభం

Friday 6th December 2019

 క్రితం రోజు ఆర్‌బీఐ పాలసీ నిర్ణయం వెలువడిన తర్వాత అమ్మకాల ఒత్తిడికి లోనైన స్టాక్‌ సూచీలు శుక్రవారం పాజిటివ్‌గా ప్రారంభమయ్యాయి. బీఎస్‌ఈ సెన్సెక్స్‌ 172 పాయింట్ల లాభంతో 40,952 పాయింట్ల వద్ద మొదలుకాగా, ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 29 పాయింట్ల పెరుగుదలతో 12,047 పాయింట్ల వద్ద ప్రారంభమయ్యింది. 

Most from this category