News


రూపాయి పతనంతో ర్యాలీ చేసే షేర్లివే..!

Friday 23rd August 2019
Markets_main1566551683.png-27974

డాలర్‌ మారకంలో రూపాయి విలువ శుక్రవారం ట్రేడింగ్‌లో 8నెలల కనిష్టానికి క్షీణించింది. ఈ ఆగస్ట్‌లో ఇప్పటికి 4.6శాతం నష్టపోయింది.  సుమారు ఆరేళ్ల అనంతరం ఒకనెలలో ఇంత శాతం పతనం కావడం ఇదే తొలిసారి కావడం గమనార్హం. చైనా కరెన్సీ యువాన్‌ 11 ఏళ్ల కనిష్టానికి చేరుకోవడంతో వర్థమాన దేశీయ కరెన్సీలపై తీవ్ర ఒత్తిడిని పెంచుతోంది. రూపాయి క్షీణత దేశీయ ఆర్థిక వ్యవస్థకు  శుభపరిణామం కాదు. ఈక్విటీ మార్కెట్‌ నుంచి విదేశీ ఇన్వెస్టర్లు తమ పొజిషన్ల ఉపసహరించునేందుకు ప్రేరేపిస్తుంది. వాణిజ్య యుద్ధ ఉద్రికత్తలు, దేశీయ ఆర్థిక వ్యవస్థలో బలహీనత, కార్పోరేట్‌ కంపెనీలు ఆదాయాలు ఆశించిన స్థాయిలో నమోదు కాకడపోవడం లాంటి ‍ప్రతికూల పరిణామాల నేపథ్యంలో రూపాయి క్షీణత దేశీయ ఈక్విటీ మార్కెట్‌ నుంచి విదేశీ నిధుల ప్రవాహాన్ని మరింత తీవ్రతరం చేస్తుంది. రూపాయి 8నెలల కనిష్టస్థాయిలో ట్రేడ్‌ అవుతున్న తరుణంలో డాలర్‌ మారకంలో ఆదాయాలను ఆర్జించే ఐటీ, ఔషధ రంగ షేర్లకు కలిసొస్తుందని బ్రోకరేజ్‌ సంస్థలు అభిప్రాయపడుతున్నాయి. ఈ నేపథ్యంలో పలు బ్రేకరేజ్‌ సంస్థలు 10స్టాక్స్‌ను కొనవచ్చంటూ ఇన్వెస్టర్లకు సిఫార్సు చేస్తున్నాయి.
రిలిగేర్‌ బ్రోకరేజ్‌ సిఫార్సులు:- 
1.ఇన్ఫోసిస్‌:- కంపెనీ స్థిరమైన పనితీరు, బలమైన మేనేమెంట్‌, ఐటీ రంగంపై పాజిటివ్‌ అవుట్‌లుక్‌, స్థిరమైన దీర్ఘకాలిక వృద్ధి అవకాశాలు పుష్కలంగా ఉండటం బ్రోకరేజ్‌ సం‍స్థ ఇన్ఫోసిస్‌ షేర్లను సిఫార్సు చేస్తుంది.‘‘ కంపెనీ స్వల్పకాలిక సవాళ్లను కలిగిఉన్నప్పటికీ.., రూపాయి బలహీనపడటం, పాజిటివ్‌ మేనేజ్‌మెంట్ పనితీరు, అధిక మొత్తంలో ఆర్డర్ల, వాటాదారులకు అధిక చెల్లింపు లాంటి సానుకూల అంశాలు దీర్ఘకాలంలో షేర్లకు కలిసొచ్చే అంశాలు’’ అని రిలిగేర్‌ బ్రోకరేజ్‌ సంస్థ వైస్‌ ప్రెసిడెంట్‌ అజిత్‌ మిశ్రా తెలిపారు.
2.టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్(టీసీఎస్‌):- దేశంలో ఐటీ రంగంలో అతిపెద్ద కంపెనీగా పేరోందిన టీసీఎస్‌ బీఎఫ్‌ఎస్‌ఐ, తయారీ, టెలికాం, రిటైల్‌, ట్రాన్స్‌పోర్టేషన్‌, ఇన్సూరెన్స్‌ లాంటి రంగాలకు సాంకేతిక సేవలు అందిస్తోంది. సుమారు 50 దేశాల్లో 4.2లక్షల కన్సల్టెంట్లను కలిగి ఉంది. తన మొత్తం ఆదాయంలో ఒక్క నార్త్‌ అమెరికా నుంచే 51శాతం రెవెన్యూ వస్తోంది. ‘‘గత పదేళ్ల నుంచి విదేశీ ఐటీ సేవలకు డిమాండ్‌ పెరుగుతున్న అందిపుచ్చుకోవడంలో కంపెనీ ముందువరుసగా ఉందని మేము నమ్ముతున్నాం. అంతేకాకుండా ఐటీ రంగంలో కంపెనీ ఉంటే అపార అనుభవం, బలమైన క్లైయింట్ల విస్తృతి భవిష్యత్తులో ఐటీ రంగంలో తన అగ్రస్థానాన్ని కొనసాగించడానికి ఉపకరిస్తాయి’’ అని మిశ్రా తెలిపారు.
3.విప్రో లిమిటెడ్‌:- రూపాయి బలహీనత లాభపడే కంపెనీల్లో విప్రో లిమిటెడ్‌ ఒకటి. రూపాయి తరుగుదల ప్రభావం ప్రతి కంపెనీ హెడ్జింగ్ విధానం, ఆఫ్‌షోరింగ్ వ్యాపారం నిష్పత్తిపై ఆధారపడి ఉంటుంది. అంతే కాకుండా, ఒక సంస్థలో పెట్టుబడులు పెట్టడానికి ఇతర ప్రాథమిక అంశాలు కూడా ముఖ్యమైనవి "అని మిశ్రా అభిప్రాయపడ్డారు. యూరప్‌లో బీఎఫ్‌ఎస్‌ఐ, తయారీ రంగం బలహీనత నెలకొన్న నేపథ్యంలో స్వల్పకాలిక సవాళ్లు కొంతకాలం పాటు  కొనసాగుతాయని మిశ్రా అభిప్రాయపడ్డారు. అయితే డిజిటల్‌ వ్యాపారంలో కంపెనీ ప్రదర్శన ఆశాజనకంగానే ఉందని మిశ్రా తెలిపారు. కంపెనీ రూ.20వేల కోట్ల నగదు బ్యాలెన్స్‌ను కొనసాగిస్తుండంతో పాటు బలమైన నగదు ప్రవాహం కలిగి ఉంది. అలాగే తన పీర్‌ కంపెనీలతో పోలిస్తే డిస్కౌంట్‌లో ట్రేడ్‌ అవుతుందని కంపెనీ మిశ్రా తెలిపారు. 
బీపీ ఈక్విటీస్‌ సిఫార్సులు:- 
4.దివీస్‌ ల్యాబ్స్‌:- కంపెనీకి విదేశీ మారకపు రుణంకానీ, భవిష్యత్‌ ఆదాయాలను హెడ్జ్‌ చేయలేదు. కంపెనీకి వచ్చే మొత్తం ఆదాయంలో 70శాతం విదేశాల నుంచే వస్తుంది.కంపెనీ తన ఉత్పత్తులను ఎక్కువగా విదేశాలకు ఎగుమతి చేస్తున్న నేపథ్యంలో రూపాయి క్షీణత... అమ్మకాలు, మార్జిన్లకు తోడ్పడుతుంది
5.సన్‌ ఫార్మా:- క్యూ2లో రూపాయి క్షీణత కారణంగా  కంపెనీ రూ .67.4 కోట్ల లాభం పొందింది. అంతకుముందు ఇదే క్యూ1లో రూ.90 కోట్ల నష్టాన్ని మూటగట్టుకుంది. కంపెనీ విదేశీ మారక రుణం రూ .6,422 కోట్లు గానూ,  ఆదాయంలో నికర విదేశీ ఎక్స్‌పోజర్స్‌ 60-65శాతంగా ఉంది. రూపాయి క్షీణత అమ్మకాలను పెంచడంతో పాటు మార్జిన్లు పెరుగుతాయి.
ఆనంద్‌ రాఠి సిఫార్సులు:- 
6.ఎంఫసీస్‌:- అప్లికేషన్ డెవలప్‌మెంట్ మెయింటెనెన్స్, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ అవుట్‌సోర్సింగ్,  బిజినెస్ అండ్ నాలెడ్జ్ ప్రాసెస్ అవుట్‌సోర్సింగ్‌లో సంస్థకు నైపుణ్యం ఉంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం క్యూ1లో కంపెనీ ప్రత్యక్ష అంతర్జాతీయ వ్యాపారంలో 151మిలియన్ డాలర్ల విలువై ఆర్డర్లను దక్కించుకుంది. రూపాయి బలహీనత కారణంగా కంపెనీకి ఆర్డర్లు పెరగడంతో పాటు మార్జిన్లలో మెరుగుదల ఉంటుందని బ్రోకరేజ్‌ సంస్థ భావిస్తోంది.
7.బయోకాన్‌:- రూపాయి క్షీణత కారణంగా రాబోయే రెండేళ్ళలో బయోసిమిలార్ కమర్షియల్‌ ప్రయోజనాలను కంపెనీ పొందుతుంది. ఇది కంపెనీ అధిక ఆదాయాలు, మార్జిన్లను మరింతపెంచుతుంది" అని బ్రోకరేజ్ తెలిపింది.
సామ్‌కో సెక్యూరిటీస్‌:- 
8.బాలక్రిష్ణ ఇండస్ట్రీస్:- ఆఫ్‌-హైవే టైర్ల తయారీ రంగంలో అగ్రస్థానంలో కొనసాగుతుంది. బలమైన ఫండమెంటల్‌ ప్రోఫైల్‌ కలిగి ఉంది. ఆఫ్‌-హైవే టైర్ల పరిశ్రమలో 6 శాతం మార్కెట్ వాటా కలిగి ఉంది.
9.ఫైన్‌ ఆర్గానిక్స్‌:- కంపెనీ మొత్తం ఆదాయంలో 60శాతం ఎగుమతుల ద్వారా వస్తున్న నేపథ్యంలో ఆర్గానిక్స్ రూపాయి క్షీణత వల్ల లాభం పొందే అవకాశం ఉందని బ్రోకరేజ్‌ సంస్థ తెలిపింది.
10.ఇండో కౌంట్ ఇండస్ట్రీస్:- తన ఉత్పత్తులను 54 దేశాలకు ఎగుమతి చేస్తుంది.కరెన్సీ హెచ్చుతగ్గుల సమయంలో ఎక్కువ ప్రయోజనం పొందుతుందని బ్రోకరేజ్‌ సంస్థ చెప్పుకొచ్చింది.You may be interested

ఉద్దీపనల కోసం పీఎంఓతో ఆర్థిక శాఖ మంతనాలు?

Friday 23rd August 2019

ఆర్థిక వ్యవస్థ తిరిగి పుంజుకోడానికి ప్రభుత్వం ఉద్దీపన ప్యాకేజీతో సిద్ధమవుతోందని, కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ క్యాపిటల్‌ మార్కెట్‌, ఆటో, రియల్‌ ఎస్టేట్‌, చిన్న, మధ్యతరహా పరిశ్రమలు(ఎస్‌ఎంఈ) వంటి నాలుగు కీలకమైన సెక్టార్‌లలో పాలసీలను తీసుకురావలని పీఎంఓతో మంతనాలు జరుపుతున్నారని వార్తలు వెలువడ్డాయి. ఈ వార్త వెలువడిన తర్వాత పతనంలో ఉన్న మార్కెట్లు తిరిగి కోలుకోవడం గమనార్హం. మధ్యాహ్నాం 2.32 సమయానికి నిఫ్టీ 110 పాయింట్లు లాభపడి

నిఫ్టీ, సెన్సెక్స్‌ టార్గెట్‌లను తగ్గించిన బ్రోకరేజిలు

Friday 23rd August 2019

సెన్సెక్స్‌, నిఫ్టీ లాభాలు నిరాశపరచడంతో పాటు, ఆర్థిక మందగమనం వలన ఇన్వెస్టర్లకు ఇండియాపై దృక్పథం మారుతుండడంతో నిఫ్టీ, సెన్సెక్స్‌ టార్గెట్‌ అంచనాలను ప్రముఖ బ్రోకరేజి సంస్థలు తగ్గించాయి. నిఫ్టీ లాభాలు, అంచనాలను అందుకోలేకపోవడంతో నిఫ్టీ మార్చి 2020 టార్గెట్‌ను నోమురా 12,900 నుంచి 11,880కి తగ్గించింది. ‘ప్రస్తుత ఫలితాల సీజన్లో లాభాల వృద్ధి తగ్గుముఖం పట్టింది. ఆర్థిక సంవత్సరం 2019 ప్రారంభం నుంచి ఆర్థిక సంవత్సరం 2020-21లో నిఫ్టీ లాభాలు

Most from this category