News


జనవరి సీరిస్‌ కోసం టాప్‌ టెన్‌ సిఫార్సులు

Monday 30th December 2019
Markets_main1577700887.png-30534

కొత్త సంవత్సరం తొలి నెల కోసం ప్రముఖ బ్రోకరేజ్‌లు పది షేర్లను రికమండ్‌ చేస్తున్నాయి.
ఐసీఐసీఐ డైరెక్ట్‌ రికమండేషన్లు
1. ఎస్‌బీఐ: కొనొచ్చు. టార్గెట్‌ రూ. 360. స్టాప్‌లాస్‌ రూ. 324. దీర్ఘకాలిక ఆరోహణ త్రిభుజాకృతి నుంచి బ్రేకవుట్‌ ఇచ్చేందుకు సిద్ధంగా ఉంది. రెండు వారాలుగా గత గ్యాప్‌ ఏరియా రూ. 321-325ను పరీక్షించి బలమైన మద్దతు బేస్‌ ఏర్పరుచుకుంది. త్వరలో గత పతనానికి 123.6 శాతం రిట్రేస్‌మెంట్‌ స్థాయిలకు ర్యాలీ జరిపేందుకు రెడీగా ఉంది. 
2. హిండాల్కో: కొనొచ్చు. టార్గెట్‌ రూ. 230. స్టాప్‌లాస్‌ రూ. 209. రెండేళ్ల ఫాలింగ్‌ ఛానెల్‌ నుంచి బ్రేకవుట్‌ సాధించింది. దీంతో కరెక‌్షన్‌ దశ ముగిసినట్లు సంకేతాలు ఇచ్చింది. గతవారం కన్సాలిడేషన్‌ ఓవర్‌బాట్‌ స్థితి సర్దుబాటుకు పనికివచ్చింది. ఇకపై మరో అప్‌ట్రెండ్‌ మొదలెట్టనుంది.
3. ఆర్‌పీజీలైఫ్‌: కొనొచ్చు. టార్గెట్‌ రూ. 340. స్టాప్‌లాస్‌ రూ. 296. పద్నాలుగు నెలల కన్సాలిడేషన్‌ రేంజ్‌ నుంచి బ్రేకవుట్‌ సాధించింది. ఇందుకు బలమైన వాల్యూంలు కూడా తోడయ్యాయి. గతవారం కొంత కన్సాలిడేషన్‌ చూసి మరలా అప్‌ట్రెండ్‌ కొనసాగించేందుకు సిద్ధమైంది.
రెలిగేర్‌ రికమండేషన్లు
1. బాటా ఇండియా: కొనొచ్చు. టార్గెట్‌ రూ. 1750. స్టాప్‌లాస్‌ రూ. 1675. రికార్డు గరిష్ఠాలను తాకి స్వల్పంగా వెనక్కు తగ్గింది. అనంతరం స్వల్పరేంజ్‌లో కన్సాలిడేట్‌ చెందింది. ఈ సమయంలో 100 రోజుల డీఎంఏ మద్దతును కోల్పోకుండా స్థిరంగా ఉంది. ఇకపై అప్‌మూవ్‌కు రెడీగా ఉంది.
2. ఇండస్‌ఇండ్‌బ్యాంక్‌: కొనొచ్చు. టార్గెట్‌ రూ. 1550. స్టాప్‌లాస్‌ రూ. 1495. అన్ని ప్రైవేట్‌బ్యాంకుల్లాగే బలంగా కదులుతోంది. కన్సాలిడేషన్‌ అనంతరం మరో బ్రేకవుట్‌ సాధించింది. కొత్త లాంగ్స్‌కు అనుకూలంగా ఉంది.
3. పీవీఆర్‌: కొనొచ్చు. టార్గెట్‌ రూ. 1960. స్టాప్‌లాస్‌ రూ. 1820. మూడు నెలలుగా రెండొందల రూపాయల రేంజ్‌లో స్థిరీకరణ జరిపింది. గతవారం బలమైన అప్‌బ్రేకవుట్‌ చూపింది. చార్టులన్నీ బుల్లిష్‌గా మారాయి.
యాక్సిస్‌ సెక్యూరిటీస్‌ రికమండేషన్లు
1. ఎల్‌అండ్‌టీ ఫైనాన్స్‌: కొనొచ్చు. టార్గెట్‌ రూ. 132. స్టాప్‌లాస్‌ రూ. 113. డైలీ చార్టుల్లో అప్‌ట్రెండ్‌ కొనసాగింపు సంకేతాలు ఇస్తోంది. 200 రోజుల డీఎంఏకు పైనే స్థిరంగా కదలాడడం పాజిటివ్‌ సంకేతం.
2. మైండ్‌ట్రీ: కొనొచ్చు. టార్గెట్‌ రూ. 830. స్టాప్‌లాస్‌ రూ. 765. వీక్లీ బ్రేకవుట్‌ జోన్‌కు పైన స్థిరంగా కొనసాగుతోంది. స్వల్ప, మధ్యకాలిక డీఎంఏలకు పైన కదలాడడం అప్‌ట్రెండ్‌ కొనసాగింపునకు సంకేతంగా భావించవచ్చు.
3. మనుప్పురం ఫైనాన్స్‌: టార్గెట్‌ రూ. 190. స్టాప్‌లాస్‌ రూ. 169. డైలీ చార్టుల్లో బ్రేకవుట్‌ చూపుతోంది. 20, 50 రోజుల డీఎంఏకు పైన కదలాడుతున్నందున పాజిటివ్‌ ధోరణి కొనసాగవచ్చు.
ఏంజల్‌ బ్రోకింగ్‌ రికమండేషన్లు
1. ఇండొకో రెమిడీస్‌: టార్గెట్‌ రూ. 211. స్టాప్‌లాస్‌ రూ. 162. ఐదు నెలల పాటు రూ. 135- 175 మధ్య కన్సాలిడేషన్‌ చెందింది. ఇటీవలే పైవైపునకు బ్రేకవుట్‌ సాధించింది. ఇది రెక్టాంగ్యులర్‌ ఛానెల్‌ బ్రేకవుట్‌గా పరిగణించవచ్చు. సూపర్‌ ట్రెండ్‌ ఇండికేటర్‌ పైన ధర ముగియడం పాజిటివ్‌ ధోరణికి నిదర్శనం. తాజాగా డీఎంఏ రేఖల్లో బుల్లిష్‌ క్రాసోవర్‌ ఏర్పడి మరింత అప్‌ట్రెండ్‌ సంకేతాలు ఇస్తోంది. You may be interested

అటూఇటుగా ముగిసిన మార్కెట్లు

Monday 30th December 2019

నిఫ్టీ లాభాల్లో- సెన్సెక్స్‌ నష్టాల్లో పీఎస్‌యూ బ్యాంక్స్‌ వెనకడుగు వరుసగా రెండో రోజు సోమవారం హుషారుగా ప్రారంభమైన దేశీ స్టాక్‌ మార్కెట్లు మిడ్‌సెషన్‌కంటే ముందుగానే వెనకడుగు వేశాయి. ఆపై చివరివరకూ స్వల్ప హెచ్చుతగ్గుల మధ్య కదిలాయి. ట్రేడింగ్‌ ముగిసేసరికి సెన్సెక్స్‌ 17 పాయింట్ల స్వల్ప నష్టంతో 41,558 వద్ద నిలవగా.. నిఫ్టీ 10 పాయింట్లు పుంజుకుని 12,256 వద్ద స్థిరపడింది. కాగా.. సెన్సెక్స్‌ తొలుత దాదాపు 150 పాయింట్లు ఎగసింది. 41,715 వద్ద

నెల్కో- ఎన్‌సీసీ హైజంప్‌

Monday 30th December 2019

వరుసగా రెండో రోజు హుషారుగా ప్రారంభమైన దేశీ స్టాక్‌ మార్కెట్లు తదుపరి అమ్మకాల ఒత్తిడిలో పడ్డాయి. ఒక దశలో లాభాలు పోగొట్టుకోవడంతోపాటు నష్టాలలోకి సైతం ప్రవేశించాయి. తదుపరి మిడ్‌సెషన్‌లో తిరిగి కొనుగోళ్లు కనిపించడంతో మిశ్రమంగా కదులతున్నాయి. మధ్యాహ్నం 3 ప్రాంతంలో సెన్సెక్స్‌ 3 పాయింట్ల నామమాత్ర నష్టంతో 41,572కు చేరగా.. నిఫ్టీ 13 పాయింట్లు పుంజుకుని 12,258 వద్ద ట్రేడవుతోంది. ఈ నేపథ్యంలోనూ రెండు మిడ్‌ క్యాప్‌ స్టాక్స్‌ ఇన్వెస్టర్ల

Most from this category