STOCKS

News


వొకార్డ్‌.. ఒకటే స్పీడ్‌.. ఎందుకంటే?

Tuesday 11th February 2020
Markets_main1581411106.png-31693

12 శాతం దూసుకెళ్లిన షేరు
నెల రోజుల్లో 65 శాతం జూమ్‌
7 నెలల గరిష్టానికి షేరు
క్యూ3 ఫలితాలు, ఔషధ అనుమతుల ఎఫెక్ట్‌

ఇటీవల ర్యాలీ బాటలో సాగుతున్న దేశీ హెల్త్‌కేర్‌ రంగ కంపెనీ వొకార్డ్‌ లిమిటెడ్‌ కౌంటర్‌కు మరోసారి భారీ డిమాండ్‌ నెలకొంది. వెరసి మధ్యాహ్నం 1.30 ప్రాంతంలో ఈ షేరు ఎన్‌ఎస్‌ఈలో 12 శాతంపైగా దూసుకెళ్లి రూ. 408 వద్ద ట్రేడవుతోంది. తొలుత రూ. 412 వరకూ ఎగసింది. ఇది 7 నెలల గరిష్టంకాగా..  గతేడాది ఏప్రిల్‌ 1న రూ. 471 వద్ద 52 వారాల గరిష్టాన్ని నమోదు చేసుకుంది. నెల రోజుల క్రితం అంటే జనవరి 10న రూ. 245 వద్ద ముగిసిన ఈ షేరు తాజాగా రూ. 408కు చేరింది. వెరసి నెల రోజుల్లో ఈ కౌంటర్‌ 65 శాతం దూసుకెళ్లింది.

ఎమ్‌రాక్‌ జోష్‌
ఇంజక్టబుల్స్‌, ఓరల్‌ రూపంలో ఎమ్‌రాక్‌ ఔషధాన్ని విక్రయించేందుకు దేశీ ఔషధ నియంత్రణ అధీకృత సంస్థ(డీసీజీఐ) గ్రీన్‌ సిగ్నల్‌ ఇవ్వడంతో వొకార్డ్‌ లిమిటెడ్‌కు జోష్‌ వచ్చింది. జనవరి 16న ఎమ్‌రాక్‌కు అనుమతి లభించింది. బ్యాక్టీరియా ద్వారా తలెత్తే చర్మ సం‍బంధ వ్యాధులు, చర్మంలో వ్యాపించే ఇతర ఇన్‌ఫెక‌్షన్లతోపాటు.. డయాబెటిక్‌ పేషంట్ల కాళ్ల పుండ్లు తదితరాల చికిత్సకు ఈ ఔషధాన్ని వినియోగించవచ్చని కంపెనీ తెలియజేసింది. ప్రపంచవ్యాప్తంగా 40 కేంద్రాలలో 500 రోగులపై నిర్వహించిన మూడో దశ క్లినికల్‌ పరీక్షల నేపథ్యంలో ఎమ్‌రాక్‌ ఔషధానికి డీసీజీఐ అనుమతినిచ్చినట్లు పేర్కొంది. ఇతర మాలిక్యూల్స్‌కు లొంగని సూపర్‌ బగ్స్‌ను లక్ష్యంగా చేసుకుని ఈ ఔషధాన్ని అభివృద్ధి చేసినట్లు తెలుస్తోంది. ఈ రెండు కొత్తతరహా యాంటీబయోటిక్‌ ఔషధాలనూ దేశీ మార్కెట్లో త్వరలో విడుదల చేసే అవకాశమున్నట్లు కంపెనీ వెల్లడించింది. వెరసి ఈ కౌంటర్‌ నష్టాల బాటను వీడి ర్యాలీ బాట పట్టింది.

ఫలితాల దన్ను
సుమారు మూడేళ్ల తదుపరి వొకార్డ్‌ టర్న్‌అరౌండ్‌ ఫలితాలు సాధించింది. ఈ ఆర్థిక సంవత్సరం(2019-20) మూడో త్రైమాసికంలో రూ. 9 కోట్ల నికర లాభం ఆర్జించింది. ఇందుకు నిర్వహణ సామర్థ్యం మెరుగుపడటం, వ్యయాల అదుపు తదితరాలు సహకరించాయి. గతేడాది(2018-19) క్యూ3లో రూ. 121 కోట్లు, ఈ ఏడాది క్యూ2(జులై-సెప్టెంబర్‌)లో రూ. 82 కోట్లు చొప్పున నికర నష్టం నమోదైంది.  నిర్వహణ లాభం(ఇబిటా) రూ. 19 కోట్ల నుంచి రూ. 109 కోట్లకు ఎగసింది. ఇబిటా మార్జిన్లు 2 శాతం నుంచి 12.5 శాతానికి ఎగశాయి. అయితే అమ్మకాలు 17 శాతం క్షీణించి రూ. 869 కోట్లకు పరిమితమయ్యాయి.

అంకాలజీ పుష్‌
గత(2019) ఏప్రిల్‌లో డాకోజెన్‌ ఔషధానికి జనరిక్‌ రూపమైన డెసిటబైన్‌ ఇంజక‌్షన్‌ విక్రయాలకు అమెరికా ఆహార, ఔషధ నియంత్రణ సంస్థ(యూఎస్‌ఎఫ్‌డీఏ) నుంచి అనుమతిని పొందినట్లు వొకార్డ్‌ లిమిటెడ్‌ వెల్లడించింది. తద్వారా కొన్ని కేన్సర్‌ చికిత్సల్లో వినియోగించగల ఈ ఏఎన్‌డీఏను 50 ఎంజీ ఇంజక‌్షన్ల రూపంలో అమెరికా మార్కెట్లో విడుదల చేయనున్నట్లు తెలియజేసింది. కొన్ని కేన్సర్‌ వ్యాధులలో కనిపించే మైలోడిస్‌ప్లాస్టిక్‌ సిండ్రోమ్స్‌(ఎండీఎస్‌) చికిత్సకు ఈ ఔషధాన్ని వినియోగించవచ్చని వివరించింది. 2019 ఫిబ్రవరిలో ఈ ఔషధం అమెరికాలో 12 కోట్ల డాలర్ల(రూ. 840 కోట్లు) మార్కెట్‌ను సాధించింది. ఈ ఔషధాన్ని హైదరాబాద్‌కు సమీపంలోగల ప్లాంటులో తయారు చేయనున్నట్లు కంపెనీ పేర్కొంది. దీంతో గత ఏప్రిల్‌లో ఈ షేరు ర్యాలీ చేసి రూ. 471 వద్ద 52 వారాల గరిష్టాన్ని తాకింది.You may be interested

ఫార్మా షేర్లపై ‘‘పాంచ్‌’’ పంచ్‌లు!

Tuesday 11th February 2020

దేశీయ ఫార్మా కంపెనీల షేర్లను ఐదు అంశాలు ప్రభావితం చేస్తాయని నిపుణులు విశ్లేషిస్తున్నారు. 1. యూఎస్‌ జనరిక్స్‌ వ్యాపారం: అమెరికాలో జనరిక్స్‌ వ్యాపారం ఇంకా ఇక్కట్ల నుంచి బయటకు రాలేదు. ఒకప్పుడు ఫార్మా కంపెనీలన్నీ జనరిక్స్‌ వ్యాపారంలో భారీగా లాభాలు పొందాయి. కానీ అక్కడ ఈ వ్యాపారంపై నియంత్రణా నిబంధనలు పెరగడంతో జనరిక్స్‌ మార్కెట్‌ దెబ్బతిన్నది. దీనికితోడు కొత్తగా పెద్ద ఉత్పత్తుల లాంచింగ్‌లు లేకపోవడం, ఆర్‌అండ్‌డీ వ్యయాలు తగ్గడం, అనుమతుల్లో జాప్యం,

ఆటో స్టాక్స్‌ అప్‌

Tuesday 11th February 2020

చైనాపై ఆందోళన తగ్గడం.. అంతర్జాతీయ, దేశీయ మార్కెట్‌లు పుంజుకోవడంతో మంగళవారం ఆటో షేర్‌ ఇండెక్స్‌ 0.91 శాతం పెరిగి 7,932.35 వద్ద ట్రేడ్‌ అవుతోంది. టాటా మోటార్స్‌ షేరు 2.84 పెరిగి 173.70 వద్ద, మారుతీ  షేరు 2.37 పెరిగి 7,056.00 వద్ద, బజాజ్‌ ఆటో షేరు 1.41 పెరిగి 43.70 వద్ద, అశోక్‌ లేలాండ్‌ షేరు 1.27 పెరిగి 84.00 వద్ద, హీరో మోటర్‌ కార్ప్‌ షేరు 1.02

Most from this category