News


క్యూ2లో ఈ కంపెనీలు నష్టాలు ప్రకటించే అవకాశం!

Tuesday 15th October 2019
Markets_main1571163317.png-28904

సెప్టెంబర్‌ త్రైమాసికం ఫలితాల సీజన్‌ ఆరంభమైంది. దాదాపు అధిక శాతం కంపెనీలు ఈ నెల, వచ్చే నెలలో ఫలితాలను ప్రకటించనున్నాయి. కార్పొరేట్‌ పన్ను తగ్గింపు ప్రభావం క్యూ2 ఫలితాలపై పెద్దగా కనిపించదని, మందగమనం భయాల నేపథ్యంలో ఇన్వెస్టర్లు స్టాక్స్‌ను జాగ్రత్తగా ఎంపిక చేసుకోవాలని సూచిస్తున్నారు. ఆటోమొబైల్స్‌, టెలికం, మెటల్స్‌ కంపెనీలు నష్టాలను ఎదుర్కోవచ్చని లేదా వాటి లాభాలు తగ్గిపోవచ్చన్నది బ్రోకరేజీ సంస్థల అంచనా. ఫార్మా, అగ్రి, ఎఫ్‌ఎంసీజీ కంపెనీలు మంచి ఫలితాలను ప్రకటించొచ్చని అంచనా వేస్తున్నారు. చాలా రంగాల్లో కంపెనీల లాభాలు పెరిగే అవకాశం లేదన్న విశ్లేషణే వినిపిస్తోంది. సెప్టెంబర్‌ త్రైమాసికంలో నష్టాలను ప్రకటించే అవకాశం ఉన్న కంపెనీలపై పలు బ్రోకరేజీ సంస్థలు అంచనాలు ఇవి. 

 

టాటా మోటార్స్‌
రూ.1,221 కోట్ల నష్టాలను ప్రకటించొచ్చని ఎడెల్‌వీజ్‌ సెక్యూరిటీస్‌ అంచనా వేసింది. కన్సాలిడేటెడ్‌ ఆదాయం వార్షికంగా 4.4 శాతం క్షీణించొచ్చని పేర్కొంది. యూనియన్‌ బ్యాంకు రూ.1,125 కోట్ల నష్టాలు, యస్‌ బ్యాంకు రూ.1,907 కోట్ల నష్టాలను ప్రకటించేందుకు అవకాశం ఉందని ఎడెల్‌వీజ్‌ సెక్యూరిటీస్‌ అంచనా. యస్‌ బ్యాంకు ఆస్తుల నాణ్యత, క్రెడిట్‌ వ్యయాలు ప్రతికూలంగా ఉండొచ్చని పేర్కొంది. 

 

వీమార్ట్‌ రిటైల్‌
వీమార్ట్‌ రిటైల్‌ రూ.29 కోట్ల నష్టాలను ప్రకటించే అవకాశం ఉందని ఎడెల్‌వీజ్‌ సెక్యూరిటీస్‌ తెలిపింది. దీనికి కారణం ప్రస్తుత స్టోర్ల విక్రయాల్లో వృద్ధి ఫ్లాట్‌గా ఉండడమే. గడిచిన ఏడాది కాలంలో ఈ కంపెనీ 12 నూతన స్టోర్లను యాడ్‌ చేసుకున్నందున అమ్మకాల్లో 14 శాతం వృద్ధిని చూపించొచ్చని పేర్కొంది. 

 

వొడాఫోన్‌ఐడియా
టెలికం రంగ కంపెనీ వొడాఫోన్‌ఐడియా సైతం పెప్టెంబర్‌ త్రైమాసికానికి సంబంధించి రూ.4,411 కోట్ల నష్టాలను ప్రకటించొచ్చని ఎడెల్‌వీజ్‌ సెక్యూరిటీస్‌ తన నివేదికలో వివరించింది. సెప్టెంబర్‌ క్వార్టర్‌లో 49 లక్షల మంది చందాదారులను కోల్పోయినందున ఆదాయం 3.6 శాతం క్షీణించొచ్చని అంచనా వేసింది. అలాగే ఏఆర్‌పీయూ రూ.107గా ఉండొచ్చని, క్రితం ఏడాది ఇదే కాలంలో ఉన్న రూ.108తో పోలిస్తే స్వల్పంగా తగ్గుతుందని పేర్కొంది. కార్యకలాపాల ఏకీకరణ (ఐడియా, వొడా) విజయవంతంగా పూర్తి చేసినందున ఎబిట్డా మార్జిన్‌ క్షీణత అన్నది 80 బేసిస్‌ పాయింట్లకే పరిమితమై 31.6 శాతంగా ఉండొచ్చని తెలిపింది.

 

సెయిల్‌
ప్రభుత్వరంగ సెయిల్‌ రూ.995 కోట్ల నష్టాలను ప్రకటించొచ్చని బ్రోకరేజీ సంస్థ మోతీలాల్‌ ఓస్వాల్‌ అంచనా వేసింది. సెయిల్‌ ఎబిట్డా త్రైమాసికం వారీగా 61 శాతం క్షీణించొచ్చని పేర్కొంది. అమ్మకాలు కూడా 2 శాతం తగ్గొచ్చని పేర్కొంది. 

 

భారతీ ఎయిర్‌టెల్‌
భారతీ ఎయిర్‌టెల్‌ రూ.1,387 కోట్ల నష్టాలను ప్రకటించే అవకాశం ఉందని మోతీలాల్‌ ఓస్వాల్‌ అంచనాగా ఉంది. కన్సాలిడేటెడ్‌ ఆదాయం మాత్రం త్రైమాసికం వారీగా 0.5 శాతం పెరగొచ్చని పేర్కొంది. ఎబిట్డా 1.1 శాతం క్షీణించొచ్చని తెలిపింది. అలాగే, బ్యాంకు ఆఫ్‌ బరోడా రూ.1,200 కోట్ల నష్టాలు, పీఎన్‌బీ రూ.4,271 కోట్ల వరకు, లెమన్‌ట్రీ హోటల్‌ రూ.1.7 కోట్ల మేర నష్టాలను ప్రకటించొచ్చని మోతీలాల్‌ ఓస్వాల్‌ తన నివేదికలో వివరించింది. 



You may be interested

ఎస్‌బీఐ మ్యూచువల్‌ ఫండ్స్‌ కొన్న షేర్లివే

Tuesday 15th October 2019

మ్యూచువల్‌ ఫండ్స్‌ సంస్థలు (ఏఎంసీలు) అన్నింటిలోనూ నిర్వహణ ఆస్తుల విలువ పరంగా ఎస్‌బీఐ మ్యూచువల్‌ ఫండ్‌ మూడో స్థానంలో ఉంది. ఈక్విటీల్లో అధిక ఆస్తులు కలిగి ఉన్నది మాత్రం ఎస్‌బీఐ. సెప్టెంబర్‌ మాసంలో ఎస్‌బీఐ మ్యూచువల్‌ ఫండ్‌ విద్యుత్‌, ఇంధన, బ్యాంకింగ్‌, ఫైనాన్షియల్‌ రంగ స్టాక్స్‌ను ఎక్కువగా కొనుగోలు చేసింది. అలాగే, బ్యాంకింగ్‌, ఫైనాన్షియల్‌ రంగంలో ఐసీఐసీఐ బ్యాంకు, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు, చోలమండలం ఇన్వెస్ట్‌మెంట్‌ అండ్‌ ఫైనాన్స్‌, సిటీ యూనియన్‌

అంతర్జాతీయ బ్రోకరేజ్‌ల టాప్‌ సిఫార్సులు!

Tuesday 15th October 2019

హిందుస్తాన్‌ యూనీలీవర్‌పై సీఎల్‌ఎస్‌ఏ హిందుస్తాన్‌ యూనీలీవర్‌(హెచ్‌యూఎల్‌) ఈపీఎస్‌(షేరుపై ఆదాయం) అం‍చనాలను 1-2 శాతం పెంచింది. అంతేకాకుండా టార్గెట్‌ ధరను రూ. 2,135 నుంచి రూ. 2,250 కి పెంచింది. హోం కేర్‌, పర్సనల్‌ కేర్‌ విభాగంలో ఈ కంపెనీ బలమైన మార్జిన్‌లను పొందుతోందని తెలిపింది. ఈ కంపెనీ అమ్మకాల పరిమాణంలో వృద్ధి బాగానే ఉందని, వివిధ రాష్ట్రాలలో వివిధ రకాల ట్రెండ్‌లుండడం వలన డిమాండ్‌ దృక్పథంలో కొన్ని సమస్యలున్నాయని తెలిపింది. ఈ కంపెనీ,

Most from this category