STOCKS

News


స్థూల ఆర్థికాంశాలే కీలకం.!

Monday 12th August 2019
Markets_main1565589223.png-27702

  • ఈ వారంలో ట్రేడింగ్‌ 3 రోజులకే పరిమితం
  • సోమ (బక్రీద్‌), గురు (స్వాతంత్ర్య దినోత్సవం) వారాల్లో మార్కెట్‌కు సెలవు
  • ఎఫ్‌పీఐ ట్యాక్స్‌ అంశంపై దృష్టిసారించిన మార్కెట్‌ వర్గాలు
  • జూన్‌లో 2 శాతం ఐఐపీ.. మంగళవారం ట్రేడింగ్‌పై ప్రభావం..!
  • - సీపీఐ ద్రవ్యోల్బణం (సోమ), డబ్ల్యూపీఐ బుధవారం వెల్లడి

ముంబై: గతవారం దేశీ ప్రధాన స్టాక్‌ సూచీలు ఒకటిన్నర శాతం వరకు లాభాలను నమోదుచేసి ఇన్వెస్టర్ల సెంటిమెంట్‌ను మెరుగుపరిచాయి. అంతక్రితం వరుసగా నాలుగు వారాల పాటు నష్టాల్లో ట్రేడయ్యి.. ఆరు శాతానికి మించి నష్టాల్లో కొనసాగిన సూచీలు గతవారాంతాన కాస్త సానుకూల వాతావరణాన్ని నింపాయి. ఒక్కసారిగా జరిగిన షార్ట్‌ కవరింగ్‌కు.. ఈవారంలో కొనుగోలు మద్దతు జతయ్యి మార్కెట్‌ ఇక్కడ నుంచి ర్యాలీ చేస్తుందా..? లేదంటే, మళ్లీ నేలచూపులు చూస్తుందా అనే అంశానికి, సూపర్‌ రిచ్‌ ట్యాక్స్‌ నుంచి ఎఫ్‌పీఐలకు మినహాయింపు లభిస్తుందా లేదా అనేది అత్యంత కీలకంగా ఉందని దలాల్‌ స్ట్రీట్‌ వర్గాలు చెబుతున్నాయి. విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లకు (ఎఫ్‌పీఐ) అధిక సర్‌చార్జి నుంచి మినహాయింపు ఇవ్వడం, మూడేళ్లు దాటిన పెట్టుబడులకు దీర్ఘకాల మూలధన లాభాలపై పన్ను (ఎల్‌టీసీజీ) నుంచి ఉపసమనం, డివిడెండ్‌ డిస్ట్రీబ్యూషన్‌ ట్యాక్స్‌(డీడీటీ)ను సులభతరం చేయడం వంటి మార్కెట్‌ సానుకూల నిర్ణయాలను త్వరలోనే ప్రభుత్వం తీసుకునే అవకాశం ఉందని భావిస్తున్నాయి. ఆర్థిక వ్యవస్థకు ఊతమిచ్చే అంశాలు, సూపర్‌ రిచ్‌ ట్యాక్స్‌పై ప్రభుత్వ తుది నిర్ణయం వంటి కీలక అంశాలు మార్కెట్‌ను ఈవారంలో ప్రభావితం చేయనున్నాయని జియోజిత్‌ ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌ పరిశోధన విభాగం హెడ్‌ వినోద్‌ నాయర్‌ అన్నారు. నెమ్మదించిన ఆర్థిక వ్యవస్థలో జవసత్వాలు కల్పించేందుకు ప్రభుత్వం ఏ విధమైన నిర్ణయాలు తీసుకుంటుందనే అంశం అధారంగానే మార్కెట్‌ దిశానిర్దేశం ఉందని యాక్సిస్‌ సెక్యూరిటీస్‌ ఎండీ, సీఈఓ అరుణ్‌ తుక్రాల్‌ విశ్లేషించారు.

- సోమ, గురువారాల్లో మార్కెట్‌కు సెలవు
ఈ వారంలో ట్రేడింగ్‌ 3 రోజులకే పరిమితమైంది. సోమవారం బక్రీద్‌ సందర్భంగా స్టాక్‌ ఎక్స్ఛేంజీలు సెలవు ప్రకటించాయి. ఇక ఆగస్టు 15న(స్వాతంత్ర్య దినోత్సవం) మార్కెట్లకు సెలవు ఉన్న నేపథ్యంలో మంగళ, బుధ, శుక్రవారాల్లో మాత్రమే ట్రేడింగ్‌ జరగనుంది. మార్కెట్‌ పనిదినాలు తక్కువగా ఉన్న కారణంగా ఈవారంలో ఒడిదుడుకులకు ఆస్కారం ఉందని ఎపిక్‌ రీసెర్చ్‌ సీఈఓ ముస్తఫా నదీమ్‌ అన్నారు. 

- ఆర్థికాంశాలపై దృష్టి...
శుక్రవారం మార్కెట్‌ ముగిసిన తరువాత జూన్‌ నెల పారిశ్రామిక ఉత్పత్తి డేటా విడుదలకాగా, ఏడాది ప్రాతిపదికన కేవలం 2 శాతం వృద్ధి మాత్రమే నమోదైంది. మైనింగ్‌, తయారీ రంగాల పనితీరు పేలవంగా ఉన్న కారణంగా.. వృద్ధి రేటు గడచిన నాలుగు కనిష్టస్థాయిని నమోదుచేసింది. పారిశ్రామికరంగం వృద్ది రేటు మందగమన ప్రభావం మంగళవారం మార్కెట్‌ ట్రేడింగ్‌పై ఉండేందుకు అవకాశం ఉందని దలాల్‌ స్ట్రీట్‌ పండితులు అంచనావేస్తున్నారు. ఇక సోమవారం సీపీఐ ద్రవ్యోల్బణం, టోకు ధరల సూచీ (డబ్ల్యూపీఐ) ద్రవ్యోల్బణం  బుధవారం వెల్లడికానున్నాయి. ఈవారంలో స్పెక్యూలేటీవ్‌ స్వింగ్స్‌కు ఆస్కారం ఉందని సామ్కో సెక్యూరిటీస్‌ సీఈఓ జిమిత్‌ మోడీ విశ్లేషించారు.

- 2,140 కంపెనీల క్యూ1 ఫలితాలు
ఈవారంలో 2,140 కంపెనీల జూన్‌ త్రైమాసిక ఆర్థిక ఫలితాలు వెల్లడికానున్నాయి. సన్ ఫార్మా, కోల్ ఇండియా, ఓఎన్‌జీసీ, భారత్ ఫోర్జ్, మదర్సన్ సుమి, గ్లెన్‌మార్క్ ఫార్మా, బాష్, జనరల్ ఇన్సూరెన్స్, ఐడీబీఐ బ్యాంక్, గ్రాసిమ్ ఇండస్ట్రీస్ క్యూ1 ఫలితాలు ఈవారంలో విడుదలకానున్నాయి. సద్భావ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, టీటీకే ప్రెస్టీజ్, సెంచరీ టెక్స్‌టైల్స్, గ్రాఫైట్ ఇండియా, జీవీకే పవర్, ముత్తూట్‌ ఫైనాన్స్, వీఏ టెక్ వాబాగ్, షాలిమార్ పెయింట్స్, జిందాల్ సా, రిలయన్స్ పవర్, డాక్టర్ లాల్ పాత్ లాబ్స్, వక్రంగీ, బ్లూ స్టార్, అశోక బిల్డ్‌కాన్, మణప్పురం ఫైనాన్స్, ఇప్కా ల్యాబ్స్, రిలయన్స్ ఇన్‌ఫ్రా, అపోలో హాస్పిటల్స్, పీఎఫ్‌సీ, ఎడెల్విస్ ఫైనాన్షియల్, జీఎంఆర్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, జైన్ ఇరిగేషన్ సిస్టమ్స్, ఇండియాబుల్స్ రియల్ ఎస్టేట్, వోకార్డ్‌ కంపెనీల ఫలితాలు ఈవారంలోని తొలి మూడురోజుల్లో వెల్లడికానున్నాయి.

ఆగస్టులో రూ.9,197 కోట్లు ఉపసంహరణ...
విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు (ఎఫ్‌పీఐ) ఆగస్టు 1-9 కాలానికి ఈక్విటీ మార్కెట్‌ నుంచి రూ.11,135 కోట్లను ఉపసంహరించుకున్నట్లు డిపాజిటరీల డేటా ద్వారా వెల్లడయింది. సూపర్‌ రిచ్‌ ట్యాక్స్‌ అంశం కారణంగా ఈస్థాయిలో భారీ అమ్మకాలకు పాల్పడ్డారని మార్నింగ్‌స్టార్ సీనియర్ విశ్లేషకులు హిమాన్షు శ్రీవాస్తవ విశ్లేషించారు. ఈక్విటీ మార్కెట్‌ నుంచి పెట్టుబడులు వెనక్కి తగ్గినప్పటికీ.. డెట్‌ మార్కెట్‌లో రూ.1,937 కోట్లను పెట్టుబడి పెట్టడం ద్వారా క్యాపిటల్‌ మార్కెట్లో వీరి నికర పెట్టుబడి ఉపసంహరణ ఈనెల్లో ఇప్పటివరకు రూ.9,197 కోట్లకు పరిమితమైంది.You may be interested

బాకీల వసూలు వేటలో బీఎస్‌ఎన్‌ఎల్‌

Monday 12th August 2019

రూ. 3,000 కోట్లు రాబట్టుకునేందుకు ప్రయత్నాలు న్యూఢిల్లీ: నిధుల సంక్షోభంలో ఉన్న ప్రభుత్వ రంగ టెలికం దిగ్గజం బీఎస్‌ఎన్‌ఎల్‌ ప్రస్తుతం కార్పొరేట్ క్లయింట్ల నుంచి బాకీల వసూళ్ల పనిలో పడింది. దాదాపు రూ. 3,000 కోట్ల మేర పేరుకుపోయిన బకాయిల్లో సింహభాగం మొత్తాన్ని వచ్చే రెండు, మూడు నెలల్లో వసూలు చేసుకునేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేయాలని భావిస్తోంది. కంపెనీ సీఎండీ పి.కె. పుర్వార్ ఈ విషయాలు వెల్లడించారు. బీఎస్ఎన్‌ఎల్‌ ఉద్యోగులకు జీతాలను

పెట్టుబడుల వృద్ధికి... రిలయన్స్‌ గ్రోత్‌ ఫండ్‌

Monday 12th August 2019

రిలయన్స్‌ గ్రోత్‌ ఫండ్‌ అన్నది ఓపెన్‌ ఎండెడ్‌ మిడ్‌క్యాప్‌ తరహా పథకం. అధికంగా వృద్ధిని సాధించే కంపెనీల్లో ఇన్వెస్ట్‌ చేయడం ద్వారా దీర్ఘకాలంలో సంపద సృష్టించడం ఈ పథకం ప్రధాన ఉద్దేశ్యం. ఈ పథకం నిర్వహణ వ్యవహారాలను (మేనేజర్‌) మనీష్‌ గున్వానీ 2017 నుంచి చూస్తున్నారు. ఆర్థిక సేవల రంగంలో ఆయనకు 17 ఏళ్ల సుదీర్ఘ అనుభవం ఉంది.  పెట్టుబడుల విధానం... బోటమ్‌ అప్‌ విధానాన్ని ఈ పథకం ఎక్కువగా అనుసరిస్తుంది. లేదా

Most from this category