News


యాక్సిస్‌ బ్యాంకుపై బ్రోకరేజ్‌లు ఏమంటున్నాయి?!

Thursday 23rd January 2020
Markets_main1579755631.png-31127

 యాక్సిస్‌ బ్యాంకు ఫలితాల నేపథ్యంలో బ్యాంకు షేరుపై బ్రోకరేజ్‌ల అంచనాలు ఇలా ఉన్నాయి..
1. హెచ్‌డీఎఫ్‌సీ సెక్యూరిటీస్‌: అవుట్‌పెర్ఫామ్‌ రేటింగ్‌. టార్గెట్‌ రూ. 830. అధిక ప్రొవిజన్స్‌, స్లిపేజ్‌ల కారణంగా ఆర్థిక సంవత్సరం ఎర్నింగ్స్‌ను తగ్గించింది. బ్యాంకింగ్‌ రంగంలో ఇతర బ్యాంకులకు మంచి పోటీ ఇస్తుందని అంచనా వేసింది. 
2. కోటక్‌ ఇనిస్టిట్యూషనల్‌ ఈక్విటీస్‌: రెడ్యూస్‌ రేటింగ్‌. టార్గెట్‌ రూ. 740. ఆదాయాలు మిశ్రమంగా ఉన్నాయి. ఎన్‌ఐఐ బాగున్నా, ఆదాయ వృద్ధి తగ్గడం, స్లిపేజ్‌లు పెరగడం ఆందోళనకరం. సమీప కాలంలో ప్రొవిజన్లు అధికంగానే ఉంటాయి.
3. సిటి: కొనొచ్చు రేటింగ్‌. టార్గెట్‌ రూ. 850. మంచి ప్రాఫిట్‌ గ్రోత్‌ నమోదు చేసినా, ఆస్తుల నాణ్యతపై ఒత్తిళ్లు నీలినీడలు కమ్మేలా చేస్తున్నాయి. బీబీలో తగ్గింపు, ఎన్‌పీఏ రికవరీతో వచ్చే ఏడాది మంచి ఫలితాలు చూపవచ్చు. వచ్చే ఏడాది లాభాల అంచనాలను కొంత మేర తగ్గించింది. 
4. హెచ్‌ఎస్‌బీసీ: కొనొచ్చు రేటింగ్‌. టార్గెట్‌ రూ. 930. స్లిపేజ్‌లు అధికంగా ఉన్నాయి, కానీ ఇవి కేవలం బీబీ మరియు అల్పరేటింగ్‌అసెట్స్‌ కారణంగా వచ్చాయి. బ్యాంకు చూపుతున్న స్థిర ప్రదర్శన క్రమంగా రీరేటింగ్‌కు దారితీయగలదు.
5. క్రెడిట్‌ సూసీ: అవుట్‌పెర్ఫామ్‌ రేటింగ్‌. టార్గెట్‌ రూ. 850. కార్యనిర్వాహక ప్రదర్శన స్థిరంగా ఉంది. సీఈటీ 14.3 శాతం వద్ద ఉండడం సౌకర్యవంతమైన స్థాయిగా చెప్పవచ్చు. బ్యాంకు తన మార్కెట్‌ షేరును క్రమంగా పెంచుకుంటుంది. అయితే అధిక వడ్డీవ్యయాల కారణంగా అంచనాలను 5- 23 శాతం మేర తగ్గించింది. 



You may be interested

ఎల్‌అండ్‌టీ టెక్‌, ఉజ్జీవన్‌ జోరు- ఐటీఐ బోర్లా

Thursday 23rd January 2020

కరోనా వైరస్‌ భయాలతో ప్రపంచ స్టాక్‌ మార్కెట్లు నీరసించినప్పటికీ దేశీ స్టాక్‌ మార్కెట్లు సానుకూలంగా ప్రారంభమ్యాయి. ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు ఆసక్తి చూపడంతో లాభాలతో కదులుతున్నాయి. ఉదయం 10.20 ప్రాంతంలో సెన్సెక్స్‌ డబుల్‌ సెంచరీ చేసింది. 208 పాయింట్లు పెరిగి 41,324కు చేరింది. నిఫ్టీ సైతం 63 పాయింట్లు పుంజుకుని 12,169 వద్ద ట్రేడవుతోంది. ఈ నేపథ్యంలో విభిన్న వార్తల ఆధారంగా ఐటీ సేవల కంపెనీ ఎల్‌అండ్‌టీ టెక్నాలజీ సర్వీసెస్‌, ఉజ్జీవన్‌

నేటి వార్తల్లోని షేర్లు

Thursday 23rd January 2020

వివిధ వార్తలకు అనుగుణంగా గురువారం ప్రభావితమయ్యే షేర్లు కర్ణాటక బ్యాంక్‌: మూలధన సమీకరణ ప్రతిపాదనలను కర్ణాటక బ్యాంక్‌ బోర్డు జనవరి 27న పరిశీలించనుంది. రేమండ్‌: క్యూ3 నికర లాభం పెరిగి రూ.43 కోట్లనుంచి రూ.197 కోట్లకు చేరింది. వార్షిక ప్రాతిపదికన గతేడాది క్యూ3లో ఉన్న నికర ఆదాయం రూ.1,675 కోట్లనుంచి 12.5 శాతం పెరిగి రూ.1,885 కోట్లకు చేరింది. సియట్‌: సియట్‌ క్యూ3 నికర లాభం దాదాపు యదాతధంగా రూ.53 కోట్లుగా నమోదైంది. వార్షిక

Most from this category