News


షార్ట్‌టర్మ్‌కు టాప్‌టెన్‌ సిఫార్సులు

Monday 9th September 2019
Markets_main1568017400.png-28269

వచ్చే రెండు మూడు వారాల్లో మంచి రాబడినందించే పది స్టాకులను ప్రముఖ అనలిస్టులు రికమండ్‌ చేస్తున్నారు.
వైశాలీ పరేఖ్‌ రికమండేషన్లు
1. కోటక్‌మహీంద్రా బ్యాంక్‌: కొనొచ్చు. టార్గెట్‌ రూ. 1550. స్టాప్‌లాస్‌ రూ. 1380. షేరు రూ. 1400 వద్ద బాటమ్‌ అవుట్‌ అయినట్లు కనిపిస్తోంది. టెక్నికల్‌ ఇండికేటర్లలో ట్రెండ్‌ రివర్సల్‌ సంకేతాలున్నాయి. 
2. బజాజ్‌ ఆటో: కొనొచ్చు. టార్గెట్‌ రూ. 3100. స్టాప్‌లాస్‌ రూ. 2720. కొన్ని రోజులుగా రూ. 2780 స్థాయిల్లో కన్సాలిడేట్‌ చెంది తాజాగా 200 రోజుల డీఎంఏపైన బ్రేకవుట్‌ సాధించింది. ఇకపై మరింత అప్‌మూవ్‌ ఉంటుంది.
ముస్తఫా నదీమ్‌ రికమండేషన్లు
1. శక్తి పంప్స్‌: కొనొచ్చు. టార్గెట్‌ రూ. 380. స్టాప్‌లాస్‌ రూ. 266. ఆగస్టులో కన్సాలిడేషన్‌ అనంతరం వీక్లీ చార్టుల్లో బేస్‌ ఏర్పడినట్లు కనిపిస్తోంది. ఆర్‌ఎస్‌ఐ పాజిటివ్‌గా మారింది. వాల్యూంల్లో పెరుగుదల నమోదవుతోంది.
2. ఐఓసీ: కొనొచ్చు. టార్గెట్‌ రూ. 145. స్టాప్‌లాస్‌: రూ. 116. వీక్లీ చార్టుల్లో బుల్లిష్‌ ఎంగల్ఫింగ్‌ ప్యాట్రన్‌ ఏర్పడింది. ఇది బలమైన ట్రెండ్‌ రివర్సల్‌కు సంకేతం.
మిలాన్‌ వైష్ణవ్‌ సిఫార్సులు
1. జుబిలాంట్‌ లైఫ్‌: కొనొచ్చు. టార్గెట్‌ రూ. 510. స్టాప్‌లాస్‌ రూ. 450. గతంలో రూ. 898 వద్ద గరిష్ఠాన్ని ఏర్పరిచి అనంతరం డౌన్‌ట్రెండ్‌లోకి మరలింది. దిగువన మద్దతు పుంజుకొని తాజాగా 50 రోజుల డీఎంఏను దాటి బలం చూపుతోంది. ఎంఏసీడీలో పాజిటివ్‌ క్రాసోవర్‌ ఏర్పడింది.
2. టొరెంట్‌ ఫార్మా: కొనొచ్చు. టార్గెట్‌ రూ. 1800. స్టాప్‌లాస్‌ రూ. 1705. కీలక నిరోధం రూ. 1850- 1900ను దాటేందుకు తంటాలు పడుతోంది. ఇటీవల ఈ స్థాయికి వెళ్లి వెంటనే వెనక్కు వచ్చి రూ. 1450ని టచ్‌ చేసింది. ఇక్కడ బలమైన బేస్‌ కనిపిస్తోంది. తాజాగా రూ. 1708 వద్ద 200 రోజుల డీఎంఏ నిరోధం దాటేసి మరింత అప్‌మూవ్‌ సంకేతాలు ఇస్తోంది.
మజార్‌ మహ్మద్‌ సిఫార్సులు
1. టాటాస్టీల్‌: కొనొచ్చు. టార్గెట్‌ రూ. 387. స్టాప్‌లాస్‌ రూ. 300. జూన్‌ గరిష్ఠాల నుంచి నిట్టనిలువన పతనమై రూ. 330 వరకు చేరింది అక్కడ డబుల్‌ బాటమ్‌ ఏర్పరిచింది. ఇక్కడ నుంచి అప్‌మూవ్‌ ఆరంభించింది. 
2. ఆర్‌ఐఎల్‌: కొనొచ్చు. టార్గెట్‌ రూ. 1290. స్టాప్‌లాస్‌ రూ. 1180. గత ర్యాలీకి 50 శాతం రిట్రేస్‌మెంట్‌ వరకు కరెక‌్షన్‌ చూసింది. దీంతో గతంలో 1175- 1225రూపాయల మధ్య ఏర్పరిచిన బుల్లిష్‌ గ్యాప్‌ పూరించినట్లయింది. ఇకపై రూ. 1186కు పైన అప్‌ర్యాలీ ఉంటుంది.
సమీత్‌ చవాన్‌ సిఫార్సులు
1. టాటా స్టీల్‌: కొనొచ్చు. టార్గెట్‌ రూ. 388. స్టాప్‌లాస్‌ రూ. 337. మెటల్‌ షేర్లలో రిలీఫ్‌ర్యాలీ కనిపిస్తోంది. చాలా రోజుల కన్సాలిడేషన్‌ అనంతరం షేరు అప్‌మూవ్‌కు రెడీగా ఉన్నట్లు డ్రాగన్‌ఫ్లై డోజీ ఏర్పరచడం ద్వారా తెలియజేస్తోంది.
2. భారత్‌ఫోర్జ్‌: కొనొచ్చు. టార్గెట్‌ రూ. 426. స్టాప్‌లాస్‌ రూ. 375. మెటల్స్‌తో పాటు ఆటో, ఆటో అనుబంధ రంగాల్లో కూడా రిలీఫ్‌ ర్యాలీ వచ్చింది. ఈ క్రమంలో భారత్‌ఫోర్జ్‌లో ఇంతవరకు రిలీఫ్‌ర్యాలీ ఆరంభం కానందున ఇకపై ర్యాలీ ఉంటుందని అంచనా. 



You may be interested

ఇలాంటి కంపెనీల షేర్లతో జాగ్రత్త!

Monday 9th September 2019

మార్కెట్లు నెగిటివ్‌ జోన్‌లో ప్రయాణిస్తున్నప్పుడే ఇన్వెస్టర్లకు ఎక్కువ పెట్టుబడి అవకాశాలు కనిపిస్తుంటాయి. అయితే ఇలాంటి సమయంలో తొందరపడి తప్పు నిర్ణయాలు తీసుకుంటే తర్వాత మార్కెట్‌ రికవరీ చెందినా, పెట్టుబడి మాత్రం పెరగకపోయే ప్రమాదం ఉంది. ముఖ్యంగా చాలా మంది ట్రేడర్లు, ఇన్వెస్టర్ల ఆలోచన ఈ సమయంలో ఇలా ఉంటుంది.. ‘షేరు ధర చాలా పడిపోయింది. అయినా ఇంకెంత పడతుంది? ఇంతకు మించి ఇక పడదు.’ కానీ కొన్ని స్టాకుల విషయంలో

బ్యాంక్‌ నిఫ్టీ 1శాతం జంప్‌

Monday 9th September 2019

బ్యాంక్‌ నిఫ్టీ ఇండెక్స్‌ సోమవారం ఉదయం ట్రేడింగ్‌ సెషన్‌లో 1శాతం పెరిగింది. ఎన్‌ఎస్‌ఈలో బ్యాంకింగ్‌ రంగ షేర్లకు ప్రాతినిథ్యం వహించే బ్యాంక్‌ నిఫ్టీ  ఇండెక్స్‌ నేడు 27,240.35 వద్ద ప్రారంభమైంది. మార్కెట్‌ ప్రారంభం నుంచి బ్యాంకింగ్‌ రంగ షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభిస్తుండటంతో ఇండెక్స్‌ 1.10శాతం పెరిగి 27539.50 వద్ద ఇంట్రాడే గరిష్టాన్ని తాకింది. మధ్యాహ్నం గం.12:30ని.లకు ఇండెక్స్‌ గతవారం ముగింపు(27,247.90)తో పోలిస్తే 0.95శాతం లాభంతో 27,511.05 వద్ద ట్రేడ్‌

Most from this category