News


వేల్యూ, డివిడెండ్‌ స్టాక్స్‌కే పట్టం?!

Tuesday 4th February 2020
Markets_main1580799818.png-31497

- ఐసీఐసీఐ ప్రుడెన్షియల్‌ ఏఎంసీ 
రుణ వృద్ధి 6-7 శాతం స్థాయిలో నమోదవుతుంటే.. ఆర్థిక వ్యవస్థ రికవరీకి అవకాశాలు తక్కువేనంటూ ఐసీఐసీఐ ప్రుడెన్షియల్‌ ఏఎంసీ ఈడీ, సీఐవో ఎస్‌.నరేన్‌ పేర్కొంటున్నారు. బ్యాంకులు భారీ నగదు నిల్వలు కలిగి ఉన్నప్పటికీ రుణాల విడుదలకు ఆసక్తి చూపడంలేదని తెలియజేశారు. రుణ వితరణకు ఎందుకు ముందుకు రావడంలేదన్న అంశంపై బ్యాంకులు వివరణ ఇవ్వవలసి ఉన్నట్లు వ్యాఖ్యానించారు. ఒక ఆంగ్ల చానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మార్కెట్లతోపాటు.. డివిడెండ్‌ పంపిణీ పన్ను(డీడీటీ) రద్దు, పెట్టుబడి అవకాశాలు తదితర పలు అంశాలపై అభిప్రాయాలను వ్యక్తం చేశారు. వివరాలు చూద్దాం..

డీడీటీ రద్దుపై
డీమెటీరియలైజేషన్‌కంటే ముందు డివిడెండ్‌ పంపిణీ పన్నును ప్రారంభించారు. భారీ సం‍ఖ్యలో ఇన్వెస్టర్లు డివిడెండ్లపై పన్ను చెల్లింపులను తప్పించుకుంటున్నారన్న ఆలోచనతో డీడీటీ ప్రారంభమైంది. ప్రస్తుతం అన్నింటా డీమ్యాట్‌కు తెరతీశారు. టీడీఎస్‌ ప్రొవిజన్లు అత్యంత సమర్థవంతంగా అమలవుతున్నాయి. తాజా పన్ను విధానాల వల్ల అధిక శ్లాబుల్లో ఉన్న వ్యక్తులపై భారం పెరగనుంది. తక్కువ ఆదాయం ఆర్జించేవారికి లబ్ది కలగనుంది. ఇదేవిధంగా డీడీటీ విషయంలోనూ 43-38 శాతం శ్లాబుల్లో ఉన్న వ్యక్తుల చెల్లింపులు పెరగనుండగా.. కనిష్ట ఆదాయంగలవారికి మేలు జరగనుంది. 

కరోనా..?
కరోనా వైరస్‌ కారణంగా సమీపకాలంలో ఆందోళనలు కొనసాగుతాయి. ఇది హెచ్చుతగ్గుల మార్కెట్‌కు దారిచూపుతుంది. అయితే వేసవి వస్తే వైరస్‌కు చెక్‌ పడుతుంది. గతంలో తలెత్తిన సార్స్‌ ఆందోళనల తరహాలోనే పరిస్థితులు చక్కబడతాయి. అయితే ప్రస్తుత కరోనా భయాలు ఎంతవరకూ కొనసాగుతాయన్నది వేచిచూడాలి. కరోనా పరిస్థితులు విచారకరమే అయినా ఇన్వెస్టర్లు, పెట్టుబడులపై ఇది ప్రభావం చూపే అవకాశాలు తక్కువే. ఇక బడ్జెట్‌ విషయానికి వస్తే.. 1990ల నుంచీ చూస్తూనే ఉన్నాం. అనేక ఆశల మధ్య పలు నిర్ణయాలు వెలువడుతుంటాయి. నిజానికి పలు పశ్చిమ దేశాలతో పోలిస్తే.. ఇక్కడ అమలవుతున్న పన్ను రేట్లు అధికంకాదు. కాగా.. సెప్టెంబర్‌లో కేంద్ర ప్రభుత్వం కార్పొరేట్‌ ట్యాక్స్‌లో కోత పెట్టడం ద్వారా దేశానికి అతిపెద్ద లబ్ది చేకూరింది. బడ్జెట్‌పై సర్వదా అధిక అంచనాలుంటాయి. దీంతో​సహజంగానే జనవరి, మార్చి తదితర సమయాల్లో మార్కెట్లో దిద్దుబాట్లు జరుగుతుంటాయి.

బీమా అందుకుకాదు..
నిజానికి బీమా పాలసీలను పన్ను మినహాయింపుల కోసమే ప్రజలు కొనుగోలు చేయరు. రక్షణకే అధిక ప్రాధాన్యత ఉంటుంది. ఆదాయపన్ను తాజా సవరణల కారణంగానే బీమా రంగ కౌంటర్లలో అమ్మకాలు పెరిగి ఉంటే.. ఇది మరిన్ని అవకాశాలను కల్పిస్తుంది. డివిడెండ్‌ ఈల్డ్‌ రూపేణా మూడు నెలల కిందటే.. బీమా రంగంపట్ల సానుకూల ధృక్పథాన్ని వ్యక్తం చేశాం. వేల్యూ, డివిడెండ్‌ ఈల్డ్‌, ప్రత్యేక పరిస్థితులు వంటి అంశాలకు పెట్టుబడుల విషయంలో ప్రాధాన్యత ఇస్తాం. రానున్న మూడు నుంచి ఐదేళ్ల కాలంలో ఇదే ట్రెండ్‌ నడిచే అవకాశముంది. 

రికవరీపై ఆశలు
ఆర్థిక రివకరీపై ఇటీవల ఆశలు పుడుతున్నాయి. చమురునే తీసుకుంటే.. బ్యారల్‌ 55 డాలర్లకు చేరుకుంటే పరపతి విధానాలలో రిజర్వ్‌ బ్యాంక్‌కు మరిన్ని అవకాశాలు లభిస్తాయి. ప్రస్తుతం దేశీయంగా పలు సానుకూలతలు కనిపిస్తున్నాయి. అయితే భారీ నగదు నిల్వలున్నప్పటికీ బ్యాంకులు రుణాలిచ్చేందుకు ఆసక్తి చూపడంలేదు. రుణాలకు ఎందుకు డిమాండ్‌ లేదన్న అంశాన్ని బ్యాంకులు ఆలోచించవలసి ఉంది. ఎందుకంటే కార్పొరేట్లు అత్యంత చౌకగా 5 శాతానికి లభిస్తున్న మూడు నెలల రుణాలను తీసుకుంటున్నాయి. బ్యాంకులు క్రెడిట్‌ గ్రోత్‌ సాధించడాన్ని కీలకంగా చెప్పవచ్చు. ప్రస్తుతం నమోదవుతున్న 6-7 శాతం రుణ వృద్ధితో ఆర్థిక రికవరీని సాధించడం కష్టమే. You may be interested

గంటన్నరలో పెరిగిన ఇన్వెస్టర్ల సంపద రూ.2లక్షల కోట్లు

Tuesday 4th February 2020

కరోనా వైరస్‌ వ్యాధి వ్యాప్తి కారణంగా డిమాండ్‌ తగ్గుదల భయాలతో అంతర్జాతీయంగా ముడిచమురు ధరలు 13నెలల కనిష్టానికి పతనం కావడం దేశీయంగా మార్కెట్‌ సెంటిమెంట్‌ను బలపరిచింది. మార్కెట్లో కొనసాగుతున్న కొనుగోళ్ల పర్వంలో భాగంగా ఇన్వెస్టర్ల సంపదగా పరిగణించే బీఎస్‌ఈలో లిస్టైన మొత్తం కంపెనీల మార్కెట్‌ క్యాప్‌ కేవలం 90నిమిషాల్లో రూ.2లక్షల కోట్ల లాభపడింది. మార్కెట్‌ ముగిసే సరికి బీఎస్‌ఈ మార్కెట్‌ క్యాప్‌ రూ.153.72లక్షల కోట్లుండగా, మిడ్‌ సెషన్‌ కల్లా రూ.155.72లక్షల

నాలుగు ఐపీఓలకు సెబీ అనుమతి

Tuesday 4th February 2020

ప్రైవేటు రంగంలో నాలుగు కంపెనీలు పబ్లిక్‌ ఇష్యూలు జారీ చేసేందుకు సెబీ అనుమతించింది. వీటిలో ఆన్‌లైన్‌ ట్రావెల్‌ కంపెనీ అయిన ఈజీ మై ట్రిప్‌, రియాల్టి రంగానికి చెందిన పురానిక్‌ బిల్డర్స్‌, మాంటే కార్లో, కెమెకాన్‌ స్పెషాలిటీ కెమికల్స్‌ ఉన్నాయి. ఇటీవల పార్లమెంట్‌లో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌  ప్రవేశపెట్టిన ఈ ఏడాది బడ్జెట్‌లో ఎల్‌ఐసీలోకి పబ్లిక్‌ ఇష్యూ జారీ చేయనున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే.   

Most from this category