News


లాంగ్‌టర్మ్‌ కోసం టాప్‌టెన్‌ సిఫార్సులు

Friday 18th January 2019
Markets_main1547797073.png-23665

దీర్ఘకాల పెట్టుబడితో దాదాపు 50 శాతం వరకు రాబడినందించే పది స్టాకులను వివిధ బ్రోకరేజ్‌లు రికమండ్‌ చేస్తున్నాయి.
1. యాంబిట్‌ క్యాపిటల్‌ రికమండేషన్‌- వీఐపీ ఇండస్ట్రీస్‌: టార్గెట్‌ రూ. 653. దేశంలో లీడింగ్‌ లగేజ్‌ బ్రాండ్‌. డిస్ట్రిబ్యూటర్‌ నెట్‌వర్క్‌, ఉత్పత్తుల నాణ్యత కంపెనీని బలంగా నిలబెడుతున్నాయి. రాబోయే రోజుల్లో ఎబిటాలో 25 శాతం వార్షిక వృద్ధి ఉండొచ్చు. రెవెన్యూలో 24 శాతం పెరుగుదల ఉంటుందని అంచనా. కరెన్సీ ఒడిదుడుకులు, ముడిపదార్ధాల వ్యయం పెరగడం వంటి చిన్న ఇబ్బందులున్నా, ఈపీఎస్‌లో 29 శాతం వరకు వార్షిక వృద్ధి సాధించగలదు. 
2. కోటక్‌ సెక్యూరిటీస్‌ రికమండేషన్‌- సూర్యా రోషి‍్న: టార్గెట్‌ రూ. 328. ఎస్‌ఓటీపీ వాల్యూషన్‌ విధానం ప్రకారం పాజిటివ్‌గా ఉంది. కంపెనీ తన ఎలక్ట్రిక్‌, స్టీల్‌పైప్‌ వ్యాపారాలని డీమెర్జర్‌ చేయాలనుకోవడం, ఎల్‌ఈడీ ధరల్లో స్థిరత్వం, పైప్స్‌ వ్యాపారంలో రికవరీ కారణంగా షేరు త్వరలో రీరేటింగ్‌ పొందవచ్చు. రాబోయే రోజుల్లో లాభాల్లో దాదాపు 19 శాతం వార్షిక చక్రీయ వృద్ధి ఉంటుందని అంచనా.
3. కార్వీ రికమండేషన్‌- కేఈసీ ఇంటర్నేషనల్‌: టార్గెట్‌ రూ. 376. దేశీయ, అంతర్జాతీయ టీఅండ్‌డీ విభాగంలో వృద్ధి అవకాశాలు, రైల్వే తదితర ఇన్‌ఫ్రారంగాల్లో అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. వీటిని తనకనూలంగా వినియోగించుకోగలదు. బలమైన ఆర్డర్‌ బుక్‌ కారణంగా రాబోయే సంవత్సరాల్లో రెవెన్యూలో 16 శాతం చక్రీయ వార్షిక వృద్దిని సాధించగలదు. 
4. కార్వీ రికమండేషన్‌- కల్పతరు పవర్‌. టార్గెట్‌ రూ. 497. వివిధ దేశాలకు చెందిన టీఅండ్‌డీ రంగం నుంచి భారీ ఆర్డర్లు సాధించింది. టీఅండ్‌డీయేతర వ్యాపారంలో కూడా బలమైన వృద్ది కనిపిస్తోంది. వచ్చే రెండేళ్లలో రెవెన్యూలో 15 శాతం వార్షిక చక్రీయ వృద్ధి ఉండొచ్చు. అనుబంధ సంస్థలు కూడా బలంగా పనిచేస్తున్నాయి. అందువల్ల నగదు కొరత ఉండదు.
5. జేఎం ఫైనాన్షియల్‌ రికమండేషన్‌- కరూర్‌ వైశ్యాబ్యాంక్‌. టార్గెట్‌ రూ. 120. వంద సంవత్సరాలకు పైబడ్డ చరిత్ర ఉంది. స్థిరమైన లాభార్జనకు మారుపేరు. క్రమం తప్పకుండా డివిడెండ్‌ చెల్లిస్తోంది. కొత్త సీఈఓ హయంలో మరింత ముందుకు దూసుకుపోతుందని అంచనా. ఆర్‌ఓఏ వచ్చే సంవత్సరాల్లో రెట్టింపు అవుతుంది.
6. యాక్సిస్‌ సెక్యూరిటీస్‌ రికమండేషన్‌- సిటీ యూనియన్‌ బ్యాంక్‌. టార్గెట్‌ రూ. 228. క్రమంతప్పని రాబడులు అందిస్తూ స్థిర వాల్యూషన్ల వద్ద కొనసాగుతోంది. ఎన్‌ఐఎం, అసెట్‌ క్వాలిటీ బాగున్నాయి. 
7. హెచ్‌డీఎఫ్‌సీ సెక్యూరిటీస్‌ రికమండేషన్‌- లౌరస్‌ ల్యాబ్స్‌. టార్గెట్‌ రూ. 480. కొత్త ఆర్డర్లతో ఫార్ములేషన్‌ వ్యాపారం రికవరీ అవుతోంది. త్వరలో ఏఆర్‌వీ ఫార్ములేషన్‌ మార్కెట్లో కనీసం 15 శాతం మార్కెట్‌ వాటా కొల్లగొడుతుందని అంచనా. వచ్చే సంవత్సరాల్లో ఎర్నింగ్స్‌ మూడు రెట్లు పెరగవచ్చు. 
8. సెంట్రమ్‌ రికమండేషన్‌- ఫెడరల్‌ బ్యాంక్‌: టార్గెట్‌ రూ. 135. ప్రవైట్‌ బ్యాంకుల్లో నాణ్యమైన బ్యాంకుగా మారుతోంది. సీఏఆర్‌ ఆరోగ్యకర స్థాయిల వద్ద ఉంది. గత ఐదేళ్లలో ఒత్తిడిలో ఉన్న ఆస్తులు బాగా తగ్గాయి. రాబోయే రోజుల్లో ఆర్‌ఓఏలో 41 బీపీఎస్‌ మెరుగుదల ఉండొచ్చు.
9. అరిహంత్‌ రికమండేషన్‌- నాట్కో ఫార్మా: టార్గెట్‌ రూ. 864. ఆంకాలజీ, హెపటైటిస్‌ సీ వ్యాపారంలో అగ్రగామిగా ఉంది. యూఎస్‌లో టామిఫ్లూలాంటి మాలిక్యూల్స్‌ ప్రవేశపెడుతూ విజయవంతంగా కొనసాగుతోంది. బలమైన జెనరిక్‌ కంపెనీలతో జట్టుకట్టడంతో అనవసర వ్యయాలు తగ్గాయి. రాబోయే రోజుల్లో రెవెన్యూ, లాభాల్లో 14 శాతం వార్షిక చక్రీయ వృద్ధి ఉంటుందని అంచనా.
10. ఆనంద్‌ రాఠీ రికమండేషన్‌- ఎన్‌ఓసీఐఎల్‌: టార్గెట్‌ రూ. 210. టైర్‌ కంపెనీల నుంచి డిమాండ్‌ పెరుగుతున్న తరుణంలో కంపెనీ సామర్ధ్య విస్తరణ పూర్తి చేసుకుంది. టైర్‌ రిప్లేస్‌మెంట్‌ మార్కెట్‌లో భారీ లబ్ది పొందనుంది. చైనా ఉత్పత్తులపై యాంటి డంపిగ్‌ డ్యూటీ తొలగించనంతవరకు కంపెనీ వ్యాపారంలో జోరు తగ్గదు. You may be interested

ఎయిర్‌టెల్‌, ఐడియాల షేర్లకు జియో షాక్‌

Friday 18th January 2019

రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ టెలికాం విభాగమైన రిలయన్స్‌ జియో క్యూ3లో భారీ లాభాలను ఆర్జించడంతో పాటు రుణభారాన్ని తగ్గించేందుకు నిధుల సమీకరణ ప్రణాళికలను సిద్ధం చేస్తున్నట్లు ప్రకటించడంతో ప్రత్యర్థి టెలికాం కంపెనీ షేర్లైన భారతీ ఎయిర్‌టెల్‌, వోడాఫోన్‌ ఐడియా షేర్లు నష్టాలబాట పట్టాయి.  జియో లాభాలు ఈ క్యూ3లో 65శాతం పెరిగి రూ.831 కోట్లకు చేరాయి. ముఖ్యంగా కస్టమర్ల సంఖ్య గణనీయంగా పెరిగింది. ఈ క్యూ2లో 16 కోట్లుగా వున్న వినియోగదారుల సంఖ్య ఈ క్యూ3

హెచ్‌యూఎల్‌ షేరుపై బ్రోకరేజ్‌ల అంచనాలు

Friday 18th January 2019

క్యు3లో అంచనాలకు మించిన ఫలితాలు ప్రకటించిన హెచ్‌యూఎల్‌పై ఎక్కువశాతం బ్రోకరేజ్‌లు పాజటివ్‌గా ఉన్నాయి. కొన్ని సంస్థలు మాత్రం న్యూట్రల్‌ ధృక్పధం వ్యక్తం చేశాయి. 1. సీఎల్‌ఎస్‌ఏ: అవుట్‌పెర్ఫామ్‌ రేటింగ్‌. టార్గెట్‌ రూ. 2010. కంపెనీ సైజుతో పోలిస్తే వాల్యూంల్లో 10 శాతం వృద్ధి సబబుగానే ఉంది. కంపెనీ రూరల్‌ డిమాండ్‌పై పాజిటివ్‌ కామెంట్స్‌ చేసింది. అనుకున్న ప్రణాళికలను సరిగ్గా అమలుచేయడం(ఎగ్జిక్యూషన్‌) కంపెనీకి కీలక పాజిటివ్‌ అంశం. రాబోయే రోజుల్లో ఎర్నింగ్స్‌లో 15

Most from this category