News


స్వల్పకాలానికి షార్ట్‌టర్మ్‌ ఐడియాలు

Monday 15th April 2019
Markets_main1555322860.png-25142

వచ్చే రెండుమూడు వారాల్లో మంచి రాబడినందించే పది స్టాకులను వివిధ అనలిస్టులు రికమండ్‌ చేస్తున్నారు.
ప్రభుదాస్‌ లీలాధర్‌ సిఫార్సులు
1. దిలీప్‌ బుల్డ్‌కాన్‌: కొనొచ్చు టార్గెట్‌ రూ. 725. స్టాప్‌లాస్‌ రూ. 610. కొద్దికాలంగా స్థిరంగా రూ. 620 వద్ద కన్సాలిడేట్‌ అవుతోంది. చార్టుల్లో బుల్లిష్‌ క్యాండిల్‌ ఏర్పడింది, వాల్యూంలు అప్‌మూవ్‌కు అనుకూలంగా ఉన్నాయి. ఆర్‌ఎస్‌ఐ ట్రెండ్‌ రివర్సల్‌ చూపుతోంది.
2. మారుతీ సుజుకీ: కొనొచ్చు. టార్గెట్‌ రూ. 7700. స్టాప్‌లాస్‌ రూ. 7150. ఇటీవలే స్వల్పకాలిక రేంజ్‌ నుంచి పాజిటివ్‌ బ్రేకవుట్‌ సాధించింది. ఇంకడేటర్లు మరింత అప్‌మూవ్‌ను సూచిస్తున్నాయి.
చార్ట్‌వ్యూ ఇండియా సిఫార్సులు
1. అశోక్‌ లేలాండ్‌: కొనొచ్చు. టార్గెట్‌ రూ. 107. స్టాప్‌లాస్‌ రూ. 90. గత ర్యాలీకి 62 శాతం రిట్రేస్‌మెంట్‌ శాతం వరకు పతనమైన షేరు తిరిగి బలం పుంజుకుంది. రూ. 95పైన క్లోజవడం మరింత ర్యాలీని సూచిస్తోంది.
2. డాబర్‌: కొనొచ్చు. టార్గెట్‌ రూ. 427. స్టాప్‌లాస్‌ రూ. 398. తొమ్మిది రోజులు ఫ్లాట్‌గా ట్రేడవుతూ రూ. 399 వద్ద బాటమ్‌ ఏర్పరుచుకుంది. ఇకపై గణనీయమైన పుల్‌బ్యాక్‌ను చూపుతుంది.
ఆనంద్‌ రాఠీ సిఫార్సులు
1. టీవీఎస్‌ మోటర్స్‌: కొనొచ్చు. టార్గెట్‌ రూ. 515. స్టాప్‌లాస్‌ రూ. 480. డైలీ చార్టుల్లో హయ్యర్‌టాప్స్‌ బాటమ్స్‌ ఏర్పరుస్తోంది. ఇకపై మరో మారు  5వేవ్‌ అప్‌మూవ్‌ చూపించవచ్చు.
2. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌: కొనొచ్చు. టార్గెట్‌ రూ. 2350. స్టాప్‌లాస్‌ రూ. 2195. వేవ్‌ సిద్ధాంతం ప్రకటారం 4వేవ్‌ కరెక‌్షన్‌ పూర్తి చేసింది. తాజాగా ఐదో వేవ్‌ అప్‌మూవ్‌ చూపుతుంది.
3. ఇమామీ: కొనొచ్చు. టార్గెట్‌ రూ. 430. స్టాప్‌లాస్‌ రూ. 385. డౌన్‌ట్రెండ్‌ నిరోధ రేఖ నుంచి పాజిటివ్‌ బ్రేకవుట్‌ సాధించింది. ఎంఏసీడీ ఇండికేటర్‌ పాజిటివ్‌ సంకేతాలు ఇస్తోంది. 
హెచ్‌డీఎఫ్‌సీ సెక్యూరిటీస్‌ సిఫార్సులు
1. మారుతీ సుజుకీ: కొనొచ్చు. టార్గెట్‌ రూ. 8వేలు. స్టాప్‌లాస్‌ రూ. 6880. తాజాగా బాటమ్‌ అవుట్‌సాధించింది. చార్టుల్లో త్రిభుజాకృతి నుంచి పాజిటివ్‌ బ్రేకవుట్‌ చూపుతోంది. 
2. లుపిన్‌: కొనొచ్చు. టార్గెట్‌ రూ. 905. స్టాప్‌లాస్‌ రూ. 785. డౌన్‌ట్రెండ్‌ ముగిసినట్లు కనిపిస్తోంది. రూ. 720 వద్ద బలమైన బాటమ్‌అవుట్‌ ఏర్పరిచింది. ఆర్‌ఎస్‌ఐ తదితర ఇండికేటర్లు అప్‌మూవ్‌ను సూచిస్తున్నాయి.
రిలయన్స్‌ సెక్యూరిటీస్‌ సిఫార్సులు
1. అజంతా ఫార్మా: కొనొచ్చు. టార్గెట్‌ రూ. 1120. స్టాప్‌లాస్‌ రూ. 985. కొద్ది రోజులుగా దిగువన బేస్‌ ఏర్పరుచుకుంటోంది. టెక్నికల్‌ ఇండకేటర్లన్నీ అప్‌మూవ్‌ను చూపుతున్నాయి.
2. ఎంఅండ్‌ఎం: కొనొచ్చు. టార్గెట్‌ రూ. 750. స్టాప్‌లాస్‌ రూ. 625. చాలా రోజలు పతనం చవిచూసి రూ. 615 వద్ద లో ఏర్పరుచుకుంది. తాజాగా ఆర్‌ఎస్‌ఐ, ఎంఏసీడీలు పాజిటివ్‌ సంకేతాలు చూపుతూ బ్రేకవుట్‌కు రెడీగా ఉంది. You may be interested

11770 పాయింట్లను తాకేందుకే ఛాన్స్‌లెక్కువ!

Monday 15th April 2019

నిఫ్టీపై కోటక్‌ సెక్యూరిటీస్‌ గతవారం మొత్తం నిఫ్టీ దాదాపు ప్రతిరోజూ 11600 పాయింట్ల దిగువకు వచ్చి 11550 పాయింట్ల మద్దతును కోల్పోయేందుకే యత్నించింది. కానీ బుల్స్‌ తీవ్రంగా ఈ పతనాలను అడ్డుకొన్నారు. టాటామోటర్స్‌, మారుతీ, ఐటీసీ, హెచ్‌యూఎల్‌, సిప్లా లాంటి షేర్ల అండతో సూచీలు రికవరీ బాట పట్టాయి. ఆర్‌ఐఎల్‌, హెచ్‌డీఎఫ్‌సీ కవలలు లాంటి బడా దిగ్గజాలు సైతం నిఫ్టీకి అండగా నిలిచాయి. దీంతో ఈ వారం తిరిగి నిఫ్టీ పాజిటివ్‌

సంక్షోభాన్ని ప్రతిబింబించని జెట్‌ షేరు... ఎందుకు?

Monday 15th April 2019

సాధారణంగా సంక్షోభాల్లో ఉన్న కంపెనీల షేర్లు డీలా పడి ట్రేడవుతుంటాయి. కంపెనీలో ఇబ్బందులన్నీ సదరు షేరు ధరలో ప్రతిబింబిస్తుంటాయి. కానీ ఇందుకు విరుద్ధంగా జెట్‌ ఎయిర్‌వేస్‌ షేరు మాత్రం భిన్నంగా ప్రవర్తిస్తోంది. ఒకపక్క కంపెనీ తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటుండగా, షేరు మాత్రం ఒక మోస్తరు కరెక‌్షన్‌ మాత్రమే చవిచూసింది. అసలు కంపెనీ ఉంటుందా? మూతపడుతుందా? అన్న సంశయాలు నడుస్తున్న వేళ షేరు మాత్రం గత రెండు వారాల్లో దాదాపు 2.3

Most from this category