10900 పాయింట్లే బుల్స్‌కు కీలకం
By D Sayee Pramodh

నివేశ్ సెక్యూరిటీస్ అంచనా
నిఫ్టీ 10900 పాయింట్లపైన బలంగా ముగిస్తే బుల్స్‌కు పట్టు చిక్కుతుందని నివేశ్ సెక్యూరిటీస్ అనలిస్టు మెహుల్ కొఠారి చెప్పారు. నిఫ్టీ తదుపరి పయనంపై ఆయన విశ్లేషణ ఇలా ఉంది...
రెండు సెషన్లుగా నిఫ్టీ దిగువస్థాయిలకు వెళ్లి బౌన్స్ బ్యాక్ అవడం, పైస్థాయికి వెళ్లి వెనక్కు రావడం చేస్తోంది. నిఫ్టీకి ప్రస్తుతం 10740 పాయింట్ల వద్ద కీలక మద్దతు ఉంది. ఇక్కడే గత రిలీఫ్ ర్యాలీకి 78.6 ఫిబోనాక్కి రిట్రేస్‌మెంట్ స్థాయి ఉంది. అందువల్ల ఇకపై కూడా ఈ స్థాయిని నిఫ్టీ కాపాడుకుంటే చార్టుల్లో ఇన్వర్స్ హెడ్ అండ్ షోల్డర్ ప్యాట్రన్ ఏర్పరుస్తుంది. కానీ ఇప్పటికి ఈ ప్యాట్రన్కు రూపం రాలేదు. నిఫ్టీ 10900 పాయింట్లను దాటితే గత గరిష్ఠం 11141 పాయింట్ల వరకు చేరవచ్చు. అంతకు మించి బలమైన ర్యాలీ ఏర్పడాలంటే మాత్రం తప్పకుడా 11200 పాయింట్లను దాటవలిసి ఉంటుంది. ఒకవేళ నిఫ్టీ బలం చూపలేక కీలక 10740 పాయింట్ల మద్దతు కోల్పోతే వేగంగా 10630, 10550 పాయింట్ల స్థాయిలకు దిగజారవచ్చు. ఎఫ్ఐఐల డెరివేటివ్స్ లాంగ్, షార్ట్ నిష్పత్తి 20 శాతానికి చేరింది. ఇంత తక్కువ నిష్పత్తి నమోదయితే బలమైన షార్ట్‌కవరింగ్‌కు అవకాశాలుంటాయి.
మిడ్‌టర్మ్‌కు మూడు సిఫార్సులు
1. ఎస్బీఐ: కొనొచ్చు. టార్గెట్ రూ. 290. స్టాప్‌లాస్ రూ. 260.
2. ఎల్ఐసీ హౌసింగ్: అమ్మొచ్చు. టార్గెట్ రూ. 330. స్టాప్‌లాస్ రూ. 440.
3. హెచ్డీఎఫ్సీ బ్యాంక్: కొనొచ్చు. టార్గెట్ రూ. 2375. స్టాప్‌లాస్ రూ. 2225.
You may be interested
ఇండియాబుల్స్‌హౌసింగ్ ఫైనాన్స్ 9శాతం క్రాష్..!
Friday 6th September 2019ఢిల్లీ హైకోర్టులో కంపెనీ, ప్రమోటర్లపై పిల్ ధాఖలైందనే వార్తలతో ఇండియాబుల్స్ హౌసింగ్ ఫైనాన్స్ షేర్లు శుక్రవారం ట్రేడింగ్‌లో 6శాతం క్షీణించాయి. నేడు ఈ కంపెనీ షేరు బీస్‌ఈలో రూ.420.70 వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించింది. మార్కెట్ ఆరంభం నుంచి ఇన్వెస్టర్లు, ట్రేడర్లు షేరు అమ్మకాలకు మొగ్గుచూపడంతో ఒక దశలో 9.50శాతం క్షీణించి రూ.406.20 వద్ద ఇంట్రాడే కనిష్టాన్ని నమోదు చేసింది. ఈ ధర షేరు కొత్త ఏడాది కనిష్టస్థాయి కావడం గమనార్హం.
పసిడి....మూడేళ్లలో అతిపెద్ద పతనం
Friday 6th September 2019ప్రపంచమార్కెట్లో పసిడి ధర గురువారం మూడేళ్ల తరువాత ఒకే రోజులో అతిపెద్ద పతనాన్ని చవిచూసి రెండువారాల కనిష్టానికి దిగివచ్చింది. వచ్చే నెలలో అమెరికా చైనాల మధ్య మరో దఫా వాణిజ్య చర్చలు జరిపేందుకు ఇరుదేశాలు అంగీకరించడటంతో అమెరికాతో పాటు ప్రపంచ స్టాక్ మార్కెట్లకు ఉత్సానిచ్చింది. అమెరికాలోని ప్రైవేట్ రంగంలో అంచనాలకు మించి ఉద్యోగాల కల్పన జరిగినట్లు గణాంకాలు వెలువడటంతో ఆర్థిక మాంద్య భయాలు తగ్గుముఖం పట్టాయి. ఈ రెండు అంశాలు