News


ఈ వారం స్టాక్‌ రికమెండేషన్లు

Monday 3rd February 2020
Markets_main1580702245.png-31455

ఎస్‌బీఐ:    కొనచ్చు
బ్రోకరేజ్‌ సంస్థ: ఐసీఐసీఐ డైరెక్ట్‌
ప్రస్తుత ధర: రూ.303
టార్గెట్‌ ధర: రూ.400
ఎందుకంటే: దేశీయ బ్యాంకింగ్‌ దిగ్గజం స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా(ఎస్‌బీఐ) ఈ ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసిక ఆర్థిక ఫలితాలు అంచనాలను మించాయి. రుణ నాణ్యత మెరుగుపడింది. స్థూల మొండి బకాయిలు 6.94 శాతానికి, నికర మొండి బకాయిలు 2.65 శాతానికి తగ్గాయి. సీక్వెన్షియల్‌గా చూస్తే, మొండి బకాయిలకు కేటాయింపులు రూ.11,041 కోట్ల నుంచి రూ.8,193 కోట్లకు చేరాయి. ఎస్సార్‌ స్టీల్‌ బకాయిలు రికవరీ కావడం, ఈ బకాయిలకు జరిపిన కేటాయింపులను రైటాఫ్‌ చేయడం దీనికి కారణం. ఈ క్యూ2లో 81.23 శాతంగా ఉన్న ప్రొవిజనల్‌ కవరేజ్‌ రేషియో ఈ క్యూ3లో 81.73 శాతానికి పెరిగింది. రిటైల్‌ రుణాలు 18 శాతం, మొత్తం రుణాలు 7 శాతం మేర వృద్ధి చెందాయి. డిపాజిట్లు 10 శాతం వృద్ధితో రూ,.31.11 లక్షల కోట్లకు పెరిగాయి. నికర వడ్డీ ఆదాయం 22 శాతం వృద్ధితో రూ.27,779 కోట్లకు పెరిగింది. నికర వడ్డీ మార్జిన్‌ 3.59 శాతానికి చేరింది. ఇక నికర లాభం 41 శాతం వృద్ధితో రూ.5,583 కోట్లకు పెరిగింది. రూ.1,333 కోట్ల పన్ను సర్దుబాటు కారణంగా నికర లాభం కొంచెం తగ్గింది. రెండేళ్లలో రుణాలు 12 శాతం, డిపాజిట్లు 9 శాతం చొప్పున చక్రగతిన వృద్ధి చెందగలవని అంచనా. 2021-22 నాటికి రిటర్న్‌ ఆన్‌ ఈక్విటీ (ఆర్‌ఓఈ) 14 శాతానికి పెరగగలదని భావిస్తున్నాం. క్రెడిడ్‌ కార్డ్‌ విభాగం-ఎస్‌బీఐ కార్డ్స్‌లో వాటా విక్రయం ద్వారా నిధులు రానుండటం, వచ్చే ఆర్థిక సంవత్సరంలో రూ.20,000 కోట్ల మేర నిధులు సమీకరించనుండటం, రుణ వృద్ధి క్రమంగా పుంజుకోవడం, రుణ రికవరీలు మెరుగుపడుతుండటం.... సానుకూలాంశాలు. 


హిందుస్తాన్‌ యూనిలీవర్‌    కొనచ్చు
బ్రోకరేజ్‌ సంస్థ: మోతిలాల్‌ ఓస్వాల్‌
ప్రస్తుత ధర: రూ.2,074
టార్గెట్‌ ధర: రూ.2,280
ఎందుకంటే: ఎఫ్‌ఎమ్‌సీజీ దిగ్గజ కంపెనీ, హిందుస్తాన్‌ యూనిలీవర్‌(హెచ్‌యూఎల్‌) ప్రస్తుత ఆర్థిక సంవత్సరం డిసెంబర్‌ క్వార్టర్‌ ఫలితాలు అంచనాలను మించాయి. డిమాండ్‌ బలహీనంగా ఉన్నప్పటికీ, గత క్యూ3లో హై బేస్‌ అయినప్పటికీ, అమ్మకాలు 5 శాతం పెరిగాయి. నిర్వహణ, నికర లాభాలు చెరో 20 శాతం మేర పెరగడం విశేషం. నికర అమ్మకాలు 3 శాతం వృద్ధితో రూ.98,000 కోట్లకు పెరిగాయి. నిర్వహణ లాభం 20 శాతం వృద్ధితో రూ.2,450 కోట్లకు, నికర లాభం 21 శాతం వృద్ధితో రూ.1,690 కోట్లకు పెరిగాయి. నిర్వహణ లాభ మార్జిన్‌ 3.5 శాతం ఎగసి 24.9 శాతానికి చేరింది. రానున్న నెలల్లో సబ్బుల ధరలను 5-6 శాతం రేంజ్‌లో పెంచనున్నది. అమ్మకాలు, మార్కెట్‌ వాటాను పెంచుకోవడానికి ఉద్దేశించిన విన్నింగ్‌ మెనీ ఇండియాస్‌(డబ్ల్యూఐఎమ్‌ఐ) వ్యూహం సత్ఫలితాలనిస్తోంది. మారుతున్న మార్కెట్‌ అవసరాలకు అనుగుణంగా ఉత్పత్తులను అందిస్తోంది. మార్జిన్లు అధికంగా వచ్చే ప్రీమియమ్‌ ఉత్పత్తులను పెంచుతోంది. గ్లాక్సో స్మిత్‌లైన్‌ కన్సూమర్‌ హెల్త్‌ (జీఎస్‌కేసీహెచ్‌)విలీనానికి నేషనల్‌ కంపెనీ లా ట్రైబ్యునల్‌(ఎన్‌సీఎల్‌టీ) ఆమోదం లభించనుండటం,  జీఎస్‌కేసీహెచ్‌ విలీనం కారణంగా షేర్‌ వారీ ఆర్జన(ఈపీఎస్‌) 10 శాతం పెరగనుండటం, రాబడి నిష్పత్తులు అధిక స్థాయిల్లో ఉండటం, టెక్నాలజీని విస్తృతంగా వినియోగించుకోవడం... సానుకూలాంశాలు. You may be interested

ఈటీఎఫ్‌ల్లో ఇన్వెస్ట్‌ చేయవచ్చా ?

Monday 3rd February 2020

(ధీరేంద్ర కుమార్‌ సీఈవో వ్యాల్యూ రీసెర్చ్‌) ప్ర: నేను గత కొంత కాలంగా మిడ్‌, స్మాల్‌ క్యాప్‌ ఫండ్స్‌లో ఇన్వెస్ట్‌ చేస్తున్నాను. అయితే వీటి రాబడులు ఇప్పుడు అంతంతమాత్రంగానే ఉన్నాయి. వీటిల్లో నా ఇన్వెస్ట్‌మెంట్స్‌ కొనసాగించమంటారా ? ఆపేయమంటారా ? ఒకవేళ అపేస్తే, ఏ కేటగిరీ ఫండ్స్‌లోకి మళ్లించమంటారు? -సిద్ధార్థ, హైదరాబాద్‌  జ: దీర్ఘకాలం పాటు ఇన్వెస్ట్‌ చేయాలనకుంటేనే మిడ్‌, స్మాల్‌ క్యాప్‌ ఫండ్స్‌ను ఎంచుకోవాలి. కనీసం ఐదు నుంచి ఏడు సంవత్సరాలు పాటు

పన్ను వసూళ్ల లక్ష్యం కుదింపు

Monday 3rd February 2020

కొత్త శ్లాబ్‌లు ట్యాక్స్‌పేయర్లకు ప్రయోజనకరమే సీబీడీటీ చైర్మన్ పీసీ మోదీ వెల్లడి న్యూఢిల్లీ: వివిధ ఆర్థిక అంశాల వాస్తవిక స్థితిగతులను మదింపు చేసిన మీదట కేంద్ర బడ్జెట్‌లో ప్రత్యక్ష పన్ను వసూళ్ల లక్ష్యాన్ని దిగువముఖంగా రూ. 11.80 లక్షల కోట్లకు సవరించినట్లు సెంట్రల్‌ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్సెస్ (సీబీడీటీ) చైర్మన్ పీసీ మోదీ వెల్లడించారు. "2019-20లో వ్యక్తిగత, కార్పొరేట్ ఆదాయ పన్ను మొదలైన ప్రత్యక్ష పన్నుల వసూళ్లను రూ. 13.35 లక్షల

Most from this category