News


ఇవి మల్టీ బ్యాగర్లేనా..?

Friday 18th October 2019
Markets_main1571337601.png-28959

మిడ్‌క్యాప్‌, స్మాల్‌క్యాప్‌ విభాగం గణనీయంగా దిద్దుబాటుకు గురైన ఈ తరుణంలో.. ఓ స్టాక్‌ను జాగ్రత్తగా ఎంపిక చేసుకుని పెట్టుబడి పెట్టడం వల్ల రానున్న కాలంలో మల్టీబ్యాగర్‌గా మారొచ్చేమో..?! కాకపోతే ఇదంతా ఎంపికలోనే ఉంటుంది. మల్టీబ్యాగర్‌ అయ్యే స్టాక్స్‌ను గుర్తించడం ఎలా..? అన్న సందేహం చాలా మందికి ఉంటుంది. ఇప్పటికే మల్టీబ్యాగర్‌ రిటర్నులు ఇచ్చిన వాటిని పరిశీలిస్తే కొంత మేరకు అర్థం చేసుకోవచ్చు.

 

సహ్‌యోగ్‌ మల్టీబేస్‌. గత దీపావళి నుంచి ఇప్పటికి 1,755 శాతం పెరిగింది. ఈ కంపెనీలో విదేశీ ఇన్వెస్టర్లకూ వాటాలు ఉన్నాయి. సెప్టెంబర్‌ త్రైమాసికం నాటికి ఎఫ్‌పీఐలకు 1.38 శాతం వాటా ఉంది. ప్లాస్టిక్‌, కెమికల్స్‌ రా మెటీరియల్‌, పాలీమర్స్‌, పెట్రోకెమికల్స్‌ వ్యాపారంలో ఈ కంపెనీ కార్యకపాలాలు నిర్వహిస్తోంది. గతేడాది నవంబర్‌ 7న ఈ స్టాక్‌ ధర రూ.11.70. ప్రస్తుత ధర రూ.222. ఇప్పటికీ ఈ కంపెనీ మార్కెట్‌ విలువ కేవలం రూ.177 కోట్లే. కానీ, ప్రమోటర్లకు కేవలం 5 శాతం వాటాలే ఉండడం చిన్న ఇన్వెస్టర్లకు ఆందోళన  కలిగించే అంశం. సహ్‌యోగ్‌ మల్టీబేస్‌ మాదిరే భారీ రిటర్నులు ఇచ్చిన స్మాల్‌క్యాప్‌ స్టాక్స్‌ మరికొన్ని కూడా ఉన్నాయి. వీటి మార్కెట్‌ క్యాప్‌ రూ.2,000 కోట్ల లోపే ఉండగా, వీటిల్లో విదేశీ ఇన్వస్టర్లకూ వాటాలు ఉన్నాయి. 

 

పయోనీర్‌ ఇన్వె‍స్ట్‌కార్ప్‌ అనే ఫైనాన్షియల్‌ సేవల కంపెనీ కూడా గత ఏడాది కాలంలో 106 శాతం రాబడులను ఇచ్చింది. దేశీయ మార్కెట్లు తీవ్ర అస్థిరతలు, పతనాలను చవిచూసిన కాలంలో ఈ కంపెనీలు ఈ స్థాయి ప్రదర్శను చూపించడాన్ని ఇన్వెస్టర్లు గమనించాలి. బీఎస్‌ఈ స్మాల్‌ క్యాప్‌ 13 శాతం, మిడ్‌క్యాప్‌ 10 శాతం మేర ఇప్పటికీ ఈ ఏడాది ఆరంభం నుంచి నష్టపోయాయి. ఇక గత దీపావళి నుంచి ఇప్పటి వరకు అధిక రాబడులు ఇచ్చిన వాటిల్లో ఐయాన్‌ ఎక్సేంజ్‌ (78 శాతం), సీమెక్‌ (47 శాతం), హెస్టెర్‌ బయోసైన్సెస్‌ (46 శాతం), జోడియాక్‌ క్లాతింగ్‌ (44 శాతం), 63మూన్స్‌ (41 శాతం), పైసలో డిజిటల్‌ (39 శాతం), అమృతాంజన్‌ హెల్త్‌కేర్‌ (38 శాతం), ఎలాంటాస్‌ బెక్‌ ఇండియా (34 శాతం) ఉన్నాయి. ఈ కంపెనీల్లో కొన్ని వ్యాల్యూ ఇన్వెస్టర్లు నచ్చినవీ ఉన్నాయి. ఎలాంటాస్‌ బెక్‌ ఇండియాలో అన్మోల్‌ శెఖ్రి 1.10 శాతం వాటా కలిగి ఉన్నారు. ఐయాన్‌ ఎక్సేంజ్‌లో రాకేశ్‌ జున్‌జున్‌వాలాకు 5 శాతం వాటాల ఉన్నాయి. ఐయాన్‌ ఎక్సేంజ్‌, హెస్టెర్‌ బయోసైన్సెస్‌, అమృతాంజన్‌లో విదేశీ ఇన్వెస్టర్లు వాటాలు పెంచుకున్నారు. 



You may be interested

మూడు రంగాలపై హెచ్‌డీఎఫ్‌సీ సెక్‌ బుల్లిష్‌

Friday 18th October 2019

ఆయిల్‌ అండ్‌ గ్యాస్‌, బ్యాంకింగ్‌ అండ్‌ ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌, డిజిటల్‌/ఇంటర్నెట్‌ కంపెనీలపై హెచ్‌డీఎఫ్‌సీ సెక్యూరిటీస్‌ బుల్లిష్‌గా ఉంది. అదే సమయంలో మెటల్స్‌, రియల్టీ, హెల్త్‌కేర్‌ రంగాల పట్ల ప్రతికూల ధోరణితో ఉంది. హెచ్‌డీఎఫ్‌సీ సెక్యూరిటీస్‌ ఎండీ, సీఈవో ధీరజ్‌రెల్లి ఓ వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు అంశాలపై తన అభిప్రాయాలను వెల్లడించారు.    సమీప కాలంలో సూచీలు కాస్త పెరగొచ్చు. కంపెనీల ఫలితాలతోపాటు వచ్చే వ్యాఖ్యలు ఆశావహంగా లేకపోతే మరోసారి అధిక

బ్యాంకింగ్‌..బ్రెగ్జిట్‌...సూచీలకు భారీ లాభాలు.!

Thursday 17th October 2019

ఫైనాన్షియల్‌ షేర్లలో జోరుగా కొనుగోళ్లు సాగడంంతో దేశీయ మార్కెట్‌ గురువారం భారీ లాభంతో ముగిసింది. సెన్సెక్స్‌ 453 పాయింట్లు లాభపడి 39000ల పైన 39,052.06 వద్ద ముగిసింది. నిఫ్టీ 122 పాయింట్ల పెరిగి 11,586.35 వద్ద ముగిసింది. సెప్టెంబర్‌ 24 తరువాత సూచీలు ఈ స్థాయి వద్ద ముగియడం ఇదే తొలిసారి. మార్కెట్‌ మరో అరగంటలో ముగిస్తుందనే తరుణంలో బ్రెగ్జిట్‌ డీల్‌ కుదిరినట్లు బ్రిటన్‌ ప్రధాని బోరిస్‌ జాన్సస్‌ ప్రకటించడంతో మార్కెట్లో

Most from this category