News


పదేళ్ల కోసం పది స్టాక్స్‌

Monday 17th June 2019
Markets_main1560794831.png-26360

ఈ రోజు చెట్టు నీడలో సేద తీరుతున్నారంటే ఎన్నో ఏళ్ల క్రితం ఎవరో ఒకరు ఆ చెట్టును నాడడం వల్లే కదా... అలాగే, పదేళ్ల క్రితమే స్టాక్స్‌ను కొనుగోలు చేసి ఉంటే, అవి మంచి వ్యాపారాలు, యాజమాన్యాల చేతుల్లో ఉన్నవి అయితే, ఈ పాటికి ఎన్నో రెట్ల ప్రతిఫలం ఇచ్చి ఉండేవి. అలాగే, మరో పదేళ్లు, అంతకంటే ఎక్కువ కాలం దృష్టితో ఇప్పుడే పెట్టుబడి పెట్టాలనుకునే వారి కోసం ఎకనమిక్స్‌ టైమ్స్‌ ప్రముఖ ఇన్వెస్టర్ల సూచనలతో పది స్టాక్స్‌ గురించి తెలియజేసింది. ఇవి అధిక రాబడులను ఇచ్చే అవకాశాలున్నవిగా పేర్కొంది. 

 

ఆస్క్‌ సందీప్‌ సభర్వాల్‌కు చెందిన సందీప్‌ సభర్వాల్‌... వినియోగ రంగానికి చెందిన బ్రిటానియా స్టాక్‌ను సిఫారసు చేశారు. ‘‘ఎక్కువ మంది ప్రజలు వినియోగించే ఉత్పత్తులను కలిగిన కంపెనీల వైపు చూడాలి. నూతన తరం వారు కూడా వినియోగించే ఉత్పత్తులను తీసుకురావాలి. ఈ విభాగంలో బ్రిటానియా మంచి పనితీరు చూపించగలదు’’ అని సందీప్‌ సభర్వాల్‌ తెలిపారు. 

 

బసంత్‌ మహేశ్వర్‌ వెల్త్‌ అడ్వైజర్స్‌ సహ వ్యవస్థాపకుడు బసంత్‌ మహేశ్వరి, ఎడెల్వీజ్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ రీసెర్చ్‌ హెడ్‌ వినయ్‌ ఖట్టర్‌ ఇద్దరూ టైటాన్‌ కంపెనీని దీర్ఘకాలానికి సిఫారసు చేశారు. ఆభరణాల నుంచి వాచీల వరకు ఎన్నో విభాగాల్లో ఉన్న టైటాన్‌ గత 10 ఏళ్ల కాలంలో ఇన్వెస్టర్లకు 2,000 శాతం రాబడులను ఇచ్చింది. గడచిన మూడేళ్లలో 250 శాతం పెరిగింది. రాకేశ్‌ జున్‌జున్‌వాలా, ఆయన సతీమణి టైటాన్‌లో 7 శాతం వాటాలను మార్చి నాటికి కలిగి ఉన్నారు. 

 

సేజ్‌వన్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ భాగస్వామి సమిత్‌ వర్తక్‌ అయితే, ఎడెల్‌వీజ్‌ ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌ పట్ల బుల్లిష్‌గా ఉన్నారు. కోచి కేంద్రంగా నడిచే ఈక్విటీ ఇంటెలిజెన్స్‌ సంస్థ అధినేత పొరింజు వెలియాత్‌ టాటా గ్లోబల్‌ బెవరేజెస్‌ను సిఫారసు చేశారు. టాటా గ్లోబల్‌ బెవరేజెస్‌ మరిన్ని ఉత్పత్తులను తీసుకురావడం ద్వారా పూర్తి స్థాయి ఎఫ్‌ఎంసీజీ కంపెనీగా అవతరించే లక్ష్యంతో ఉంది. ‘‘ఎఫ్‌ఎంసీజీ విభాగంలో మాకు భారీ పోర్ట్‌ఫోలియో అవసరం. టీ విక్రయ సంస్థగానే ఉండిపోకూడదు. టీ, వాటర్‌ (డ్రింకింగ్‌ వాటర్‌) రెండూ మంచివే. కానీ, ఈ రెండూ భారీ స్థాయికి తీసుకెళ్లలేవు. భిన్నమైన ఉత్పత్తుల ద్వారానే ఇది సాధ్యం’’అని టాటా గ్లోబల్‌ బెవరేజెస్‌ చైర్మన్‌ ఎన్‌ చంద్రశేఖరన్‌ ఇటీవలే పేర్కొన్న విషయం గమనార్హం. 

 

కేడియా సెక్యూరిటీస్‌ అధినేత విజయ్‌కేడియా రెప్రో ఇండియాను సిఫారసు చేశారు. ఈ సంస్థ కంటెంట్‌ సరఫరాతోపాటు ప్రింట్‌, ఫుల్‌ఫిల్‌మెంట్‌ సొల్యూషన్స్‌లో కార్యకలాపాలు నిర్వహిస్తోంది. మ్యాగజైన్ల ప్రింటింగ్‌, బుక్స్‌, బ్రోచర్లు, మ్యాప్స్‌, అట్లాస్‌లు, పోస్టర్ల ముద్రణలో ఉంది. గో ఇండియా అడ్వైజర్స్‌కు చెందిన రాకేశ్‌ అరోరా గ్రాసిమ్‌ ఇండస్ట్రీస్‌ను సిఫారసు చేశారు. గ్రాసిమ్‌ ఇండస్ట్రీస్‌ షేరు గడిచిన పదేళ్ల కాలంలో ఇప్పటికి 90 శాతమే పెరిగింది. గత ఏడాది కాలంలో 13 శాతం పతనమైంది. ఇక మారథాన్‌ ట్రెండ్స్‌ పీఎంఎస్‌కు చెందిన అతుల్‌ సూరి హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్‌ను సూచించారు. హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్‌ ఇన్సూరెన్స్‌ కంపెనీ మార్చి త్రైమాసిక లాభంలో 5 శాతం వృద్ధిని చూపించడం గమనార్హం. రినైసన్స్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ మేనేజర్స్‌ వ్యవస్థాపకుడు పంకజ్‌ మురర్కా అయితే సింజీన్‌ స్టాక్‌ పట్ల బుల్లిష్‌గా ఉన్నారు. మోతీలాల్‌ ఓస్వాల్‌ ఏఎంసీ పీఎంఎస్‌ హెడ్‌ మనీష్‌ సొంతాలియా డీసీబీ బ్యాంకును సిఫారసు చేశారు. డీసీబీ బ్యాంకు గత ఏడాది కాలంలో ఇన్వెస్టర్లకు 30 శాతం రాబడులను, గత పదేళ్లలో 485 శాతం రాబడులను ఇచ్చింది.You may be interested

39000లపైన ప్రారంభమైన సెన్సెక్స్‌

Tuesday 18th June 2019

కిత్రం ట్రేడింగ్‌లో నెల కనిష్టానికి పతనమైన సూచీలు మంగళవారం లాభాలతో ట్రేడింగ్‌ను ప్రారంభించాయి. సెన్సెక్స్‌ 100 పాయింట్లు లాభపడి 39000 స్థాయి అందుకుని 39,057 వద్ద, నిఫ్టీ 20 పాయింట్లు పెరిగి 11692 వద్ద మొదలయ్యాయి. నిన్న రాత్రి అమెరికా మార్కెట్ల లాభాల ముగింపుతో పాటు నేడు ఆసియాలో ఒక్క జపాన్‌ మిగతా అన్ని మార్కెట్లు లాభాల్లో ట్రేడింగ్‌ అవుతుండటం మన మార్కెట్‌కు కలిసొచ్చింది. ప్రపంచ ఆర్థిక వృద్ధి మందగమన

ఈ స్టాక్స్‌లో ఎఫ్‌ఐఐలకూ నష్టాలు..!

Monday 17th June 2019

చిన్న ఇన్వెస్టర్లు... ఇనిస్టిట్యూషనల్‌ ఇన్వెస్టర్లు, విదేశీ ఇన్వెస్టర్ల కొనుగోళ్లు, అమ్మకాల డేటాను పరిశీలించి, పెట్టుబడుల నిర్ణయాలు తీసుకుంటుంటారు. అయితే, స్టాక్‌ మార్కెట్లో గుడ్డిగా ఎవరినీ అనుసరించారదన్నది నిపుణులు చెప్పేమాట. ఓ కంపెనీలో ఇన్వెస్ట్‌ చేస్తున్నామంటే అందుకు తగిన కారణాలు ఉండాలి. అవి భావోద్వేగాలు, ఆకర్షణలకు అతీతంగా పూర్తిగా ఫండమెంటల్స్‌ ఆధారంగానే ఉండాలి. ఇన్వెస్టింగ్‌లో సంస్థాగత, విదేశీ ఇన్వెస్టర్లను అనుసరించే వారికి కొన్ని స్టాక్స్‌ విషయంలో చేదు ఫలితాలే ఎదురయ్యాయి. ఎందుకంటే

Most from this category