STOCKS

News


రెండు వారాలకు స్టాక్‌ రికమండేషన్స్‌

Tuesday 11th February 2020
Markets_main1581403620.png-31688

జాబితాలో టాటా మోటార్స్‌, బయోకాన్‌
అరబిందో ఫార్మా, ఆల్కెమ్‌ లేబ్‌, టైటన్‌
రీసెర్చ్‌, బ్రోకింగ్‌ సంస్థల సిఫారసులు

బడ్జెట్‌, కరోనా వైరస్‌ నేపథ్యంలో వెనకడుగు వేసిన దేశీ స్టాక్‌ మార్కెట్లు తిరిగి జోరం‍దుకున్నాయి. సెన్సెక్స్‌ 400 పాయింట్లు జంప్‌చేయడం ద్వారా తిరిగి 41,000 పాయింట్ల మార్క్‌ను అధిగమించింది. ఈ పరిస్థితుల్లో రానున్న రెండు వారాలలో రిటర్నులు అందించగల కొన్ని స్టాక్స్‌ను హెచ్‌డీఎఫ్‌సీ సెక్యూరిటీస్‌, కొటక్‌ సెక్యూరిటీస్‌ తదితర రీసెర్చ్‌, బ్రోకింగ్‌ సంస్థల నిపుణులు సిఫారసు చేస్తున్నారు. వివరాలు చూద్దాం.. 

శ్రీకాంత్‌ చౌహాన్‌, ఎస్‌వీపీ టెక్నికల్‌ రీసెర్చ్‌, కొటక్‌ సెక్యూరిటీస్‌
బయోకాన్‌: కొనుగోలు చేయవచ్చు
టార్గెట్‌: రూ. 325        స్టాప్‌లాస్‌: రూ. 300
బయోకాన్‌ కౌంటర్‌ ప్రైస్‌, వాల్యూమ్‌ బ్రేకవుట్‌ సాధించింది. కన్సాలిడేషన్‌ నుంచి బయటపడింది. చార్టుల ప్రకారం జోరందుకునేందుకు సిద్ధంగా ఉంది. సమీపకాలంలో పటిష్ట ర్యాలీకి చాన్స్‌ ఉంది. రూ. 300 వద్ద స్టాప్‌లాస్‌ పెట్టుకుని రూ. 304 వరకూ కొనుగోలు చేయవచ్చు. ఈ షేరుకి టార్గెట్‌ ధర రూ. 325.

టాటా మోటార్స్‌: కొనుగోలు చేయవచ్చు
టార్గెట్‌: రూ. 190        స్టాప్‌లాస్‌: రూ. 167
బడ్జెట్‌ తదుపరి టాటా మోటార్స్‌ షేరు 4 శాతం బలపడి రూ. 173కు చేరింది. స్వల్ప కాలంలో హైయర్‌ బాటమ్‌ను నమోదు చేస్తోంది. దీంతో ఇకపై మరింత పుంజుకునేందుకు వీలుంది. ప్రస్తుతం రీట్రేస్‌మెంట్‌ స్థాయికి చేరువలో ఉంది. రూ. 167 వద్ద మద్దతు లభించే వీలుంది. ఈ స్థాయికి ఎగువన ట్రేడైతే రూ. 190 వరకూ ర్యాలీ చేయవచ్చు.  రూ. 167 దిగువన స్టాప్‌లాస్‌ పెట్టుకోవడం మేలు.

మజర్‌ మొహ్మద్‌, చీఫ్‌ స్ట్రాటజిస్ట్‌, చార్ట్‌వ్యూఇండియా.ఇన్‌
అరబిందో ఫార్మా: కొనుగోలు చేయవచ్చు
టార్గెట్‌: రూ. 597        స్టాప్‌లాస్‌: రూ. 513
అరబిందో ఫార్మా షేరు ప్రస్తుతం మీడియం టెర్మ్‌ అప్‌ట్రెండ్‌లో కనిపిస్తోంది. అధిక పరిమాణంతో 50 రోజుల అసెండింగ్‌ చానల్‌ నుంచి బ్రేకవుట్‌ సాధించింది. దీంతో మధ్యంతర టాప్‌ రూ. 639వైపు ఈ స్టాక్‌ ర్యాలీ చేయవచ్చు. అయితే వారాంతాన నమోదైన భారీ ట్రేడింగ్‌ నేపథ్యంలో తొలి లక్ష్యంగా రూ. 597 టార్గెట్‌ ధరతో  రూ. 530-520 వద్ద కొనుగోలు చేయవచ్చు. రూ. 513 దిగువన స్టాప్‌ లాస్‌ పెట్టుకోవాలి.

బ్యాం‍క్‌ ఆఫ్‌ బరోడా: కొనుగోలు చేయవచ్చు
టార్గెట్‌: రూ. 101        స్టాప్‌లాస్‌: రూ. 85
ఈ కౌంటర్‌ రూ. 104-85 మధ్య కన్సాలిడేట్‌ అవుతోంది. ఇటీవల కరెక‌్షన్‌ నేపథ్యంలో రూ. 85 వద్ద నుంచి బౌన్స్‌ కావడం ద్వారా డబుల్‌ బాటమ్‌ ఏర్పడింది. ఈ స్థాయికి ఎగువన నిలిస్తే.. రూ. 104 వరకూ పెరగవచ్చు. రూ. 101 టార్గెట్‌ ధరతో రూ. 89-86 స్థాయిల వరకూ కొనుగోలు చేయవచ్చు. రూ. 85 దిగువన స్టాప్‌ లాస్‌ పెట్టుకోవాలి.

వైశాలీ పరేఖ్‌, టెక్నికల్‌ రీసెర్చ్‌ హెడ్‌, ప్రభుదాస్‌ లీలాధర్‌
ఎస్‌బీఐ లైఫ్‌: కొనుగోలు చేయవచ్చు
టార్గెట్‌: రూ. 101        స్టాప్‌లాస్‌: రూ. 85
స్వల్ప కాలంలో ఎస్‌బీఐ లైఫ్‌ షేరు కరెక‌్షన్‌ను చవిచూసి రూ. 885 వద్ద బాటమ్‌ ఔట్‌ను సాధించింది. ఈ స్థాయి నుంచి బలపడుతున్నట్లు కనిపిస్తోంది. దీంతో రానున్న రోజుల్లో మరింత పుంజుకునే వీలుంది. ఓవర్‌సోల్డ్‌ జోన్‌ నుంచి ఈ షేరు రికవరీ సాధించినట్లు ఆర్‌ఎస్‌ఐ సైతం వెల్లడిస్తోంది. రూ. 1040 టార్గెట్‌ ధరతో కొనుగోలు చేయవచ్చు. రూ. 900 వద్ద స్టాప్‌ లాస్‌ మెయిన్‌టెయిన్‌ చెయ్యాలి.

వెల్‌స్పన్‌ ఎం‍టర్‌ప్రైజెస్‌: కొనుగోలు చేయవచ్చు
టార్గెట్‌: రూ. 100    స్టాప్‌లాస్‌: రూ. 77 
వెల్‌స్పన్‌ ఎం‍టర్‌ప్రైజెస్‌ కౌంటర్‌ ఇటీవల నిలకడగా క్షీణిస్తూ వచ్చింది. రూ. 77 సమీపంలో డౌన్‌ట్రెండ్‌ నుంచి బయటపడింది. హైయర్‌ బాటమ్‌ నమోదుకావడంతో ఇకపై పుంజుకునే అవకాశముంది. ఇందుకు పెరిగిన ట్రేడింగ్‌ పరిమాణం సైతం సంకేతాలిస్తోంది. రూ. 77 వద్ద స్టాప్‌లాస్‌ పెట్టుకుని రూ. 100 టార్గెట్‌ ధరతో కొనుగోలు చేయవచ్చు.

సమీత్‌ చవన్‌, చీఫ్‌ అనలిస్ట్‌, టెక్నికల్‌, డెరివేటివ్స్‌, ఏంజెల్‌ బ్రోకింగ్‌
చోళమండలం ఇన్వెస్ట్‌మెంట్‌: కొనుగోలు చేయవచ్చు
టార్గెట్‌: రూ. 367        స్టాప్‌లాస్‌: రూ. 324
కొద్ది రోజులుగా చోళమండలం ఇన్వెస్ట్‌మెంట్‌ షేరు హైయర్‌ టాప్‌, హైయర్‌ బాటమ్‌ను సాధిస్తోంది. కొద్ది నెలలుగా రూ. 335 వద్ద అవరోధాలను ఎదుర్కొంటూ వస్తోంది. అయితే గత వారం ఈస్థాయిలను అధిగమించింది. వెనకడుగు వేస్తున్నప్పటికంటే బలపడుతున్నప్పుడు ట్రేడింగ్‌ పరిమాణం పెరుగుతూ వచ్చింది. ఇది ఈ కౌంటర్‌ మరింత పుంజుకునే సంకేతాలను ఇస్తోంది. రూ. 367 టార్గెట్‌ ధరతో కొనుగోలు చేయవచ్చు. రూ. 324 వద్ద స్టాప్‌ లాస్‌ పెట్టుకోవాలి.

టైటన్‌ కంపెనీ: కొనుగోలు చేయవచ్చు
టార్గెట్‌: రూ. 1428    స్టాప్‌లాస్‌: రూ. 1185
గత కొద్ది నెలలుగా రూ. 1130-1240 స్థాయిలో కదిలిన టైటన్‌ కంపెనీ షేరు క్యూ3 ఫలితాల నేపథ్యంలో బ్రేకవుట్‌ను సాధించింది. షేరు ధర 50, 200 రోజుల చలన సగటు కంటే ఎగువకు చేరింది. వెరసి సమీప భవిష్యత్‌లో చరిత్రాత్మక గరిష్టాన్ని ఛేదించే అవకాశముంది. రూ. 1428 లక్ష్యంతో ఈ షేరు కొనొచ్చు. రూ. 1185 వద్ద స్టాప్‌లాస్‌ మెయిన్‌టెయిన్‌ చెయ్యవలసి ఉంటుంది.

వినయ్‌ రజని, టెక్నికల్‌ అనలిస్ట్‌, హెచ్‌డీఎఫ్‌సీ సెక్యూరిటీస్‌
ఆల్కెమ్‌ లేబ్‌: కొనుగోలు చేయవచ్చు
టార్గెట్‌: రూ. 2700    స్టాప్‌లాస్‌: రూ. 2400
ఇటీవల ఆల్కెమ్‌ లేబ్‌ షేరు రూ. 2558 వద్ద చరిత్రాత్మక గరిష్టాన్ని తాకింది. గత కొద్ది నెలలుగా ఈ కౌంటర్‌ ర్యాలీ చేస్తూ వస్తోంది. నెలవారీ చార్టుల ప్రకారం రౌండింగ్‌ బాటమ్‌ రిజస్టర్‌ అయ్యింది. 100-200 రోజుల చలన సగటుకంటే ఎగువన ట్రేడవుతోంది. తద్వారా బుల్లిష్‌ ధోరణి చూపుతోంది. రూ. 2700 టార్గెట్‌ ధరతో ఈ షేరుని కొనొచ్చు. రూ. 2400 వద్ద స్టాప్‌లాస్‌ పెట్టుకోవాలి.



You may be interested

52 వారాల గరిష్టానికి  58 షేర్లు

Tuesday 11th February 2020

 మంగళవారం 52 వారాల గరిష్టానికి 58 షేర్లు పెరిగాయి. వాటిలో ఆదిత్యా బిర్లా ఫ్యాషన్‌ అండ్‌ రీటైల్‌, ఆదాని ఎంటర్‌ప్రైజెస్‌, ఏజీస్‌ నెట్‌వర్క్స్‌, అజంతా ఫార్మా, అపోలో పైప్స్‌, ఏయూ స్మాల్‌ ఫైనాన్స్‌ బ్యాంక్‌, బజాజ్‌ ఫైనాన్స్‌, భారత్‌ రసాయిన్‌, సెరెబ్రా ఇంటిగ్రేటెడ్‌ టెక్నాలజీస్‌, దివీస్‌ ల్యాబొరేటరీస్‌,  ఎసాబ్‌ ఇండియా, ఎస్కార్ట్స్‌, ఫైన్‌ ఆర్గానిక్‌ ఇండస్ట్రీస్‌, గెలాక్సీ సర్‌ఫ్యాక్టాన్స్‌, జీఎంఎం ఫడ్‌లర్‌, హిందుజా గ్లోబల్‌ సొల్యూషన్స్‌, హెచ్‌ఎల్‌వీలు ఉన్నాయి. 52 వారాల

1.50శాతం పెరిగిన బ్యాంక్‌ నిఫ్టీ

Tuesday 11th February 2020

మార్కెట్‌లో నెలకొన్న కొనుగోళ్లలో భాగంగా మంగళవారం ఉదయం ట్రేడింగ్‌ సెషన్‌లో బ్యాంకింగ్‌ రంగ షేర్లు భారీగా లాభపడ్డాయి. ఫలితంగా ఎన్‌ఎస్‌ఈలో బ్యాంకింగ్‌ రంగ షేర్లకు ప్రాతినిథ్యం వహించే నిఫ్టీ ఇండెక్స్‌ 1.50శాతం లాభపడింది. నేడు ఈ ఇండెక్స్‌ 31,230.20 వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించింది. ట్రేడింగ్‌ ప్రారంభమైనప్పటి నుంచి ఈ రంగ షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభించడంతో 447 పాయింట్లు పెరిగి 31,505.95 వద్ద ఇంట్రాడే గరిష్టాన్ని అందుకుంది. ఉదయం గం.11:30ని.లకు

Most from this category