News


నెలరోజులకు 5 స్టాక్‌ రికమెండేషన్లు

Saturday 8th February 2020
Markets_main1581141144.png-31624

కేంద్రం 2020-21 ఆర్థిక సంవత్సరపు బడ్జెట్‌ ప్రవేశపెట్టడం, ఆర్‌బీఐ కూడా ప్రస్తుత ఆర్థిక సంవత్సరపు చివరి ద్రవ్యపాలసీ సమీక్ష నిర్ణయాలు వెల్లడించిన నేపథ్యంలో దేశీయ స్టాక్‌ మార్కెట్లో కొంత అనిశ్చితి వాతావరణ నెలకొంది. ప్రధాన సూచీలైన సెన్సెక్స్‌ 41వేల రేంజ్‌లో, నిఫ్టీ 12100 స్థాయిలో కదలాడుతున్నాయి. ఈ తరుణంలో నోమురా, నిర్మల్‌ బంగ్‌ బ్రోకరేజ్‌ సంస్థలు 5 షేర్లపై తమ అభిప్రాయాలను వెల్లడించాయి. 

స్టాక్‌ పేరు:- సన్‌ఫార్మా
రేటింగ్‌:- కొనవచ్చు
బ్రోకరేజ్‌ సంస్థ:- నోమురా
పస్తుత ధర:- రూ.430.80
టార్గెట్‌ ధర:- రూ.525.00
కాల పరిమితి:- స్వల్పకాలం(1 నెల)
విశ్లేషణ:- నోమురా ప్రకారం ఫారెక్స్ లాభాలు, కార్పోరేట్‌ పన్ను తగ్గింపు తదితర అంశాలు కలిసిరావడంతో సన్‌ క్యూ3 ఆదాయాలు పెరిగేందుకు సహాయపడ్డాయి.

స్టాక్‌ పేరు:- శ్రీరాం ట్రాన్స్‌పోర్ట్‌ ఫైనాన్స్‌ కంపెనీ లిమిటెడ్‌
రేటింగ్‌:- కొనవచ్చు
బ్రోకరేజ్‌ సంస్థ:- నోమురా 
ప్రస్తుత ధర:- రూ.1223.10
టార్గెట్‌ ధర:- రూ.1400.00
కాలపరిమితి:- స్వల్పకాలం(1నెల)
విశ్లేషణ:- వాణిజ్య వాహనాల ఆస్తి నాణ్యత మెరుగుపడింది. ట్రెండ్‌ ఇలాగే కొనసాగితే.. శ్రీరామ్ ట్రాన్స్‌పోర్ట్ ఫైనాన్స్ రీ-రేటింగ్‌ జరిగే అవకాశం ఉందని  నోమురా బ్రోకరేజ్‌  అభిప్రాయపడింది.

స్టాక్‌ పేరు:- ఎక్సైడ్‌ ఇండస్ట్రీస్‌ లిమిటెడ్‌
రేటింగ్‌:- కొనవచ్చు
బ్రోకరేజ్‌ సంస్థ:- నోమురా 
ప్రస్తుత ధర:- రూ.182.05
టార్గెట్‌ ధర:- రూ.226.00
కాలపరిమితి:- స్వల్పకాలం(1నెల)
విశ్లేషణ:- అటో పరిశ్రమ రికవరి కావడటం ఎక్సైడ్‌ ఇండస్ట్రీస్ వృద్ధిని పెంచుతుంది. కంపెనీ వ్యాల్యూవేషన్స్‌ కూడా చవకగా ఉన్నాయి. ఆర్థిక వ్యవస్థలో మౌలిక సదుపాయాలు పెరగడంతో 2020-21, 2021-22 ఆర్థిక సంవత్సరాల్లో పారిశ్రామిక విభాగంలో వృద్ధి వరుసగా 5శాతం, 10 శాతం చేరుకుంటుందని బ్రోకరేజ్‌ సం‍స్థ అంచనా వేసింది.

స్టాక్‌ పేరు:- శోభ ఇండస్ట్రీస్‌
రేటింగ్‌:- అమ్మవచ్చు
బ్రోకరేజ్‌ సంస్థ:- నిర్మల్‌ బంగ్‌ 
ప్రస్తుత ధర:- రూ.406.05
టార్గెట్‌ ధర:- రూ.360.00
కాలపరిమితి:- స్వల్పకాలం(1నెల) 
విశ్లేషణ:- ధరలు పెంచే శక్తి లేకపోవడం, పెరుగుతున్న ఖర్చుల కారణంగా ప్రస్తుత షేరు వాల్యూయేషన్‌ అధికంగా వున్నట్లు భావించవచ్చు. పేలవమైన నగదు ప్రవాహం , పెరుగుతున్న అప్పులు బ్యాలెన్స్ షీట్ బలహీనపడటం తదితర అంశాలు షేరుకు ప్రతికూలాంశాలుగా ఉన్నట్లు బ్రోకరేజ్‌ సంస్థ చెప్పుకొచ్చింది.

స్టాక్‌ పేరు:-  టీవీఎస్‌ మోటర్‌
రేటింగ్‌:- అమ్మవచ్చు
బ్రోకరేజ్‌ సంస్థ:- నిర్మల్‌ బంగ్‌ 
ప్రస్తుత ధర:- రూ.466.20
టార్గెట్‌ ధర:- రూ.394.00
కాలపరిమితి:- స్వల్పకాలం(1నెల) 
విశ్లేషణ:- ప్రస్తుతం బీఎస్‌-VI మార్పిడి ఖర్చులను మాత్రమే కంపెనీ అధిగమించిందని, అయితే రానున్న రోజుల్లో టీవీఎస్ మోటార్ కంపెనీ మార్జిన్లు ఒత్తిడికి లోనయ్యే అవకాశం ఉందని బ్రోకరేజ్‌ సంస్థ భావిస్తుంది. ఇప్పటివరకు, దాని మోడళ్లైన అపాచీ, జూపిటర్‌ ఎక్స్‌ఎల్ 100 బిఎస్-VI గా మార్చబడ్డాయి. You may be interested

రూ.1100 కోట్లకు ఆధీకృత మూలధనం: యస్‌బ్యాంక్‌ షేర్‌హోల్డర్ల ఆమోదం

Saturday 8th February 2020

ప్రైవేట్ రంగానికి చెందిన యస్‌బ్యాంక్‌ అధీకృత మూలధనాన్ని రూ .1,100 కోట్లకు పెంచుకోవడానికి షేర్‌ హోల్డర్లు ఆమోదం తెలిపారు. ఈ మేరకు బ్యాంక్‌ ఎక్చ్సేంజ్‌లకు సమాచారం ఇచ్చింది. యస్‌ బ్యాంక్‌ శుక్రవారం ముంబైలో అత్యవసర సర్వసభ్య సమావేశాన్ని నిర్వహించింది. బ్యాంక్‌ అధీకృత మూలధనాన్ని రూ .1,100 కోట్లకు పెంచుకోవడానికి షేర్‌ హోల్డర్లు ఆమోదం తెలిపారు. అలాగే ఈక్విటీ షేర్లు లేదా రూ .10,000 కోట్ల విలువైన కన్వర్టబుల్‌ సెక్యూరిటీల జారీ ద్వారా

అనిల్‌ అంబానీ విలువ ‘జీరో’

Saturday 8th February 2020

యూకే కోర్టుకు అనిల్‌ వివరణ ఆర్‌కామ్‌పై చైనా బ్యాంకుల కేసు నేపథ్యం ప్రభుత్వ రంగానికి చెందిన మూడు చైనా బ్యాంకులు చేసిన ఫిర్యాదులో భాగంగా యూకే కోర్టు 10 కోట్ల డాలర్ల(సుమారు రూ. 700 కోట్లు)ను డిపాజిట్‌ చేయమని అడాగ్‌ చైర్మన్‌ అనిల్‌ అంబానీని ఆదేశించినట్లు వార్తలు వెలువడ్డాయి. 70 కోట్ల డాలర్ల(రూ. 4,900 కోట్లు) రుణ చెల్లింపుల్లో రిలయన్స్‌ కమ్యూనికేషన్స్‌ విఫలమైన నేపథ్యంలో అనిల్‌ అంబానీపై మూడు చైనీస్‌ బ్యాంకులు లండన్‌

Most from this category