News


కొత్త ఏడాదికి టాప్‌ 10 సిఫార్సులు

Thursday 12th December 2019
Markets_main1576147197.png-30195

వచ్చేఏడాదిలో మంచి రాబడిని ఇచ్చే టాప్‌ 10 షేర్లను వివిధ బ్రోకరేజ్‌లు రికమండ్‌ చేస్తున్నాయి.
1. అలెంబిక్‌ ఫార్మా: బాబ్‌కాప్స్‌ రిసెర్చ్‌ నుంచి కొనొచ్చు రేటింగ్‌. టార్గెట్‌ రూ. 660. ఎర్నింగ్స్‌ మందకొడిగా ఉండడంతో నాలుగేళ్లుగా ఈ షేరు అంతంతమాత్రపు ప్రదర్శన చేస్తోంది. తాజాగా ఎర్నింగ్స్‌ సైకిల్‌ రివర్సల్‌ కనిపిస్తోంది. ఇది ఇకపై 3-4 ఏళ్లు కొనసాగవచ్చు. 2024-25 నాటికి ఎర్నింగ్స్‌ గ్రోత్‌ 20 శాతాన్ని దాటుతుందని అంచనా. ఇప్పటివరకు వెచ్చించిన మూలధన వ్యయాలు ఫలితాలు ఇవ్వడం ఆరంభం కానుంది. ఎర్నింగ్స్‌లో మెరుగుదల స్టాకు రీరేటింగ్‌కు దారి తీయవచ్చు.
2. హెచ్‌డీఎఫ్‌సీ ఏఎంసీ: హైటాంగ్‌ సంస్థ కొనొచ్చు రేటింగ్‌. టార్గెట్‌ రూ. 3435. దేశీయ ఏఎంసీ పరిశ్రమలో వచ్చే పాజిటివ్‌ మార్పులు ఒడిసిపట్టేందుకు రెడీగా ఉంది. కంపెనీ అధిక డివిడెండ్లు ఇస్తోంది. మూలధన అవసరాలు చాలా తక్కువగా ఉన్నాయి. రాబోయే సంవత్సరాల్లో ఆర్‌ఓఈలు 35-51 శాతం వరకు చేరతాయని అంచనా. 
3. ఎస్సెల్‌ప్రొప్యాక్‌: కొనొచ్చు. జేఎం ఫైనాన్షియల్స్‌ కొనొచ్చు రేటింగ్‌. టార్గెట్‌ రూ. 190. కంపెనీలో ఇటీవల బ్లాక్‌స్టోన్‌ మెజార్టీ వాటా కొనుగోలు చేయడం మూలధన అవసరాలను తీర్చనుంది. తాజాగా బోర్డును పూర్తిగా పునర్వ్యస్థీకరించారు. రాబోయే సంవత్సరాల్లో ఎర్నింగ్స్‌లో 17.6 శాతం చక్రీయ వార్షిక వృద్ధి ఉండొచ్చని అంచనా. 
4. ఫ్యూచర్‌ రిటైల్‌: హెచ్‌డీఎఫ్‌సీ సెక్యూరిటీస్‌ కొనొచ్చు రేటింగ్‌. టార్గెట్‌ రూ. 500. కంపెనీకి ఉన్న బలమైన స్టోర్‌ నెట్‌వర్క్‌ కీలకమైన ఆదాయ వనరు. రాబోయే రోజుల్లో ఇది మరింత విస్తృతం కానుంది. బిగ్‌బజార్‌, ఎఫ్‌బీబీ, ఈజీడే తదితరాలు లాభాలనందిస్తాయి. 
5. ఆదిత్య బిర్లా ఫ్యాషన్‌: హెచ్‌డీఎఫ్‌సీ సెక్యూరిటీస్‌ కొనొచ్చు రేటింగ్‌. టార్గెట్‌ రూ. 250. కంపెనీ పోర్టుఫోలియో వివిధ ఆదాయ వర్గాలను ఆకట్టుకునేలా ఉంటుంది. కంపెనీకి విస్తృతమైన అపెరల్‌ రిటైల్‌ స్టోర్లున్నాయి. కంపెనీ ఆదాయంలో 14 శాతం చక్రీయ వార్షిక వృద్ధి ఉంటుందని అంచనా. 
6. కోటక్‌ మహీంద్రా: బాబ్‌కాప్స్‌ కొనొచ్చు రేటింగ్‌. టార్గెట్‌ రూ. 1950. బ్యాంకు లయబిలిటీ ప్రొఫైల్‌ చాలా బాగుంది. బ్యాంకు ఫండ్స్‌ వ్యయాలు బడా బ్యాంకులతో సరిపోల్చేస్థాయికి చేరాయి. స్థిరమైన అసెట్‌క్వాలిటీ మరో పాజిటివ్‌ అంశం. 
7. ఎంఅండ్‌ఎం: హెచ్‌డీఎఫ్‌సీ సెక్యూరిటీస్‌ న్యూట్రల్‌ రేటింగ్‌. టార్గెట్‌ రూ. 570. దశాబ్ద కాలంగా పీవీ పరిశ్రమలో ఆధిపత్యం చూపింది. ఇకపై ఎస్‌యూవీల వృద్ధి రేటు కొంత మందగించవచ్చు. ఈ విభాగంలో పోటీ కూడా ఎక్కువైంది. దీంతో ఆటోమోటివ్‌ విభాగంలో ఒత్తిడి పెరగవచ్చు. ట్రాక్టర్ల డిమాండ్‌ పుంజుకోవడం కొంతమేర కలిసివస్తుంది. కొత్త ఉత్పత్తులకు వచ్చే స్పందనను బట్టి తదుపరి రేటింగ్‌ ఉంటుంది.
8. గుజరాత్‌ స్టేట్‌పెట్రోనెట్‌: నిర్మల్‌బ్యాంగ్‌ కొనొచ్చు రేటింగ్‌. టార్గెట్‌ రూ. 303. కంపెనీ ఎర్నింగ్స్‌లో రాబోయే రోజుల్లో 10- 14 శాతం చక్రీయ వార్షిక వృద్ది ఉంటుంది. వాల్యూంలు కూడా బలంగా పెరుగుతాయని అంచనా. 
9. లెమన్‌ట్రీ: ఐడీబీఐ క్యాపిటల్‌ కొనొచ్చు రేటింగ్‌. టార్గెట్‌ రూ. 85. మిడ్‌లెవల్‌ హోటల్‌ విభాగంలో అగ్రగామిగా ఉంది. నయా వ్యాపార మోడల్స్‌ అభివృద్ధి చేయడం, కొత్త ఇన్వెంటరీని కలపడం, కీస్‌ హోటల్స్‌ను కొని మరింత విస్తరించడం, ఔరికా బ్రాండ్‌ ద్వారా అధికవిలువైన ఉత్పత్తుల విభాగంలో కాలుమోపడం.. షేరు ఎర్నింగ్స్‌ను పరుగులు పెట్టిస్తాయి. దీంతో రాబోయే రోజుల్లో ఎబిటా 22.6 శాతం మేర చక్రీయ వార్షిక వృద్ది నమోదు చేస్తుందని అంచనా. 
10. సుదర్శన్‌ కెమికల్స్‌: ఐఐఎఫ్‌ఎల్‌ సెక్యూరిటీస్‌ కొనొచ్చు రేటింగ్‌. టార్గెట్‌ రూ. 500. క్రమానుగతంగా మార్కెట్‌ వాటా కొల్లగొట్టి ప్రస్తుతం ప్రపంచంలో నాలుగవ అతిపెద్ద కలర్‌ పిగ్మెంట్‌ ఉత్పత్తిదారుగా అవతరించింది. రెండు బడా కంపెనీలు వ్యాపారం నుంచి విరమించుకోవడం కంపెనీకి కలిసిరానుంది. ఉత్పాదన వ్యయాలు తక్కువగా ఉండడం, విస్తృత పోర్టుఫోలియో కంపెనీ బలాలు. రాబోయే రోజుల్లో 30 శాతం ఈపీఎస్‌ వృద్ధి ఉండవచ్చు. You may be interested

ఉజ్జీవన్‌ స్మాల్‌ ఫైనాన్స్‌ బ్యాంకు.. మీ స్ట్రాటజీ ఏంటి?

Friday 13th December 2019

ఉజ్జీవన్‌ స్మాల్‌ ఫైనాన్స్‌ బ్యాంకు ఐపీవోలో ఒక్కో షేరును రూ.37కు జారీ చేయగా, లిస్టింగ్‌లోనే 50 శాతం లాభాలను ఇచ్చింది. బీఎస్‌ఈలో రూ.55.90 వద్ద ముగిసింది. ఐపీవోలో షేర్లు అలాట్‌ అయిన ఇన్వెస్టర్లు ప్రస్తుత ధరలో అమ్మేసుకోవాలా? ఐపీవోలో షేర్లు దక్కని వారు ప్రస్తుత ధరలో కొనుగోలు చేసుకోవచ్చా..? లేక వేచి చూడాలా? నిపుణులు ఏమంటున్నారో చూద్దాం..   దీర్ఘకాలం కోసం అయితే ఉజ్జీవన్‌ స్మాల్‌ ఫైనాన్స్‌ బ్యాంకు షేరును హోల్డ్‌ చేసుకోవచ్చని

రెండోరోజూ అదే జోరు

Thursday 12th December 2019

11950 పైన ముగిసిన నిఫ్టీ  169  పాయింట్లు పెరిగిన సెన్సెక్స్‌ మెటల్‌, బ్యాంకింగ్‌ రంగ షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభించడంతో సూచీల జోరు రెండోరోజూ కొనసాగింది. సెన్సెక్స్‌ 169 పాయింట్లు పెరిగి 40582 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 61 పాయింట్లు లాభపడి 11950పై 11,972 వద్ద ముగిసింది. రూపాయి బలపడటంతో ఒక్క ఐటీ రంగ షేర్లకు తప్ప మిగిలిన​అన్ని రంగాల షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభించింది. అత్యధికంగా మెటల్‌ షేర్లు లాభపడ్డాయి. బ్యాంకింగ్‌

Most from this category