వాల్యూ బయింగ్‌తో మిడ్‌క్యాప్స్ జోరు!
By D Sayee Pramodh

ఎంపిక చేసిన మిడ్‌క్యాప్స్‌లో వాల్యూబయింగ్ కొనసాగుతుందని, దీంతో మిడ్‌క్యాప్స్‌లో ర్యాలీకి మరింత అవకాశం ఉంటుందని ప్రముఖ బ్రోకరేజ్ సంస్థ సీఎల్ఎస్ఏ అంచనా వేసింది. గత రెండు వారాల్లో ప్రధాన సూచీ 2.2 శాతం ర్యాలీ జరపగా, మిడ్‌క్యాప్ సూచీ 4.5 శాతం, స్మాల్‌క్యాప్ సూచీ 7.5 శాతం పరుగు తీశాయి. ఈ ఏడాది జరిగే సాధారణ ఎన్నికలతో మార్కెట్లో ఆటుపోట్లు ఉంటాయని సీఎల్ఎస్ఏ పేర్కొంది. గత మూడు దఫాలుగా ఎన్నికల అనంతరం మిడ్‌క్యాప్స్ మంచి జోరు చూపాయని, ఈసారి కూడా ఇదే తరహా కొనసాగవచ్చని అంచనా వేసింది. మిడ్‌క్యాప్స్‌లో గత కరెక్షన్ తర్వాత పలు బాటమ్ అవుట్ అవకాశాలు కనిపిస్తున్నాయని వివరించింది. అయితే ప్రమోటర్ల ప్లెడ్జింగ్ అధికంగా ఉన్న మిడ్‌క్యాప్స్ జోలికి పోవద్దని హెచ్చరించింది. ప్రస్తుతం మిడ్‌క్యాప్స్‌లో 40 శాతం స్టాకులు వాటి ఐదేళ్ల పీఈ మల్టిపుల్స్ కన్నా దిగువన ట్రేడవుతున్నాయి. ఎన్ఎస్ఈ మిడ్‌క్యాప్స్‌లో 44 శాతం కంపెనీలు ఇలా కనిష్ఠ పీఈల వద్ద ఉన్నాయని, వీటిలో పలు నాణ్యమైన స్టాకులున్నాయని సీఎల్ఎస్ఏ తెలిపింది. గతంలో కూడా భారీ కరెక్షన్స్ అనంతరం చిన్న స్టాకులు వేగంగా రికవరీ సాధించిన దాఖలాలున్నాయని పేర్కొంది. ప్రస్తుతం కన్జూమర్, టెక్, పవర్, ఈపీసీ కంపెనీల్లో చాలా కంపెనీల స్టాకులు ఐదేళ్ల పీఈకి దిగువన ట్రేడవుతున్నాయని తెలిపింది. ఇలాంటి వాటిలో సద్భావ్ ఇంజనీరింగ్స్ షేరు చాలా ఆకర్షణీయంగా ఉందని అభిప్రాయపడింది. ఇటీవల కనిష్ఠాల నుంచి షేరు 44 శాతం ర్యాలీ జరిపినా, ఇంకా ఆకర్షణీయమైన వాల్యూషన్ల వద్దనే ఉందని తెలిపింది.
You may be interested
ఓలాలో 25 కోట్ల డాలర్ల హ్యుందాయ్ పెట్టుబడులు
Saturday 9th March 2019-4 శాతం వాటా కొనుగోలు -తుది దశలో డీల్ -ఓలా విలువ రూ.42,000 కోట్లు ! బెంగళూరు: ట్యాక్సీ అగ్రిగేటర్, ఓలాలో హ్యుందాయ్ కంపెనీ భారీగా పెట్టుబడులు పెట్టనున్నదని సమాచారం. ఓలా కంపెనీలో కొంత వాటా(సుమారుగా 4 శాతం) కొనుగోలు కోసం హ్యుందాయ్ 25 కోట్ల డాలర్లు పెట్టుబడులు పెట్టనున్నదని సంబంధిత వర్గాలు వెల్లడించాయి. పెట్టుబడి సంబంధిత చర్చలు చివరి దశలో ఉన్నాయని, మరికొన్ని వారాల్లో డీల్ కుదిరే అవకాశాలున్నాయని ఆ వర్గాలు పేర్కొన్నాయి.
వాహన కంపెనీల ఫ్రెండ్లీ షికారు
Saturday 9th March 2019- బీఎస్-6 నిబంధనల అమలుకు కొత్త దోస్తీలు - టాటా హారియర్‌కు.. ఫియట్ ఇంజిన్ - టాటాతో పాటు ఎంజీకి కూడా ఫియట్దే - ఫోర్డ్‌కు మాత్రం మహీంద్రా నుంచి సరఫరా - టెక్నాలజీ విషయంలోనూ కొత్త ఒప్పందాలు - కొత్త రూపంలో దర్శనమివ్వనున్న స్కోడా (సాక్షి, బిజినెస్ విభాగం) కానోడికి కానోడు మనోడనేది నానుడి. కానీ ఇపుడు వాహన పరిశ్రమలో పరిస్థితి దీనికి భిన్నంగా ఉంది. కంపెనీలు పోటీ కంపెనీల్ని ప్రత్యర్థులుగా భావించడం మానేస్తున్నాయి. ప్రతి కంపెనీ... తోటి