News


11100 పాయింట్లే కీలకం!

Wednesday 9th October 2019
Markets_main1570592979.png-28775

వరుసగా ఆరు సెషన్లు నిఫ్టీ నెగిటివ్‌గా ముగియడంతో ప్రస్తుతం ఓవర్‌సోల్డ్‌ పరిస్థితి కనిపిస్తోందని మార్కెట్‌ నిపుణులు విశ్లేషిస్తున్నారు. ఆరు వరుస నష్టాల సెషన్లు మార్కెట్‌లో బుల్స్‌కు పగ్గాలు వేశాయంటున్నారు. నిఫ్టీ ప్రస్తుతం డైలీ చార్టుల్లో బేరిష్‌ క్యాండిల్‌ ఏర్పరిచింది. కీలకమైన 200, 100 రోజుల డీఎంఏ స్థాయిలకు దిగువకు వచ్చింది. ఇక నిఫ్టీకి అత్యంత కీలక మద్దతు తన 50 రోజుల డీఎంఏ స్థాయి 11087 వద్ద కనపడుతోంది. దీన్ని కోల్పోయి, 10959 పాయింట్ల మరో ముఖ్యమైన మద్దతును కూడా నిఫ్టీ నిలబెట్టుకోలేకపోతే పూర్తిగా సూచీలు బేర్స్‌ గుప్పిటలోకి వెళ్లవచ్చు. ఎంఏసీడీ ఇప్పటికే నెగిటివ్‌ క్రాసోవర్‌ ఏర్పరిచింది. ముగింపు లెక్కల్లో 11100 పాయింట్ల దిగువన క్లోజయితే బ్రేక్‌డౌన్‌గా భావించవచ్చు.  ఈ దఫా బ్రేక్‌డౌన్‌ సాధిస్తే గత కన్సాలిడేషన్‌ స్థాయి 10700 పాయింట్లను కూడా నిలబెట్టుకోలేకపోవచ్చు. పైస్థాయిలో 11400 పాయింట్ల వద్ద గట్టి నిరోధం ఉంది. 11200 పాయింట్ల వద్ద తాజా షార్ట్స్‌ను పరిశీలించవచ్చు. షార్ట్స్‌కు 11235 పాయింట్లను స్టాప్‌లాస్‌గా ఉంచుకోవాలని నిపుణుల సలహా. 


నిఫ్టీ కీలక స్థాయిలు: 11100, 11400 పాయింట్లు.
కాల్స్‌ ఎక్కువగా ఉన్నది: 11500, 12000 పాయింట్ల వద్ద.
పుట్స్‌ అధికంగా ఉన్నది: 11000, 10800 పాయింట్ల వద్ద. 

అనేక స్టాకులు ఓవర్‌సోల్డ్‌గా ఉన్నందున బుధవారం సూచీల్లో, స్టాకుల్లో చిన్నపాటి బౌన్స్‌కు అవకాశం ఉందని, కానీ మొత్తం మీద మార్కెట్‌ మూడ్‌ మాత్రం నెగిటివ్‌గానే ఉంటుందని నిపుణుల అభిప్రాయం. 



You may be interested

లాభాల ప్రారంభం

Wednesday 9th October 2019

గత ఆరు ట్రేడింగ్‌ సెషన్ల నుంచి త్రీవ నష్టాల్ని చవిచూసిన భారత్‌ స్టాక్‌ సూచీలు బుధవారం లాభాలతో ప్రారంభమయ్యాయి. బీఎస్‌ఈ సెన్సెక్స్‌ 96 పాయింట్ల లాభంతో 37,628 పాయింట్ల వద్ద, ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 26 పాయింట్ల గ్యాప్‌అప్‌తో 11,152 పాయింట్ల వద్ద మొదలయ్యాయి. అల్ట్రాటెక్‌ సిమెంట్‌, ఐసీఐసీఐ బ్యాంక్‌, మహింద్రా, బ్రిటానియాలు 1-2 శాతం మధ్య లాభాలతో ప్రారంభంకాగా, యస్‌బ్యాంక్‌, టైటాన్‌, హెచ్‌సీఎల్‌ టెక్‌లు తీవ్ర నష్టాలతో ట్రేడింగ్‌ను ఆరంభించాయి. 

వాణిజ్య చర్చలకు ముందు లాభాల్లో చమురు!

Tuesday 8th October 2019

గత సెషన్లో ఇండస్ట్రీయల్‌ కమోడిటీలు పెరగడంతో పాటు ఇరాక్, ఈక్విడార్‌ దేశాల ఆయిల్‌ సరఫరాలో అంతరాయం ఏర్పడడంతో మంగళవారం ట్రేడింగ్లో చమురు ధరలు లాభపడి ట్రేడవుతున్నాయి. మధ్యాహ్నాం 12.36 సమయానికి బ్రెంట్‌ క్రూడ్‌ 0.67 శాతం లాభపడి బారెల్‌ 58.74 డాలర్ల వద్ద, డబ్ల్యూటీఐ క్రూడ్‌ 0.72 శాతం లాభపడి బారెల్‌ 53.13 డాలర్ల వద్ద ట్రేడవుతున్నాయి. ‘రాగి, అల్యూమినియం లండన్‌లో పాజిటివ్‌గా ట్రేడవుతున్నాయి. కానీ గత వారం తయారీ

Most from this category