News


టైమ్ టెక్నోప్లాస్ట్ కొనవచ్చు: కోట‌క్ సెక్యూరిటీస్‌

Saturday 5th January 2019
Markets_main1546681777.png-23421

ప్యాకేజింగ్ రంగ‌ంలో పాతికేళ్లుగా సేవ‌లు అందిస్తున్న టైమ్ టెక్నోప్లాస్ట్ షేరును కొనమ‌ని ప్రముఖ బ్రోకరేజ్‌ సంస్థ కోట‌క్ సెక్యూరిటీస్ సూచిస్తుంది. టైమ్ టెక్నోప్లాస్ట్ షేరుపై కోట‌క్ విశ్లేష‌ణ‌లు ఎలా  ఉన్నాయో ఇప్పుడు చూద్దాం..!
విశ్లేష‌ణ‌:-
ముడి స‌ర‌కు ధ‌రల‌ మార్జిన్లు పెర‌గ‌డంతో ప్రస్తుత ఆర్థిక సంవ‌త్సరం రెండో త్రైమాసికంలోటైమ్ టెక్నోప్లాస్ట్ కంపెనీ బ‌ల‌హీన ఆర్థిక గ‌ణాంకాలకు న‌మోదు చేసింది. అయితే, గ‌త కొన్నివారాలుగా ప్రధాన ముడి సరుకైన హై డెన్షిటీ పాలిథిలిన్ ధ‌ర‌లు క్రమంగా త‌గ్గుతూ వ‌స్తున్నాయి. త‌ద్వారా ముడిస‌రుకు మార్జిన్లు అధిక స్థాయిల నుంచి సాధార‌ణ స్థాయిల‌కు దిగివ‌స్తాయి. విలువ ఆధారిత ఉత్పత్తుల యొక్క వాటా పెరుగుతుందనే అంచ‌నాల‌తో 2019-20 ఆర్థిక సంవత్సరంలో కంపెనీ ఆదాయం 15శాతం వృద్ధి చెంద‌టంతో పాటు ఎబిటా మార్జిన్లు పెరుగతాని బ్రోకరేజ్‌ సంస్థ అంచ‌నా వేస్తుంది.
1). ఇటీవ‌ల మిడ్‌క్యాప్‌, స్మాల్‌క్యాప్ షేర్లలో నెల‌కొన్న అమ్మకాల సునామి,
2). క్యూ2 ఫ‌లితాలు ఆశించిన‌స్థాయిలో న‌మోదుకాక‌పోవ‌డం,
3). ప్రమోట‌ర్ల కంపెనీలో వాటాల‌ను విక్రయించ‌డంతో ఇన్వెస్టర్లు ఆందోళ‌నల‌కు లోన‌వ‌డం త‌దిత‌ర ప్రతికూలాంశాల‌తో  టైమ్ టెక్నోప్లాస్ట్ షేరు విలువ భారీగా న‌ష్టపోయింది.  ప్రస్తుత షేరు ధ‌ర, వ్యాల్యూవేష‌న్ ఆక‌ర్షణీయంగా ఉన్నాయి. కాబ‌ట్టి షేరుకు బై రేటింగ్ కేటాయింపుతో పాటు షేరు ప్రస్తుత ధ‌ర నుంచి టార్గెట్ ధ‌రను రూ.128ల‌కు పెంచుతున్నామని కోట్‌ సెక్యూరిటీ తెలిపింది.
(టైమ్ టెక్నోప్లాస్ట్ షేరుపై కోట‌క్ సెక్యూరిటీ స‌మ‌గ్ర విశ్లేష‌ణ కొర‌కు కింద లింక్‌ను ఓపెన్ చేయ‌గ‌ల‌రు.)

View Pdf One (1546681824TimeTech_31Dec18_Kotak_PCG_00615.pdf)

You may be interested

ఆనంద్‌ రాఠి సూచించిన వాల్యూ పిక్‌ ఇదే

Saturday 5th January 2019

ఎలక్ట్రికల్‌ ఉత్పత్తులు, గృహోపకరణాలు తయారు చేసే హావెల్స్ ఇండియా షేరుకు ప్రముఖ రేటింగ్ సంస్థ ఆనంద్ రాఠి బుల్లిష్ రేటింగ్‌ను కేటాయించింది. విద్యుత్ స‌ర‌ఫ‌రా ప‌రిక‌రాల త‌యారీ రంగంలో అగ్రగామిగా వెలుగొందుతున్న హావెల్స్ షేరుకు బ‌ల‌మైన ఫండ‌మెంటల్‌తో కంపెనీ ధీర్ఘకాలంలో అత్యున్నత స్థితికి చేరుంద‌ని బ్రోక‌రేజ్ సంస్థ చెప్పుకొచ్చింది.  కంపెనీ షేరు టార్గెట్ ధ‌రను రూ.788లకు పెంచింది. షేరుపై బ్రోక‌రేజ్ సంస్థ మ‌రింత‌ విశ్లేష‌ణ‌ను ఇప్పుడు చూద్దాం... 1). ప్రస్తుత ఆర్థిక

పసిడిలో లాభాలో స్వీకరణ

Saturday 5th January 2019

ప్రపంచమార్కెట్లో పసిడి ధర 7నెలల గరిష్టస్థాయి వద్ద లాభాల స్వీకరణకు లోనైంది. ఆర్థిక వృద్ధి మందగమనతో పలు ఈక్విటీ మార్కెట్లో నెలకొన్న అస్థితరతో  పసిడి ధర క్రితం ట్రేడింగ్‌లో 7నెలల గరిష్టాన్ని(1300డాలర్లు)తాకిన సంగతి తెలిసిందే. అమెరికా నిరుద్యోగాల గణాంకాలు విశ్లేషకుల అంచనాలను మించి రెట్టింపు నమోదుకావడంతో రాత్రి అమెరికా ఈక్విటీ మార్కెట్లు 3శాతానికి పైగా లాభపడ్డాయి. మరోవైపు ఫెడ్‌ రిజర్వ్‌ ఛైర్మన్‌ జెరోమ్‌ పావెల్‌ కీలక వడ్డీరేట్లపై మెతక వైఖరీ

Most from this category