News


ఈ కౌంటర్లలో ర్యాలీ సంకేతాలు!

Tuesday 27th August 2019
Markets_main1566883652.png-28043

దాదాపు వంద లార్జ్‌ మరియు మిడ్‌ క్యాప్‌ స్టాక్స్‌ చార్టుల్లో ఎంఏసీడీ ఇండికేటర్‌ బుల్లిష్‌ క్రాసోవర్‌ ఏర్పరిచింది. ట్రెండ్‌ రివర్సల్‌ గుర్తించేందుకు ఎంఏసీడీ ఇండికేటర్‌ను వాడతారు.  26, 12 రోజుల ఎక్స్‌పొటెన్షియల్‌ మూవింగ్‌ యావరేజెస్‌ మధ్య భేదం ఆధారంగా ఎంఏసీడీ పనిచేస్తుంది. సిగ్నల్‌లైన్‌ ఆధారంగా బై, సెల్‌ అవకాశాలను గణిస్తారు. సిగ్నల్‌లైన్‌కు పైన ఎంఏసీడీ లైన్‌ కదలాడితే బుల్లిష్‌గా, ఈ లైన్‌కు దిగువకు వస్తే బేరిష్‌గా చెప్పవచ్చు. ఎంఏసీడీ రెండు లైన్లు ఒకదానినొకటి క్రాస్‌ చేసే విధానాన్ని బట్టి బేరిష్‌ క్రాసింగ్‌, బుల్లిష్‌ క్రాసింగ్‌గా చెబుతారు.  
బుల్లిష్‌ సిగ్నల్స్‌
సోమవారం ముగింపు ప్రకారం 100షేర్ల చార్టుల్లో ఎంఏసీడీ(మూవింగ్‌ ఏవరేజ్‌ కన్వర్జన్స్‌ డైవర్జన్స్‌) ఇండికేటర్‌ బుల్లిష్‌సంకేతాలు ఇస్తోందని టెక్నికల్‌ అనలిస్టులు చెబుతున్నారు. ఈ షేర్లలో ఎంఏసీడీ బుల్లిష్‌క్రాసోవర్‌ ఏర్పరిచింది. ఇలా పాజిటివ్‌గా  మారిన కంపెనీల్లో డిష్‌టీవీ, ఐబీ హౌసింగ్‌ ఫైనాన్స్‌, జేఎస్‌పీఎల్‌, ఐడీబీఐ, ఎన్‌బీసీసీ, ఎన్‌టీపీసీ, కెనెరా బ్యాంక్‌, బ్రిటానియా, ఓఎన్‌జీసీ, హెచ్‌పీసీఎల్‌, అదానీ పోర్ట్స్‌, ఎల్‌అండ్‌టీ, బజాజ్‌ఫైనాన్స్‌, జుబిలాంట్‌ ఫుడ్‌, గ్రాసిమ్‌, డీమార్ట్‌, సన్‌టీవీ తదితరాలున్నాయి.ఈ కౌంటర్లలో కొద్ది రోజుల నుంచి ట్రేడింగ్‌ పరిమాణం పెరుగుతూ, షేర్లు పెరగడం ట్రెండ్‌ పటిష్టతను సూచిస్తోందని టెక్నికల్‌ విశ్లేషకులు చెపుతున్నారు. 
ఈ షేర్లలో బేరిష్‌ క్రాసోవర్‌
మరోవైపు 17 షేర్లలో  ఎంఏసీడీ బేరిష్‌ క్రాసోవర్‌ ఏర్పడింది. ఎస్‌బీఐ లైఫ్‌, ఆప్టోసర్క్యూట్స్‌, ఏయూ స్మా్‌ల్‌ఫైనాన్స్‌ బ్యాంక్‌, ఎవరెస్ట్‌ కాంటో, అలంబిక్‌, మహీద్రా హాలిడేస్‌, ఏఆర్‌ఎస్‌ఎస్‌ ఇన్‌ఫ్రా తదితరాలు ఈ జాబితాలో ఉన్నాయి. మదుపరులు ఇన్వెస్ట్‌ చేయాలంటే కేవలం ఎంఏసీడీ ఇండికేటర్‌ను మాత్రమే విశ్వసించకుండా,  ఇతర ఇండికేటర్లు పరిశీలించి అధ్యయనం చేయాలని నిపుణులు సూచిస్తున్నారు.
ఎంఏసీడీతోపాటు ఆర్‌ఎస్‌ఐ, బోలింగర్‌ బ్యాండ్‌ లాంటి ఇతర ఇండికేటర్లను పరిశీలించి ట్రెండ్‌ను నిర్ధారణ చేసుకోవాలి. 



You may be interested

లాభాల్లో బ్యాంక్‌ ఇండెక్స్‌..నెగిటివ్‌లో కోటక్‌

Tuesday 27th August 2019

ఆర్థిక మంత్రి ప్రకటించిన ఉద్ధీపన చర్యలతో పాటు, ఆర్‌బీఐ తన మిగులు నిధులను ప్రభుత్వానికి అందించడానికి ఆమోదముద్ర వేయడంతో దేశియ ఈక్విటీ మార్కెట్లు మంగళవారం పాజిటివ్‌గా ట్రేడవుతున్నాయి. నిఫ్టీ బ్యాంక్‌ ఇండెక్స్‌ ఉదయం 10.43 సమయానికి 260.40 పాయింట్లు లాభపడి 28217.65 పాయింట్ల వద్ద ట్రేడవుతోంది. ఈ ఇండెక్స్‌లో హెవివెయిట్‌ షేర్లయిన హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ 0.32 శాతం, ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌ 3.50 శాతం లాభపడి ట్రేడవుతుండగా, కోటక్‌ బ్యాంక్‌ మాత్రం

నష్టాలో ఒరాకిల్‌, టీసీఎస్‌, ఇన్ఫోసిస్‌ షేర్లు

Tuesday 27th August 2019

దేశియంగా ఈక్విటీ మార్కెట్లు పాజిటివ్‌గా ట్రేడవుతున్నప్పటికి అంతర్జాతీయంగా ట్రేడ్‌  వార్‌ ఆందోళనలతో నిఫ్టీ ఐటీ ఇండెక్స్‌​ నష్టాల్లో ట్రేడవుతోంది. ఉదయం 10.04 సమయానికి నిఫ్టీ ఐటీ ఇండెక్స్‌ 1.35 శాతం నష్టపోయి 15,675.00 పాయింట్ల వద్ద ట్రేడవుతోంది. ఈ ఇండెక్స్‌లో హెవి వెయిట్‌ షేర్లయిన ఇన్ఫోసిస్‌ 2.49 శాతం నష్టపోయి రూ. 782.60 వద్ద, హెచ్‌సీఎల్‌ టెక్‌ 2.11 శాతం నష్టపోయి రూ. 1,069.75 వద్ద, టీసీఎస్‌ 1.28 శాతం

Most from this category