News


మూడు వారాలకు 10 సిఫార్సులు

Monday 10th June 2019
Markets_main1560158292.png-26204

వచ్చే రెండు మూడు వారాల్లో బలమైన లాభాలందించే పది స్టాకులను వివిధ బ్రోకరేజ్‌లు రికమండ్‌ చేస్తున్నాయి.
రిలయన్స్‌ సెక్యూరిటీస్‌ సిఫార్సులు
1. బాలకృష్ణ ఇండస్ట్రీస్‌: కొనొచ్చు. టార్గెట్‌ రూ. 865. స్టాప్‌లాస్‌ రూ. 745. కొద్ది రోజుల క్రితం రూ. 765 వద్ద డబుల్‌ బాటమ్‌ ఏర్పరుచుకొని బలంగా పైకి ఎగిసింది. ఈ అప్‌మూవ్‌లో కీలక డీఎంఏలకు పైన క్లోజయింది. ఆర్‌ఎస్‌ఐ పాజిటివ్‌ క్రాసోవర్‌ ఏర్పరిచింది.
2. క్రాంప్టన్‌ గ్రీవ్స్‌: కొనొచ్చు. టార్గెట్‌ రూ. 272. స్టాప్‌లాస్‌ రూ. 224. లాంగ్‌టర్మ్‌ డీఎంఏలకు పైన బలమైన వాల్యూంలతో బ్రేకవుట్‌ సాధించింది. అనంతరం వచ్చిన చిన్నపాటి పతనం కొనుగోళ్లకు అవకాశాన్నిచ్చింది. త్వరలో కొత్త గరిష్ఠాలకు చేరవచ్చు.
ఏంజల్‌ బ్రోకింగ్‌ సిఫార్సులు
1. సీఈఎస్‌సీ: కొనొచ్చు. టార్గెట్‌ రూ. 825. స్టాప్‌లాస్‌ రూ. 738. ఎనిమిది నెలల పాటు వంద రూపాయల రేంజ్‌లో కదలాడి చివరకు పైవైపునకు బ్రేకవుట్‌ ఇచ్చింది. ఈ బ్రేకవుట్‌కు ఇండికేటర్ల మద్దతు, వాల్యూంల మద్దతు ఉంది. టెక్నికల్‌గా మరింత ముందుకు కొనసాగే ఛాన్సులున్నాయి.
యస్‌ సెక్యూరిటీస్‌ సిఫార్సులు
1. సువెన్‌ లైఫ్‌: కొనొచ్చు. టార్గెట్‌ రూ. 305. స్టాప్‌లాస్‌ రూ. 255. కన్సాలిడేషన్‌ పాటర్న్‌ పైఅవధి రూ. 275కు పైన బలంగా క్లోజయితే బలమైన బ్రేకవుట్‌గా భావించాలి. వీక్లీ చార్టుల్లో బ్రేకవుట్‌కే సంకేతాలు కనిపిస్తున్నాయి. ఆర్‌ఎస్‌ఐ 40 స్థాయిలకుపైన అప్‌సైడ్‌ మూవ్‌ చూపుతోంది.
2. వీఐపీ ఇండస్ట్రీస్‌: కొనొచ్చు. టార్గెట్‌ రూ. 510. స్టాప్‌లాస్‌ రూ. 430. డైలీ చార్టుల్లో 61.8 శాతం ఫిబొనాక్కి స్థాయి రూ. 435 వద్ద మద్దతు తీసుకొని పైకి ఎగిసినట్లు కనిపిస్తోంది. వీక్లీ చార్టుల్లో బ్రేకవుట్‌కు సిద్ధంగా ఉన్న సంకేతాలున్నాయి. ఆర్‌ఎస్‌ఐ బుల్లిష్‌గా మారింది.
హెచ్‌డీఎఫ్‌సీ సెక్యూరిటీస్‌ సిఫార్సులు
1. వీగార్డ్‌ ఇండస్ట్రీస్‌: కొనొచ్చు. టార్గెట్‌ రూ. 296. స్టాప్‌లాస్‌ రూ. 218. గతవారం సరాసరి కన్నా ఎక్కువ వాల్యూంలతో మంచి కదలికలు చూపి ఏడాది గరిష్ఠాల వద్ద క్లోజయింది. స్టాకు ధోరణి చూస్తే అప్‌ట్రెండ్‌ కొనసాగేలా ఉంది. టెక్నికల్‌ ఇండికేటర్లు కూడా పాజిటివ్‌గా ఉన్నాయి.
2. ఫినోలెక్స్‌ ఇండస్ట్రీస్‌: కొనొచ్చు. టార్గెట్‌ రూ. 537. స్టాప్‌లాస్‌ రూ. 485. దిగువన రూ. 440 వద్ద డబుల్‌ బాటమ్‌ ఏర్పరుచుకుంది. ఈ వారం స్వల్పరేంజ్‌లో ట్రేడవుతూ త్వరలో బ్రేకవుట్‌ ఇచ్చే సంకేతాలు చూపుతోంది. ప్రస్తుతం తన స్వల్పకాలిక డీఎంఏలకు పైన స్థిరంగా ఉంది.
ప్రభుదాస్‌ లీలాధర్‌ సిఫార్సులు
1. వోల్టాస్‌: కొనొచ్చు. టార్గెట్‌ రూ. 670. స్టాప్‌లాస్‌ రూ. 580. కొన్నిరోజులుగా క్రమానుగత పెరుగుదల ధోరణి చూపుతూనే ఉంది. వాల్యూంలు సైతం మెరుగ్గా ఉంటున్నాయి. ఆర్‌ఎస్‌ఐ పాజిటివ్‌గా మారింది. త్వరలో బ్రేకవుట్‌ జరగవచ్చు.
చార్ట్‌వ్యూ ఇండియా సిఫార్సులు
1. టెక్‌ మహీంద్రా: కొనొచ్చు. టార్గెట్‌ రూ. 790. స్టాప్‌లాస్‌ రూ. 725. చార్టుల్లో బుల్లిష్‌ ఎంగల్ఫింగ్‌ పాటర్న్‌ ఏర్పరిచింది. రూ. 720 వద్ద బలమైన డబుల్‌ బాటమ్‌ ఏర్పడింది. దీనికి పైన స్థిరంగా కొనసాగితే తిరిగి అప్‌మూవ్‌ చూపుతుంది.
2. ఎస్‌ఆర్‌ఎఫ్‌: కొనొచ్చు. టార్గెట్‌ రూ. 3100. స్టాప్‌లాస్‌ రూ. 2800. ఆల్‌టైమ్‌ హైని తాకిన అనంతరం కన్సాలిడేషన్‌ మూడ్‌లోకి మారింది. కొని​ రోజులుగా ఫ్లాట్‌ ట్రేడవుతోంది. రూ. 2820కిపైన స్థిరంగా కొనసాగితే మరోదఫా అప్‌మూవ్‌ చూపి రూ. 3100వరకు చేరుతుందని అంచనా. 


 



You may be interested

అడాగ్‌ షేర్లను వీడని నష్టాలు

Monday 10th June 2019

అనిల్‌ అంబానికి చెందిన అడాగ్‌ గ్రూప్‌ షేర్లు సోమవారం అమ్మకాల ఒత్తిడికి లోనవుతున్నాయి. ఈ గ్రూప్‌నకు చెందిన షేర్లు దాదాపు 20 శాతం నష్టపోయాయి. గతవారం చివర్లో రిలయన్స్‌ పవర్‌ నిరాశజనకమైన ఆర్థిక ఫలితాలను ప్రకటించడం ఇందుకు నేపథ్యం.  మార్చి త్రైమాసికంలో రూ.3,558.51 కోట్ల నష్టాన్ని ప్రకటించింది. అంతక్రితం ఏడాది ఇదే త్రైమాసికంలో రూ.189 కోట్ల లాభం రావడం గమనార్హం. 2018-19 పూర్తి ఆర్థిక సంవత్సరానికి కంపెనీ రూ.2,952 కోట్ల

రిస్క్‌ ఉన్నా రాబడులు ఆశించే వారికి

Monday 10th June 2019

రిస్క్‌ ఉన్నా రాబడులు ఆశించే వారికి కోటక్‌ ఎమర్జింగ్‌ ఈక్విటీ ఫండ్‌ స్మాల్‌, మిడ్‌క్యాప్‌ స్టాక్స్‌ దిద్దుబాటుకు గురై ఆకర్షణీయ విలువలకు చేరాయి.  గతేడాది స్మాల్‌క్యాప్‌ ఇండెక్స్‌ 21 శాతం పతనం కాగా, మిడ్‌క్యాప్‌ సూచీ 12 శాతం మేర నష్టపోయింది. స్మాల్‌క్యాప్‌తో పోలిస్తే మిడ్‌క్యాప్‌ కంపెనీల్లో అస్థిరత కాస్త తక్కువ.  ఈ తరుణంలో మంచి మిడ్‌క్యాప్‌ మ్యూచువల్‌ ఫండ్‌ పథకాన్ని ఎంచుకుని దీర్ఘకాలానికి ఇన్వెస్ట్‌ చేయడం ద్వారా మెరుగైన రాబడులను సొంతం

Most from this category