News


మోతీలాల్‌ఓస్వాల్‌ నుంచి టాప్‌ కాంట్రాబెట్స్‌

Wednesday 24th July 2019
Markets_main1563963631.png-27288

 ప్రస్తుత పరిస్థితుల్లో కాంట్రాబయింగ్‌, కాంట్రా సెల్లింగ్‌ మాత్రమే మంచి ఫలితాలిస్తాయని మోతీలాల్‌ఓస్వాల్‌ అభిప్రాయపడింది.(కాంట్రా ఇన్వెస్ట్‌మెంట్‌ అంటే బాగా క్షీణించిన స్టాకులను ఎంచుకొని పెట్టుబడి పెట్టడం). 
- తమ ఏడాది గరిష్ఠాల నుంచి  దాదాపు 20 శాతం వరకు పతనమైన కొన్ని స్టాకులను కొనొచ్చని బ్రోకరేజ్‌ సంస్థ రికమండ్‌ చేస్తోంది. ఇందులో బీఓబీ, సీమెన్స్‌, ఎన్‌టీపీసీ, ఎన్‌ఎండీసీ, ఐటీసీ ఉన్నాయి. 


- మరోవైపు తమ ఏడాది కనిష్ఠాల నుంచి దాదాపు 60 శాతం లాభపడిన కొన్ని స్టాకులను అమ్మొచ్చని బ్రోకరేజ్‌ సంస్థ రికమండ్‌ చేసింది. వీటిలో ఏసియన్‌పెయింట్స్‌, హావెల్స్‌, బ్రిటానియా ఇండస్ట్రీస్‌; శ్రీ సిమెంట్‌, సిప్లా ఉన్నాయి.

దీర్ఘకాలానికి తక్కువ పీఈ ఉన్న స్టాకులు మంచి రాబడులు ఇస్తాయని, ప్రధాన సూచీలను మించి రిటర్న్స్‌ ఇస్తాయని మోతీలాల్‌ఓస్వాల్‌ పేర్కొంది. ప్రస్తుతం దేశీయ మార్కెట్లు భారీ వాల్యూషన్ల వద్ద ఉన్నాయని, వృద్ధి ఆందోళనలు ఇలాగే కొనసాగితే మార్కెట్లు ఇప్పుడున్న స్థాయిలను కూడా నిలుపుకోలేకపోవచ్చని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. 



You may be interested

బడా బ్యాంకుల్లో మరింత పతనం!

Wednesday 24th July 2019

గౌతమ్‌ షా అంచనా దేశీయ ఈక్విటీ మార్కెట్‌ కోలుకోవాలన్నా, పతనం కావాలన్నా బ్యాంకు నిఫ్టీయే కారణమవుతుందని, బ్యాంకునిఫ్టీ కదలికలే ప్రధాన మార్కెట్‌ను ప్రభావితం చేస్తాయని జేఎం ఫైనాన్షియల్స్‌ అనలిస్టు గౌతం షా అభిప్రాయపడ్డారు. బ్యాంకు నిఫ్టీ సరిగా లేకుంటే ప్రధాన సూచీలు ఒత్తిడిలోకి జారుకుంటాయని, గత రెండువారాలుగా ఈ ధోరణిని మనం గమనించవచ్చని చెప్పారు. దేశీయ బ్యాంకింగ్‌ రంగంలో బడా బ్యాంకుల షేర్లు మరింత పతనమయ్యే ఛాన్సులు ఎక్కువని అంచన వేశారు.

ఐదో రోజూ ఆగని అమ్మకాలు

Wednesday 24th July 2019

11300దిగువున ముగిసిన నిఫ్టీ  135 పాయింట్ల కోల్పోయిన సెన్సెక్స్‌ మార్కెట్‌లో అమ్మకాలు ఆగడం లేదు. ఫలితంగా సూచీలకు ఐదోరోజూ నష్టాల ముగింపు తప్పలేదు. మెటల్‌, అటో, ఫార్మా, ఇంధన, బ్యాకింగ్‌ రంగ షేర్లలో అమ్మకాలు జోరుగా జరగడంతో బుధవారం సెన్సెక్స్‌ 135 పాయింట్లను నష్టపోయి 37,847.65 వద్ద, నిఫ్టీ 60 పాయింట్లను కోల్పోయి 11300ల దిగువున 11,271 వద్ద స్థిరపడింది. బ్యాంకు షేర్ల పతనంతో ఎన్ఎస్‌ఈలో కీలకమైన బ్యాంకు నిఫ్టీ ఇండెక్స్‌ 175(0.60శాతం)

Most from this category